వెన్నునొప్పికి కారణాలు
వీపు ఎముకలు, కండరాలు, స్నాయువుల సమస్యల వల్ల కూడా వెన్ను నొప్పి సమస్య వస్తుంది. అలాగే కడుపును ఏదైనా సమస్య ఉంటే కూడా విపరీతమైన వెన్ను నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటుగా టూ వీలర్ పై దూర ప్రయాణాలు చేయడం, పోషకాహార లోపం, స్థూలకాయం కూడా వెన్నునొప్పికి దారితీస్తాయి. ముఖ్యంగా కంప్యూటర్ ముందు గంటలకు గంటలు కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. ఇది నొప్పిని కలిగిస్తుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వెన్నుపామును బలోపేతం చేయడానికి యోగా, వ్యాయామాలు కూడా చేయాలని వైద్యులు చెబుతున్నారు.