రోజూ ఒక పండు తింటే..!

Published : May 15, 2023, 07:15 AM IST

కనీసం రోజుకు ఒక పండును తిన్నా ఎన్నో రోగాల ముప్పు తప్పుతుందంటున్నారు నిపుణులు. అవును పండ్లలో మన ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.   

PREV
16
 రోజూ ఒక పండు తింటే..!

మనం రోజూ ఒక పండును ఖచ్చితంగా తినాలంటరు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా సహాయపడతాయి. కానీ మనలో చాలా మంది అసలు పండ్లనే తినరు. ఎప్పుడో ఒకసారి తింటుంటారు. నిజానికి మన శరీరంలో రెండు రకాల పోషకాలు ఉంటాయి. మొదటిది శరీరంలో ఎక్కువ కాలం ఉంటాయి. రెండోది నీటితో పాటు బయటకు పోతాయి. ప్రతిరోజూ నీటితో కోల్పోయిన పోషకాలు శరీరంలో లోపిస్తాయి. ప్రతిరోజూ ఒక పండును తింటే ఈ లోపాన్ని పోగొట్టొచ్చు. ప్రతిరోజూ ఒక పండును తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే..
 

26
fruits

పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది

ప్రతిరోజూ ఒక పండును తినడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఎందుకంటే పండ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. నిజానికి పండ్ల నుంచి వచ్చే ఫైబర్ జీర్ణక్రియను వేగవంతం చేయడంతో పాటుగా కడుపు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం, పైల్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది.
 

36
fruits

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

ప్రతిరోజూ ఒక పండును తినడం వల్ల మీరు సులువుగా బరువు తగ్గుతారు. నిజానికి ఏదైనా పండును తినడం వల్ల విడుదలయ్యే ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్ పేరుకుపోకుండా నిరోధిస్తాయి. ఇది వేగంగా బరువు పెరగకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 

46
fruits

శరీరానికి అవసరమైన ఎన్నో విటమిన్లు లభిస్తాయి

విటమిన్ సి వంటి పోషకాలు రోజూ నీటితో పాటు శరీరం నుంచి బయటకు పోతాయి. అలాగే క్యాల్షియం కూడా తగ్గిపోతుంది. అందుకే ప్రతిరోజూ కనీసం ఒక పండును తినాలి. ఇది మీ శరీరంలో విటమిన్ లోపాన్ని నివారిస్తుంది. శరీరంలో బహుళ పోషకాల పరిమాణాన్ని పెంచుతుంది.
 

56
fruits

యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి

యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు మీ శరీరానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఈ పండ్లు మొదట మీ శరీరంలోని అన్ని అవయవాలను నిర్విషీకరణ చేస్తాయి. వాటి మల్టీన్యూట్రియెంట్స్ ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ప్రేగులు వంటి అవయవాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

66
fruits

చర్మం, జుట్టుకు ఆరోగ్యకరమైనవి

పండ్లలో వివిధ రకాల ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ రెండూ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే కొల్లాజెన్ ను పెంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా ఈ రెండూ జుట్టు,  చర్మం మెరుపును పెంచడానికి, అవి దెబ్బతినకుండా రక్షించడానికి కూడా సహాయపడతాయి. అందుకే  మీరు ప్రతిరోజూ ఒక పండును తినాలి.

click me!

Recommended Stories