కొలెస్ట్రాల్ ఎక్కువుంటే గుండెపోటు నుంచి డయాబెటీస్ వరకు ఎన్నో రోగాలొస్తయ్.. తగ్గాలంటే ఈ గింజలను తినండి

Published : May 08, 2023, 07:15 AM IST

ప్రస్తుతం చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. కానీ ఈ చెడు కొలెస్ట్రాల్ గుండెపోటుతో సహా ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అందుకే దీన్ని తగ్గించుకోవాలి.  

PREV
17
కొలెస్ట్రాల్ ఎక్కువుంటే గుండెపోటు నుంచి డయాబెటీస్ వరకు ఎన్నో రోగాలొస్తయ్.. తగ్గాలంటే ఈ గింజలను తినండి
high cholesterol

చెడు కొలెస్ట్రాల్ చిన్న సమస్యగా కనిపించినా.. ఇది ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే ఊబకాయం బారిన పడతారు. అలాగే కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ బారిన కూడా పడతారు. ముఖ్యంగా ఈ కొలెస్ట్రాల్ వల్ల గుండెపోటు కూడా రావొచ్చు. రక్తపోటు కూడా బాగా పెరుగుతుంది. కండరాల నొప్పులు కలుగుతాయి. ఈ రోగాల ముప్పు తగ్గాలంటే వీలైనంత తొందరగా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలి. 

27
cholesterol

కొలెస్ట్రాల్ పెరగడానికి ఎన్నో కారణాలున్నాయి. వేపుళ్లను ఎక్కువగా తినడం, నూనె పదార్థాలను తినడం, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ను తినడం, వ్యాయామం లేకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. అయితే ఈ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి గింజలు కూడా సహాయపడతాయి. 

37
cholesterol

నిజానికి గింజల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో కారకాలు దాగున్నాయి. ఈ గింజలు పోషకాల భాండాగారం. గింజలను తింటే పోషకాల లోపం పోతుంది. గింజలు గుండె ఆరోగ్యాన్ని రక్షించే ఉత్తమ సహజ ఆహారాలలో ఒకటి. వీటిలో మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

47
cholesterol

గింజల్లో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వలు తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (ఎల్డిఎల్) లేదా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే అధిక-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా (హెచ్డిఎల్) లేదా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అంతేకాదు గింజలు ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.

57

బాదం పప్పుల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. బాదంలో ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరంలోని అనేక విధులలో కీలక పాత్ర పోషిస్తాయి. బాదం పప్పులో ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచడానికి కూడా సహాయపడతాయి.ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తాయి. గ్లూకోజ్ జీవక్రియను సమతుల్యంగా ఉంచుతాయి.
 

67

బాదం పప్పులో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇది మంటను తగ్గిస్తుంది.  ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రిస్తుంది. నడుము చుట్టుకొలతను తగ్గించడానికి బాదం సహాయపడుతుంది. బాదం పప్పులను తింటే నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. బాదం మొత్తం కొలెస్ట్రాల్, ఎల్డిఎల్,  ట్రైగ్లిజరైడ్లను మోసే చాలా తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (విఎల్డిఎల్) స్థాయిలు గణనీయంగా తగ్గాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 

77

రోజూ గుప్పెడు బాదం పప్పులను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్పైక్ 20 శాతం తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. బాదం పప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డిమెన్షియాను నివారించవచ్చని అధ్యయనంలో తేలింది. మెగ్నీషియం మెదడు ఆరోగ్యానికి, రక్త ప్రవాహాన్ని పెంచడానికి, మానసిక స్థితిని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.
 

click me!

Recommended Stories