Health Tips: ఆరోగ్యం కోసం ఓట్స్ తింటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి?

First Published | Aug 23, 2023, 3:42 PM IST

Health Tips: సాధారణంగా డైట్ ప్లాన్ చేసేవాళ్ళు ఎక్కువగా ఓట్స్ తింటూ ఉంటారు. అయితే ఓట్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం సంగతి పక్కన పెడితే అనారోగ్యం పాలవుతారు. అందుకే ఓట్స్ గురించి పూర్తి అవగాహన పెంచుకుందాం.
 

 సాధారణంగా ఓట్స్ ని బరువు తగ్గించే ప్రయత్నంలో ఎక్కువగా అల్పాహారంగా తీసుకుంటాము. అయితే ఇతర ఆహారాలు మాదిరిగా వీటిని అతిగా తినటం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఏర్పడతాయి. కొన్ని విషయాలని పరిగణలోకి తీసుకోకపోతే ఓట్స్ కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది.
 

అందుకే ఓట్స్ ని ఏ విధంగా తినాలో ఇక్కడ చూద్దాం. ఓట్స్ పూర్తి ప్రయోజనాలను పొందటానికి కూరగాయలు లేదంటే పండ్లతో కలిపి తీసుకోవచ్చు. అంతేకానీ ఓట్స్ లో చక్కెర, చాక్లెట్ చిప్స్ లేదంటే ఇతర స్వీట్స్ ని జోడించి తినకండి.

Latest Videos


 దీనివలన వోట్ మీల్  యొక్క మొత్తం పోషక విలువలు తగ్గిపోతాయి. అదనపు క్యాలరీలు, చక్కెర మీ ఒంట్లో కొవ్వుని మరింత పెరిగేలాగా చేస్తుంది. ఓట్స్ ని రోజు అల్పాహారంగా తీసుకోవడం మంచిదే కానీ ఇతర పోషక పదార్థాల వల్ల అందే పోషకాలు మీకు పూర్తిగా అందుకుండా పోతాయి.
 

కాబట్టి ప్రతిరోజు ఓట్స్ అల్పాహారంగా కాకుండా  వారానికి రెండు మూడు రోజులు ఓట్స్ తింటూ మిగిలిన రెండు మూడు రోజులు మిగిలిన పోషకాలు అందించే ఆహారాన్ని తినండి. దీనివల్ల అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. ప్రతిరోజు ఓట్స్ తినడం వల్ల బరువు తగ్గడానికి బదులు బరువు పెరగడానికి కారణం అవుతుంది.

అలాగే ఓటమీల్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను నెమ్మది చేస్తుంది. దాని వలన కడుపులో మంట ప్రారంభమవుతుంది. మీరు ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఓట్ మీల్ చాలా తక్కువ క్వాంటిటీతో తినటం  మంచిది.

ఓట్ మీల్ లో ఫైబర్ అధికంగా ఉండడం వలన మీ శరీరం రోజంతా ఎక్కువ తినటానికి సిగ్నల్ ఇచ్చే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఓట్స్ అతిగా తినటం మీ పనికి ఆటంకం కలిగిస్తుంది. మీలో చురుకుదనాన్ని తగ్గిస్తుంది. కాబట్టి అతి ఎప్పుడూ ప్రమాదమే. ఎంత అవసరమో అంత మొత్తంలో తింటేనే ఏదైనా ఆరోగ్యం.

click me!