ఎండాకాలంలో మల్బరీ పండ్లకు కొదవే ఉండదు. నిజానికి ఎండాకాలంలో లభించే పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి, పుచ్చకాయలు, బొప్పాయి వంటి పండ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. అలాగే మల్బరీ పండ్లలో కూడా. ఎరుపు, నలుపు, తెలుపు వంటి వివిధ రంగులలో ఉండే మల్బెర్రీ పండ్లు రుచిగా, పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి ద్రాక్ష పండు రుచిలా ఉంటాయి. బ్లాక్బెర్రీని పోలిన ఆకారంలో ఉంటాయి. ఈ పండ్లను జాములు, సిరప్లను తయారుచేయడానికి ఉపయోగిస్తారు. అసలు ఈ సీజన్ లో మల్బరీ పండ్లను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..