వీటిని తింటే డయాబెటీస్ వస్తుంది జాగ్రత్త..

First Published May 27, 2023, 7:15 AM IST

డయాబెటీస్ రావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఫుడ్ ఒకటి. ఏది పడితే అది తింటే డయాబెటీస్ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

diabetes

మన మొత్తం ఆరోగ్యం మన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి ఆహార అలవాట్లు ఒకేలా ఉండవు. ఏవి పడితే అవి తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరగడంతో పాటుగా డయాబెటీస్ కూడా వస్తుంది. నిజానికి టైప్ 2 డయాబెటీస్ రావడానికి ఫుడ్ యే ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. ఎలాంటి వాటిని తింటే డయాబెటీస్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

చక్కెరను ఎక్కువగా తీసుకోవడం

చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతారు. అంతేకాదు ఇది ఇన్సులిన్ నిరోధకతకు కూడా దారితీస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, పానీయాలలో సోడా, మిఠాయి, స్వీట్లు, తియ్యని తృణధాన్యాలు ఉన్నాయి.

ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు 

వైట్ బ్రెడ్, తెల్ల బియ్యం, పాస్తా శుద్ధి చేసిన ధాన్యాలకు ఉదాహరణలు. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు తొందరగా పెరిగేలా చేస్తాయి. ఇది చివరికి ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. అలాగే డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.

fiber

ఫైబర్ లేకపోవడం

తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ డైటరీ ఫైబర్ లేని ఆహారాలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుతుంది. అయితే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నియంత్రిస్తుంది. 

Image: Getty Images

అనారోగ్యకరమైన కొవ్వులు

సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్స్  ను తీసుకోవడం వల్ల కూడా టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవి ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాలు, అధిక కొవ్వు పాల ఉత్పత్తులలో ఉంటాయి. ఈ లిపిడ్ల వల్ల ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత ఏర్పడతాయి.
 

అతిగా తినడం 
 
అతి ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాదు. ఫుడ్ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. రోజూ అతిగా తినడం వల్ల బరువు బాగా పెరిగిపోతారు. అలాగే ఊబకాయం బారిన పడతారు. ఇవి టైప్ 2 డయాబెటిస్ కు ముఖ్యమైన ప్రమాద కారకాలు.

భోజనం స్కిప్ చేయడం

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి లేదా తగ్గడానికి భోజనాన్ని స్కిప్ చేయడం కూడా ఒక కారణమేనంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల మీరు తర్వాత రోజు అతిగా తింటారు. అలాగే రక్తంలో చక్కెర నియంత్రణను బలహీనపరుస్తుంది.
 

ప్రాసెస్ చేసిన, ఫాస్ట్ ఫుడ్స్ ను తినడం

ప్రాసెస్ చేసిన, రెడీ టూ ఈట్ ఫుడ్ ను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు, అదనపు చక్కెరలు, సోడియం లు ఎక్కువగా ఉంటాయి.  
 

click me!