ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ఫోన్లు, కంప్యూటర్ లతో కాలం గడిపేస్తూన్నారు. మరి ఇన్నిన్ని గంటల పాటు.. పోన్లు, ట్యాబ్ లు, కంప్యూటర్లు చూస్తూ ఉంటే..కళ్లు ఆరోగ్యంగా ఉండగలవా..? చాలా చిన్న వయసులోనే కంటి చూపు మందగిస్తుంది. ఫలితంగా.. కళ్ల జోళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. మరి, అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే.. మనం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుందట. మరి ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటో ఓసారి చూద్దాం..
ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండే ఆహారం తీసుకుంటే.. కళ్లు ఆరోగ్యంగా ఉాంటాయట. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే న్యూట్రియంట్స్ ఎక్కువగా.. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లో పుష్కలంగా ఉంటాయట. వాటిని కనుక మన రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే.. ఈ సమస్య రాదు అని నిపుణులు చెబుతున్నారు.
1.బాదంపప్పు..
బాదం పప్పు తింటే.. జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది అని చాలా మంది చెబుతుంటారు.కానీ, కేవలం జుట్టు రాలే సమస్య మాత్రమే కాదు, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ బాదం పప్పు కీలకంగా పనిచేస్తుంది. కంటిపై పడే ఒత్తిడిని తగ్గించేస్తుంది. మోత్తం కంటి ఆరోగ్యానికి ఎంతగానో సహాయం చేస్తుంది.
2.వాల్ నట్స్..
చాలా మంది వాల్ నట్స్ ని పెద్దగా తినడానికి ఇష్టపడరు. కానీ, వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి చాలా ఎక్కువగా సహాయం చేస్తాయి. వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి పవర్ హౌస్ లా పని చేస్తాయిని చెప్పొచ్చు. డ్రై కంటి సమస్య ఉన్నవారికి ఈ వాల్ నట్స్ ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తాయి.
3.పిస్తా..
పిస్తా పప్పులను సైతం మనం మన డైట్ లో భాగం చేసుకోవాలి. అవి.. మన కంటి చూపును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వయసు రిత్యా కంటిలో వచ్చే సమస్యలను సైతం తగ్గించడంలో పిస్తా పప్పులు సహాయం చేస్తాయి.
Dried Apricots
4.ఆప్రికాట్..
ఆప్రికాట్ లో బీటా కెరోటిన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి.. మన కంటి చూపు మెరుగుపరచడంలో కీలకంగా పని చేస్తాయి. విటమిన్ ఏ ఉన్న ఆహారాలు తీసుకుంటే.. మన కంటి చూపు మెరుగుపడుతుతంది.
5.రైజిన్స్..
వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, పాలి ఫెనాలిక్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే..వీటిని కూడా మనం మన రెగ్యులర్ డైట్ లో భాగం చేసుకుంటే.. పూర్తి కంటి చూపు ఆరోగ్యానికి సహాయపడుతుంది.
6.బ్లూ బెర్రీస్..
బ్లూ బెర్రీస్ పండ్లు కూడా డ్రై గా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని తినడం వల్ల.. మన నైట్ విజన్ ఇంప్రూవ్ అవుతుంది. వయసు రిత్యా వచ్చే కంటి సమస్యలను వీటితో కంట్రోల్ చేయవచ్చు.
7.కర్జూర..
కర్జూరాల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇవి.. కూడా మొత్తం కంటి చూపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి, వీటిని కూడా కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి.