కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ప్రతిరోజూ లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ మహమ్మారి ని పారదోలాలంటే.. అందరూ కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొందరు వ్యాక్సిన్ వేయించుకోగా.. ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

కాగా.. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందు.. వేయించుకున్న తర్వాత కూడా కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు

వ్యాక్సిన్ సమయంలోనూ శరీరానికి రోగనిరోధక శక్తి అవసరమేనట. మరి.. ఎలాంటి ఆహారాలు తినాలి..? అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి డైట్ ఫాలో కావాలో ఇప్పుడు చూద్దాం..

వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందు.. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కచ్చితంగా బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలట. అలాకాకుండా బాడీ డీహైడ్రేటెడ్ అయిపోతే.. చాలా ప్రమాదమట. అందుకే ఎక్కువ మొత్తంలో నీరు, నీరు ఎక్కువగా ఉండే పండ్లు, సూపులు, వెజిటేబుల్ జ్యూస్ లు తాగాలని సూచిస్తున్నారు.

వ్యాక్సిన్ వేయించుకోవడానికి కనీసం రెండు, మూడు రోజుల ముందు మద్యం సేవించకూడదు. అంతేకాదు.. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా మద్యానికి దూరంగా ఉండాలి. పట్టించుకోకుండా మద్యం తాగితే.. శరీరమంతా డీహైడ్రేట్ అయిపోతుంది. దాని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే వాటికి దూరంగా ఉండాలి.

వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లే ముందు రోజు ప్రశాంతంగా నిద్రపోవాలి. సరిపోను నిద్రపోయినప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆ తర్వాత కూడా ప్రశాంతంగా నిద్రపోవాలి. ఎలాంటి భయాలు పెట్టుకోకూడదు.

ఇక ఆహారం విషయానికి వస్తే... కేవలం ఇంట్లో వండిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.