ఈ మూడు ఆసనాలతో మీ గుండె సేఫ్

First Published | Aug 20, 2024, 1:07 PM IST

ఆరోగ్యమే మహా భాగ్యం అని పెద్దలు ఏనాడో చెప్పారు.  శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఏ టార్గెట్‌ అయినా సాధించగలం. అలాంటి శరీరానికి గుండె ప్రాణం. మరి ప్రాణం నిలబెట్టే గుండెను కాపాడుకోవాలంటే చాలా మంచి యోగాసనాలున్నాయి. వాటిలో ముఖ్యమైన మూడింటి గురించి తెలుసుకుందాం.. వీటిని రోజూ ప్రాక్టీస్‌ చేయడం ద్వారా మీ గుండెను భద్రంగా ఉంచుకోవచ్చు. 
 

 ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్‌ హాబిట్స్‌( ఆహారపు అలవాట్లు) పాటించాలి. అంతేకాకుండా వ్యాయామం, యోగా కూడా ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా గుండె పనితీరును సక్రమంగా మెయిన్‌టెయిన్‌ చేయడం చాలా అవసరం. అలా చేయాలంటే ఎక్సర్‌సైజ్‌తో పాటు యోగా చాలా ముఖ్యం.
 

తాడాసన..

తాడాసన.. ఇది శరీరాన్ని తాడులాగా మార్చే ఆసనం. సంస్కృతంలో తాడ అంటే చెట్టు అని అర్థం. ఈ ఆసనం ఎలా వేయాలంటే.. రెండు చేతులను పైకి లేపి కలపాలి. వాటిని అలానే ఉంచి మీ శక్తి మేరకు నడుమును వెనక్కు వంచాలి. బలాన్నంతా కాళ్లపై ఉంచాలి. తలను మాత్రం పైకి  ఉంచి ఆకాశం కేసి చూడాలి.  ఇలా కనీసం 30 సెకన్ల నుంచి 1 నిమిషం వరకు ఉండాలి. ఈ ఆసనం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది.  నడుము, మెడ సమస్యలు ఉన్నవారు వైద్యులు, యోగా టీచర్ల సలహాలు తీసుకొని చేయాలి.
 


చక్రాసనం..

చక్రాసనం అంటే శరీరాన్ని బాణంలా వంచడం. ఇది గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. ఈ ఆసనం వల్ల చేతి కండరాలు స్ట్రాంగ్‌గా మారతాయి. దీన్ని ప్రతిరోజూ ప్రాక్టీస్‌ చేయవచ్చు. ఇది మంచి యోగాసనం. చక్రాసనం ఎలా చేయాలంటే.. ముందుగా నేలపై పడుకొని చేతులు, కాళ్ల సాయంతో నడుము భాగాన్ని పైకి ఎత్తాలి. దీన్నే చక్ర భంగిమ అంటారు. నడము, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈ ఆసనం వేయడం సరికాదు. వైద్యులు, యోగా నిపుణుల సలహాలు తీసుకోవాలి. అయితే గుండె పనితీరు మెరుగు పరిచేందుకు ఇది చాలా మంచి ఆసనం. 

ఉత్తానాసనం..

ఉత్తానాసనం చేయడం వల్ల తొడలు, మోకాళ్లపై ఒత్తిడి పడుతుంది. ఇది కండరాలను ఫ్లెక్సిబుల్‌గా మారుస్తుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. ఉత్తానం అంటే సంస్కృతంలో ఎత్తడం అని అర్థం. ఈ ఆసనం వేయడానికి ముందుగా నిటారుగా నిలబడాలి. నెమ్మదిగా కిందికి వంగి చేతులతో మీ పాదాలను తాకాలి. తలను కూడా కిందికి వంచాలి. చేతలను కాళ్ల వెనుక నుంచి పట్టుకోవాలి. ఇలా 30 నుంచి 1 నిమిషం ఉండటం ప్రాక్టీస్‌ చేయాలి. ప్రెగ్నెంట్‌ లేడీస్‌ ఈ ఆసనం చేయకూడదు. గొంతు, వెన్ను నొప్పి ఉన్న వారు నిపుణుల సలహాలు తీసుకొని చేయాలి.

Latest Videos

click me!