ప్రతి మనిషికి నిద్ర చాలా అవసరం. సరిపడా నిద్రలేకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాదు మనం పడుకునే పొజిషన్ కూడా మన ఆరోగాన్ని నిర్ణయిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎడమవైపు తిరిగి పడుకోవాలట. ఇలా పడుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలగనున్నాయి. మరి అవేంటో ఓసారి చూద్దాం..
28
1.ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల రాత్రి తిన్న ఆహారం సులభంగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది. అంతేకుండా, తీసుకున్న ఆహారంలోని వ్యర్థాలు సులభంగా బయటకు రావడానికి సహాయపడతాయి.
38
2.అంతేకాదు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల లివర్ ఫంక్షనింగ్ సరిగా జరుగుతుంది. అంతేకాకుండా చాలా మంది గుండె మంట, బ్లోటింగ్, మలబద్దకం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు కూడా ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ఆ సమస్య నంచి బయటపడతారు.
48
3.అంతెందుకు, ఎడమవైపు తిరిగి పడుకునేవారి మొదడు కూడా చాలా చురుకుగా పనిచేస్తుంది. మొదడులోని పనికి రాని విషయాలను కూడా తొలగించడానికి సహాయపడుతుందట.
58
4.చాలా మందికి పడుకోగానే భయంకరంగా గురక వస్తూ ఉంటుంది. అలాంటివారు ఎడమవైపు తిరిగి పడుుకోవడం వల్ల దానిని తగ్గించుకోవచ్చట.
68
5.ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
78
6.గర్భిణీ మహిళలకు కూడా ఎంతో మేలు చేస్తుందట. గర్భిణీలు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల యూట్రరస్ తోపాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది.
88
7.శరీరంలోని పనికి రానివి తొలగించడానికి ఇలా పడుకోవడం ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఆరోగ్యానికి మంచిది అన్నారు కదా అని అందరూ ఎడమవైపు తిరిగి పడుకోకూడదు. ముఖ్యంగా భుజం నొప్పి, జా టైట్ గా ఉండేవారు దీనిని పాటించకపోవడమే ఉత్తమం.