నెయ్యి తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

First Published | Aug 20, 2024, 12:45 PM IST

నెయ్యిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం నెయ్యిని అస్సలు తినరు. దీనివల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుకుంటారు. 
 


భారతదేశంలోని ప్రతి ఇంట్లో నెయ్యిని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది ఫుడ్ రుచిని పెంచుతుంది. చాలా మంది నెయ్యిని వివిధ మార్గాల్లో తింటుంటారు. కానీ నెయ్యి ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతాయని అనుకుంటారు.  ఈ కొలెస్ట్రాల్ లేనిపోని రోగాలకు దారితీస్తుంది. అందుకే నెయ్యి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతుందో? లేదో? ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

శరీరంలో కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది? 

మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో నూనె లేదా ఆయిలీ ఫుడ్స్ ను ఎక్కువగా తినడం ఉంది. అలాగే డయాబెటీస్, డయాబెటిస్ లేదా ఊబకాయం, పేలవమైన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం వంటివి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతాయి. 
 


ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమౌతుంది? 

మీన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే మీకు స్ట్రోక్, గుండెపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధులొచ్చే ముప్పు చాలా వరకు పెరుగుతుంది. మొత్తంగా కొలెస్ట్రాల్ మీ ప్రాణాలను రిస్క్ లో పెడుతుంది. 
 

నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? 

శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం అనేది మీరు తినే నెయ్యి నాణ్యత, వినియోగించే పరిమాణంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. 
 

ghee

నెయ్యి ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా

నెయ్యిని ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. దీనివల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి.అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా కొలెస్ట్రాల్ సమస్య ఉంటే అది మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిలో మీరు నెయ్యిని ఎక్కువగా తినకూడదు. 
 


ఎవరు నెయ్యి తినకూడదు

గుండె జబ్బులు ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు నెయ్యిని తినకూడదు. ఎందుకంటే ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. ఏదేమైనా నెయ్యిని తక్కువ మొత్తంలోనే తినాలి. అలాగే మీరు తినే నెయ్యి నాణ్యత బాగా ఉండాలి. మార్కెట్ లో దొరికే ప్యాకేజ్డ్ నెయ్యిని తినడం మానేస్తేనే మంచిది. 

Latest Videos

click me!