socks
చలికాలంలో చాలా మందికి రాత్రిపూట సాక్సులు వేసుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఎందుకంటే సాక్సులు కాళ్లను వెచ్చగా ఉంచుతాయి. కొంతవరకు చలిని తగ్గిస్తాయి. ఇది అందరికీ తెలుసు. కానీ రాత్రిపూట సాక్సులు వేసుకుని పడుకోవడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు మాత్రం చాలా మందికి తెలియవు.
రాత్రిపూట సాక్సులను వేసుకుంటే పాదాలు వెచ్చగా ఉంటాయి. కంఫర్ట్ గా ఉంటుంది. అంతేకాదు కాదు ఇది మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అసలు రాత్రిపూట సాక్సులు వేసుకుని పడుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Socks
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
రాత్రి పడుకునేటప్పుడు సాక్సులను వేసుకోవడం వల్ల కలిగే మొదటి ప్రయోజనం.. మన శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ముందే రాత్రిళ్లు చలి విపరీతంగా పెడుతుంది. దీంతో పాదాలు చల్లగా అవుతాయి. దీంతో రక్త నాళాలు సంకోచించబడతాయి. దీంతో రక్త ప్రసరణ తగ్గుతుంది. అదే మీరు సాక్సులను వేసుకుని పడుకుంటే మీ శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో మీకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మంచి నిద్రకు సహాయపడుతుంది
చలికాలంలో రాత్రిపూట చలివల్ల సరిగ్గా నిద్రపట్టదు. అయితే మీరు సాక్సులను వేసుకుని గనుక పడుకుంటే బాగా నిద్రపోతారు. అవును సాక్సుల వల్ల పాదాలు వెచ్చగా ఉంటాయి. దీంతో మీరు కంటినిండానిద్రపోతారు. పాదాలు వెచ్చగా ఉంటే మీ మెదడు మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయమని గుర్తు చేస్తుంది. దీంతో మీరు వెంటనే నిద్రపోతారు. అలాగే ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోగలుగుతారు. చలి ఎక్కువగా ఉంటే అసౌకర్యంగా ఉంటుంది. దీంతో మీరు రాత్రిళ్లు తరచుగా మేల్కోవాల్సి వస్తుంది.
పొడి చర్మం సమస్య ఉండదు
పగిలిన మడమలు, పొడి చర్మం ఉన్నవారు రాత్రిపూట సాక్సులు వేసుకుని నిద్రపోవడం మంచిది. ఎందుకంటే సాక్సులు మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడతాయి. మీరు గనుక ఫుట్ క్రీమ్ లేదా లోషన్ అప్లై చేసి సాక్సులు వేసుకుని పడుకుంటే మీ పాదాల చర్మం ఎండిపోకుండా ఉంటుంది. దీంతో మీ పాదాలు సున్నితంగా ఉంటాయి. పాదాల పగుళ్లు ఏర్పడే ప్రమాదం కూడా తగ్గుతుంది. పగుళ్లు ఉన్నా తగ్గిపోతాయి.
సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
సాక్సులను వేసుకుని పడుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ పాదాలను సాక్సులతో కప్పడం, రక్షించడం వల్ల పగుళ్లు లేదా కోతల నుంచి చర్మం లోపలికి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వెళ్లే అవకాశం ఉండదు. ముఖ్యంగా మీ బెడ్ పై పెంపుడు జంతువులు పడుకుంటే మాత్రం ఖచ్చితంగా సాక్సులను వేసుకునే పడుకోండి.