మద్యం సేవించేటప్పుడు ఈ పదార్థాలు తీసుకుంటున్నారా అయితే ఏం జరుగుతుందో చూడండి?

First Published Jan 2, 2022, 9:50 AM IST

వయసుతో సంబంధం లేకుండా రోజురోజుకు మందుబాబుల సంఖ్య పెరిగిపోతోంది. మద్యపానం (Alcohol) ఒక మత్తు లాంటిది. మద్యం సేవిస్తే మన అనారోగ్య సమస్యలను మనమే కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది. చాలామంది మద్యానికి బానిసలైపోతున్నారు. మరి కొందరు దీన్ని సరదాగా, ఫ్యాషన్ గా భావించి మితంగా తీసుకున్నా దీని ప్రభావం మెల్లమెల్లగా మన శరీర అవయవాల మీద పడుతుంది. 

కనుక మితమైన మద్యపానం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే మద్యం సేవించే సమయంలో కొన్ని పదార్థాలను తీసుకుంటే అనారోగ్య సమస్యలు (Illness issues) వస్తాయని ఒక పరిశోధనలో తేలింది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా మద్యం సేవించే సమయంలో తీసుకోకూడని పదార్ధాల గురించి తెలుసుకుందాం.. 

కొంతమంది బాధలో (Suffering) ఉన్నప్పుడు మద్యం సేవిస్తే, మరికొందరు ఆనందంగా (Happy) ఉన్నప్పుడు మద్యం సేవిస్తారు. మరి కొందరు పూర్తిగా మద్యపానానికి బానిసలైపోయి ఆ మత్తులో మునిగి తేలుతుంటారు. అయితే మద్యం తాగడమే అనారోగ్యము అనుకుంటే మద్యం సేవించే సమయంలో తీసుకునే ఆహారపదార్థాలు కూడా అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయని ఒక పరిశోధనలో తేలింది.
 

మద్యం సేవించే సమయంలో కొందరు ఏ స్టఫ్ (Stuff) లేకున్నా గ్లాసుల కొద్దీ లాగించేవాళ్లు ఉన్నారు. మరి కొందరు స్టఫ్ లేకుండా మందు తాగడానికి ఇష్టపడరు. ఇలా స్టఫ్ కోసం ఉపయోగించే కొన్ని ఆహారపదార్ధాలు ఆరోగ్యానికి హాని (Harm) కలిగిస్తాయి. ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మద్యం సేవించే సమయంలో జీడిపప్పు, వేరుశనగలను తినడానికి చాలా మంది ఇష్టపడతారు.
 

కానీ వీటిని తీసుకోరాదని తాజా సర్వేలో తేలింది. ఈ రెండు పదార్థాలలో ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడంతో గుండెపోటు (Heart attack) వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక మద్యం సేవించే సమయంలో ఈ రెండు పదార్థాలు తినకపోవడమే మంచిది. మద్యం సేవిస్తూ వీటిని తీసుకుంటే వాంతులు (Vomiting) చేసుకునే అవకాశం ఉంటుంది.  
 

మద్యం సేవించే సమయంలో, తరువాత వెంటనే జిడ్డు పదార్థాలను తినరాదు. వీటి కారణంగా కడుపులో మంట, కడుపులో గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే చాలామంది చిప్స్‌ను స్టఫ్‌ గా తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే చిప్స్‌ను తీసుకుంటే చాలా దాహం (Thirst) వేసి మరింత ఎక్కువ మద్యం సేవిస్తారు. మద్యం సేవించే సమయంలో సోడా, శీతలపానీయాలతో (Soft drinks) కలిపి తాగరాదు. 

ఇలా తాగితే శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. కనుక మద్యంలో నీటిని కలుపుకొని సేవించాలి.  అలాగే మద్యం సేవించే సమయంలో పాల ఉత్పత్తులకు (Dairy product) సంబంధించిన పదార్థాలను గంట వరకు తినరాదు. పాల ఉత్పత్తులను తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు (Digestive problems) ఏర్పడతాయి. తీపి పదార్థాలను కూడా మద్యం సేవించే సమయంలో తినకూడదు. వీటిని తింటే మరింత మద్దతు ఏర్పడి మనిషి నియంత్రణ కోల్పోతారు.

click me!