గుండె జబ్బులో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది మరణానికి కారణమవుతున్నాయని సర్వేలు వెళ్లడిస్తున్నాయి. రోజురోజుకూ గుండె సంబంధిత వ్యాధుల సంఖ్య పెరుగుతుండటంతో జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఈ వ్యాధికి ప్రధాన కారణం ధమనులు మూసుకుపోవడమేనంటున్నారు నిపుణులు. ధమనులు ఆరోగ్యంగా ఉంటే రక్త ప్రవాహం మెరుగ్గా సాగుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం సరఫరా సమతుల్యంగా చేరుతుంది. కానీ ధమనులు మూసుకుపోతే రక్తప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల కావాల్సిన మొత్తంలో మన గుండెకు రక్తం చేరదు. దీని వల్ల గుండె సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
అయితే ధమనులు పూర్తిగా మూసుకుపోయే ముందు మనకు కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తాయి. వాటిని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే గుండెను కాపాడుకోవచ్చు. గుండె జబ్బుల బారి నుంచి తప్పించుకోవచ్చు. ఈ సంకేతాలను గనుక లైట్ తీసుకుంటే మీకు గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ధమనులు మూసుకుపోవడానికి కారణమేంటి?
ధమనులలో ఫలకం పేరుకుపోవడానికి అధిక కొలెస్ట్రాల్ అతిపెద్ద ప్రమాద కారకాలలో ఒకటని నిపుణులు అంటున్నారు. కొలెస్ట్రాల్ అనేది కొవ్వు. ఇది మన రక్తంలో ఉంటుంది. అలాగే మన ధమనులు, సిరల గోడలపై పేరుకుపోతుంది. అయితే మీ రక్తనాళం గోడలపై కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు పేరుకుపోయినప్పుడు.. రక్తం వెళ్ళే స్థలం చిన్నగా మారుతుంది. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు రావడానికి కుటుంబ చరిత్ర పెద్ద పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. దీనితో పాటుగా స్మోకింగ్, అధిక కొవ్వు లేదా అధిక కొలెస్ట్రాల్ ఆహారం, నిశ్చల జీవనశైలి, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు లేదా ఊబకాయం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ధమనులు మూసుకుపోయే ముందు మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఛాతీ నొప్పి
ధమనులు ఇరుగ్గా మారినప్పుడు ఛాతీ నొప్పి వస్తుంది. ఇది సర్వ సాధారణ సంకేతం. ధమనుల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు మీ ఛాతీలో ఒత్తిడి లేదా బరువుగా అనిపిస్తుంది. ధమనులు ఇరుగ్గా మారడం వల్ల గుండెకు తగినంత రక్తం అందక ఛాతీలో నొప్పి వస్తుంది. దీనివల్ల ఛాతీ మధ్య లేదా ఎడమ వైపు నొప్పి వస్తుంది. అయితే ఈ నొప్పి కొంతమంది ఆడవారిలో విపరీతంగా వస్తుంది. అలాగే ఛాతీతో పాటుగా మెడ, చేయి లేదా మెనక భాగంలో కూడా ఈ నొప్పి వస్తుంది.
high blood pressure
అధిక రక్తపోటు
ధమనులు మూసుకుపోయినప్పుడు రక్తప్రసరణ మామూలుగా ఉండదు. దీనివల్ల శరీరంలోని భాగాలకు సరిగ్గా రక్తం చేరదు. దీనివల్ల రక్తపోటు పెరిగి సిరలపై ఎక్కువ భారం పడుతుంది. అలాగే మీ గుండెపై ఎక్కువ భారం పడుతుంది. దీనివల్ల హృదయ సంబంధ సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
leg cramps
చేతులు, కాళ్ల తిమ్మిరి, బలహీనత
ధమనులు మూసుకుపోయినప్పుడు శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరగదు. దీని వల్ల శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. దీనివల్ల మీ శరీరం బలహీనపడుతుంది. అలాగే మీ చేతులు, చేతి వేళ్లు, చేతులు మొద్దుబారడం ప్రారంభిస్తాయి. అలాగే చిన్న చిన్న పనులు చేసినా త్వరగా అలసిపోతారు. ఇది మీ ధమనులు మూసుకుపోవడానికి సంకేతం.
అంగస్తంభన లోపం
ధమనులు మూసుకుపోవడం వల్ల పురుషాంగంలో రక్తప్రసరణ సరిగా జరగదుజ. దీని వల్ల పురుషులు అంగస్తంభన లోపం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీ భాగస్వామిలో అంగస్తంభన సమస్యతో పాటుగా ఇతర లక్షణాలు గనుక కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.
Irregular heartbeats
క్రమరహిత హృదయ స్పందన
ధమనులు మూసుకుపోయినప్పుడు మీ హృదయ స్పందన సరిగ్గా ఉండదు. అలాగే ఏదైనా పని చేసిన తర్వాత అకస్మాత్తుగా హృదయ స్పందన రేటు పెరగడం లేదా భావోద్వేగ కారణాల వల్ల హృదయ స్పందనలో మార్పులు వంటి లక్షణాలను లైట్ తీసుకోకండి. ఇది ప్రమాదానికి సంకేతం కావొచ్చు.
శ్వాస ఆడకపోవడం
ధమనులు మూసుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు లోతైన శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయినా సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోతుంటారు. మీకు ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదు అన్న భావన కలుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దీనిని ఎప్పుడూ విస్మరించకండి.