వర్షంలో హాట్ హాట్ అలసంద వడలు తింటే ఆహా అనాల్సిందే.. తయారీ విధానం ఏంటంటే?

First Published Nov 19, 2021, 12:55 PM IST

అలసందలు (Alasandalu) ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. అలసందలలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక  మంచి స్నాక్స్ ఐటమ్స్. దీని తయారీ విధానం చాలా సులభం. మీ పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఈ వడలు నచ్చుతాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా అలసంద వడలు తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

అలసందలు గుండె పనితీరును మెరుగుపరచడానికి చక్కగా పనిచేస్తుంది. అలసందలను తీసుకుంటే జీర్ణక్రియ (Digestion) మెరుగుపడుతుంది. మధుమేహం ఉన్న వారికి ఇది ఆరోగ్యకరమైన ఆహారం. ఇలా ఎన్నో పోషక విలువలు (Nutritional values) ఉన్న అలసందలతో వడలు చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ వడలు తయారీ విధానం దానికి కావలసిన పదార్థాలు గురించి తెలుసుకుందాం..
 

కావలసిన పదార్థాలు: ఒక కప్పు అలసందలు(Alasandalu), ఒక ఉల్లిపాయ (Onion), సగం టీ స్పూను జీలకర్ర (Cumin seeds), తగినంత ఉప్పు (Salt), తరిగిన కొత్తిమీర (Coriyander), తరిగిన కరివేపాకు (Curries), సగం టీ స్పూన్ కారం పొడి (Red chill powder), రెండు పచ్చిమిరపకాయలు (Green Chilies), కొంచెం అల్లం ముక్క (Ginger), ఢీ ఫ్రై కి సరిపడు నూనె (Oil).
 

తయారీ విధానం: మొదట అలసందలను ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న (Soak) అలసందలను శుభ్రపరచుకొని నీటిని వంపి మిక్సీ జార్ లో తీసుకోవాలి. ఇందులో రెండు పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం (Ginger) ముక్క వేసి బరకగా మిక్సి పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన మొత్తం అలసందల పిండిని ఒక గిన్నెలో (Bowl) తీసుకోవాలి.
 

ఇప్పుడు ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సగం టీ స్పూన్ జీలకర్ర, తరిగిన కొత్తిమీర, సగం టీ స్పూన్ కారం, సరిపడు ఉప్పు (Salt), తరిగిన కరివేపాకు వేసి బాగా కలపాలి. నీళ్లు లేకుండా కలుపుకోవాలి.
ఇలా కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఢీ ఫ్రై కోసం ఒక కడాయిని తీసుకుని స్టవ్ మీద పెట్టి ఆయిల్ (Oil) వేసి వేడి చేయాలి.

ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో అలసందల పిండిని వడల్లా చేత్తో ఒత్తుకుని ఆయిల్ లో వేసి ఢీ ఫ్రై చేసుకోవాలి. వడలు మంచి కలర్ (Colour) వచ్చేలా రెండువైపులా మీడియం మంట (Medium flame) మీద వేయించుకోవాలి. ఇలా తయారైన వడలను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం పిండిని వడలులా తయారు చేసుకోవాలి.

అంతే ఎంతో రుచికరమైన కరకరలాడే అలసంద వడలు రెడీ. ఈ వడలను చట్ని, టమోటా సాస్ (Tomato sauce) తో సర్వ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ స్నాక్ ఐటం మీ పిల్లలకు, మీ కుటుంబ సభ్యులకు నచ్చుతుంది. సాయంత్రం వేళలలో ఈ వడలను తింటూ చల్లదనాన్ని ఆస్వాదించండి. అలసందలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది ఒక మంచి హెల్తీ స్నాక్ (Healthy snake) అని చెప్పవచ్చు.

click me!