తిన్నది అరగకపోవడానికి కారణం ఇదే..! ఈ చిట్కాలను పాటిస్తే సమస్య ఉండదు

First Published | Sep 4, 2023, 7:15 AM IST

అజీర్థి సమస్యలతో భాదపడేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ సమస్య ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ ను పాటిస్తే సమస్య ఉండదు. 
 

Indigestion

అజీర్ణం చాలా మంది ఫేస్ చేసే ఒక సాధారణ సమస్య. తిన్నది అజీర్ణం కావడం, కడుపు ఉబ్బరం, ఛాతీలో మంట, గుండెలో మంట, పని చేయడంలో ఇబ్బంది వంటివి అజీర్థి లక్షణాలు. ఇక ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొంతమంది జీర్ణ మాత్రలను వాడుతుంటారు. ఇంకొంత మంది సోడాలు తాగుతుంటారు. అయినప్పటికీ.. ఇవి మీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించవు. అజీర్థికి అసలు కారణాలేంటో తెలుసుకుంటే ఈ సమస్యను సులువుగా తగ్గించుకోవచ్చు. 

indigestion

అజీర్థికి కారణాలు 

అతిగా తినడం: అతిగా తినడం వల్ల ఫాస్ట్ గా బరువు పెరగడమే కాదు ఎన్నో ఇతర సమస్యలు కూడా వస్తాయి. అందులో అజీర్థి ఒకటి. అవును అతిగా తిన్నా, ఫాస్ట్ ఫాస్ట్ గా తిన్నా అజీర్థి సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు అలవాట్లు మీ జీర్ణక్రియపై భారాన్ని పెంచుతాయి. దీంతో తిన్నది అరుగదు.

Latest Videos


స్పైసీగా తినడం: స్పైసీగా తినే తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. స్పైసీ, మసాలా దినుసులు రుచిగా అనిపించినా.. ఇవి మీ పొట్టను చికాకుపెడతాయి. అంతేకాదు ఇది అజీర్ణానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
 

Indigestion

ఆమ్ల ఆహారం: టమాటాలు, సిట్రస్ పండ్లు, ఆమ్ల పానీయాలు కూడా అజీర్థికి దారితీస్తాయి. ః

ధూమపానం: స్మోకింగ్ తో ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. ధూమపానం ఒక్క ఊపిరితిత్తులపైనే కాదు మీ జీర్ణక్రియపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ అలవాటు జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది, అలాగే తిన్నది అరగకుండా చేస్తుంది. 
 

కెఫిన్, ఆల్కహాల్: టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ వంటి కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉండే పానీయాలు టేస్టీగా ఉంటాయి. కానీ వీటిని మరీ ఎక్కువగా తాగితే అజీర్థి సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆల్కహాల్ మీ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ఈ పానీయాలు కడుపులోని ఆమ్లాన్ని తగ్గిస్తాయి. అలాగే గుండెల్లో మంటను కలిగిస్తాయి. అజీర్ణం సమస్య బారిన పడేస్తాయి. 

పెరిగిన ఒత్తిడి : అధిక ఒత్తిడి, యాంగ్జైటీ మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాదు.. మీ జీర్ణక్రియకు కూడా అంతరాయం కలిగిస్తాయి. ఇవి అజీర్థి సమస్యకు కారణమవుతాయి. 


గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ : దీర్ఘకాలిక యాసిడ్ రిఫ్లక్స్ సమస్య కూడా గుండెల్లో మంట, అజీర్ణం సమస్యను కలిగిస్తుంది. 

మందులు: నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వంటి కొన్ని మందులు కూడా అజీర్ణానికి దారితీస్తాయి.

పెప్టిక్ అల్సర్స్: కడుపు లోపలి భాగంలోని ఈ అల్సర్లు కూడా అజీర్ణానికి కారణమవుతాయి.

జీర్ణ సమస్యలు: ప్రకోప ప్రేగు సిండ్రోమ్, గ్యాస్ట్రైటిస్, ఉదరకుహర వ్యాధి వంటి సమస్యలు కూడా అజీర్థిని కలిగిస్తాయి. 
 

ఇలా తగ్గించండి..

జీలకర్ర నీరు: పావు లీటరు వాటర్ లో రెండు టీస్పూన్ల జీలకర్రను వేసి బాగా మరిగించండి. నీరు సగం కాగానే స్టవ్ ఆఫ్ చేయండి. ఈ వాటర్ చల్లారిన తర్వాత వడగట్టి  తాగండి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్థి సమస్య పోతుంది. 
 

తులసి, పుదీనా టీ: ఈ టీని తయారుచేయడానికి పుదీనా ఆకులు, తులసి ఆకులను బాగా కడగండి. వీటిని పావు లీటరు నీటిలో వేసి మరిగించాలి. ఈ నీళ్లు సగం కాగానే స్టవ్ ఆఫ్ చేయండి. ఈ వాటర్ గోరు వెచ్చగా ఉన్నప్పుడు వడకట్టకుండా ఆకులతో పాటు అలాగే తాగండి. దీన్ని క్రమం తప్పకుండా తాగితే అజీర్థి సమస్యే ఉండదు. అంతేకాదు ఈ టీ మీ శరీరంలోని మలినాలను కూడా తొలగిస్తుంది. మీ ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. 

అల్లం రసం: మన పెద్దలు అల్లం రసాన్ని విరేచనాలు, పిత్తం వంటి సమస్యలకు ఉపయోగించేవారు. అయితే ఇది అజీర్థి సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం అల్లం ముక్కను గ్రైండ్ చేసి అర గ్లాసు నీటిలో వేసి మరిగించండి. ఈ వాటర్ సగం కాగానే దించి వడకట్టండి. చల్లారిన తర్వాత తాగితే అజీర్థి సమస్య తగ్గిపోతుంది. 
 

click me!