అందమైన పెదాల కోసం ఈ 6 చిట్కాలు ట్రై చేసి చూడండి..?

First Published Oct 27, 2021, 6:35 PM IST

ప్రస్తుతం అందరూ వివిధ రకాల చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా పెదాల (Lips) సమస్య కూడా. ఇక ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం పెదాల సమస్యలను తగ్గించి పెదాలకు సరిపడు తేమను అందించి వాటిని కోమలంగా ఉంచ‌డంలో సహాయపడే సహజసిద్ధమైన హోమ్ (Natural home remedies) రెమెడీస్ తయారీ విధానం గురించి తెలియచేయడం.
 

పెదాలకు (Lips) ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. కొందరికి అన్ని కాలాలలోనూ పెదల సమస్య బాధిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆహారం తీసుకునేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది.రక్తాలు, పగుళ్ళు, మాట్లాడేటప్పుడు ఇబ్బందులు (Difficulties) కూడా ఉంటాయి.
 

కాబట్టి వాటి నుండి ఉపశమనం పొందడానికి ఆర్టిఫిషియల్ క్రీములు (Artificial creams) కాకుండా సహజసిద్ధమైన (Natural) రెమిడీలను ఉపయోగించడం మంచిది. ఇప్పుడు ఆ టిప్స్ గురించి తెలుసుకుందాం.
 

ఐదు వంతుల నిమ్మరసంలో (Lemon juice) ఒక వంతు గ్లిజరిన్ (Glycerin) వేసి కలిపిన మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు పెదాలకు అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్ర‌తి రోజు చేస్తే పెదాలు పొడి బారకుండా మంచి తేమను కలిగి ఉంటాయి.
 

ఒక టీ స్పూన్ తేనెకు (Honey) సగం టీ స్పూన్ నిమ్మరసం (Lemon juice) కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేయాలి. కొన్ని నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. దీంతో పెదాలు మరింత కోమలంగా, మృదువుగా మారుతాయి.
 

పెదాల సంరక్షణకు బాదం నూనె (Almond oil), కొబ్బరి నూనె (Coconut oil) ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ రెండింటినీ సమాన మోతాదులో తీసుకొని కలుపుకోవాలి. ఈ నూనెను పెదాలపై అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా పెదలపై నలుపుదనాన్ని తగ్గిస్తాయి. 
 

కొంచెం పెరుగులో (Curd) కుంకుమ (saffron)
రేకులను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు పెదాలపై అప్లై చేయడం వల్ల పెదాలు మృదువుగా మారి, పెదాల పగుళ్ల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కాస్త చల్లదనం గా అనిపిస్తుంది.
 

సగం కప్పు పచ్చిపాలలో (Milk) రెండు టీ స్పూన్ల గులాబీ రేకులరసం (Rose petal juice) కలిపి  మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమానికి ఒక టీ స్పూన్ బాదం ఆయిల్, ఒక టీస్పూన్ గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేయడం ద్వారా చర్మ మృత కణాలు తగ్గుతాయి. 
 

ఇప్పుడు వచ్చే చలికాలంలో (Winter) ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి సహజసిద్ధమైన టిప్స్ ఇంట్లో ప్రయత్నించండి. అవి పెదాలు పొడిబారకుండా, నిర్జీవంగా మారకుండా రక్షిస్తాయి. దీంతో పెదాలు అందంగా (Beautifully) కనిపిస్తాయి.

click me!