Health Tips: 12 ఏళ్లు ఆయుష్షు పెరగాలంటే రోజూ 12 నిమిషాలు ఇలా చేయండి

Published : Feb 27, 2025, 01:04 PM IST

Health Tips: ఎక్కువ కాలం బతకాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. కాని ఇప్పుడున్న జీవన విధానానికి ఎవరు ఎంత కాలం బతుకుతారో అర్థం కాకుండా ఉంది కదా.. కాని మీ ఆయుష్షు 12 ఏళ్లు పెరగాలంటే రోజు 12 నిమిషాలు ఈ పని కోసం కేటాయించాలి. ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

PREV
15
Health Tips: 12 ఏళ్లు ఆయుష్షు పెరగాలంటే రోజూ 12 నిమిషాలు ఇలా చేయండి

సాధారణంగా ఫిట్ గా ఉండటానికి ఎక్సర్ సైజ్ లు, వాకింగ్, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే రన్నింగ్ చేస్తుంటారు. మీరు గాని రోజూ రన్నింగ్ చేస్తే కచ్చితంగా ఆయుష్షు పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అది కూడా రోజుకు 12 నిమిషాలు చేస్తే సరిపోతుందట. రోజుకు 12 నిమిషాలు రన్నింగ్ చేస్తే ఆయుష్షు ఎలా పెరుగుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.  

25

జిమ్ కి వెళ్లే వారు ఎక్సర్ సైజ్ లో భాగంగా థ్రెడ్ మిల్ పై రన్ చేస్తుంటారు. అయితే చాలా మంది వెయిట్ తగ్గించుకోవడం కోసమే రన్నింగ్ చేస్తుంటారు. కాని రన్నింగ్ చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరం మొత్తం ఆరోగ్యంగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ప్రయోగాల ప్రకారం ప్రతి రోజు రన్నింగ్ చేసే వారి ఆరోగ్య సమస్యలు తీరిపోయి ఆయుష్షు పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 

35

రన్నింగ్ అంటే కేవలం బరువు తగ్గడానికి చేసేది కాదని అందరూ తెలుసుకోవాలి. ఫిట్ గా ఉంటే ఆటోమెటిక్ గా వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే ప్రతి రోజు అరగంట, గంట చొప్పున పరిగెట్టడం కంటే కేవలం 12 నిమిషాలు రన్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ కలుగుతాయి. 

ప్రతి రోజు 12 నిమిషాలు రన్ చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

కాళ్ల ఎముకలు బలంగా తయారవుతాయి. పిక్కలు, తొడల్లో అనవసరమైన కొవ్వు కరిగి స్ట్రాంగ్ అవుతాయి. 
ప్రతి రోజు రన్ చేయడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు కూడా రావు.

45

ఇప్పటి నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల 50 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే అల్జీమర్స్(మతిమరుపు) రాకుండా ఉంటుంది. ఒత్తిడి కలగకుండా ఉంటుంది. 

శరీరంలో ఇతర భాగాల్లో అనవసరంగా ఉన్న కొవ్వు కరిగి బాడీ ఫిట్ గా తయారవుతుంది. గుండె పనితీరు మెరుగవుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ లాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. 
 

55

ప్రతి రోజు పరిగెత్తడం వల్ల మెంటల్ హెల్త్ కూడా మెరుగవుతుంది. దీంతో మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఆటోమెటిక్ గా మీరు చేసే పనిలో 100 శాతం బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ప్రతి రోజు హాయిగా నిద్ర పడుతుంది. దీంతో మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

ఈ ప్రయోజనాలన్నీ కలగడం వల్ల ఆటోమెటిక్ గా మీ ఆయుష్షు పెరుగుతుంది. అయితే రోజుకు 12 నిమిషాలు పరిగెత్తడం వల్ల 12 సంవత్సరాలు ఆయుష్షు పెరుగుతుందని శాస్ర్తవేత్తలు ప్రయోగాల ద్వారా కనుగొన్నారు. 

click me!

Recommended Stories