ఈ జ్యూస్ లు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.. అలాగే..!

Published : May 08, 2023, 12:11 PM IST

బయటిఫుడ్ ను తినడం, అనారోగ్యకరమైన జీవన శైలి వల్ల కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. అలాగే మీ శరీరంలో ట్యాక్సిన్స్ కూడా పేరుకుపోతాయి. అయితే కొన్ని జ్యూస్ లు ఈ సమస్యను తగ్గించడానికి బాగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.   

PREV
17
ఈ జ్యూస్ లు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.. అలాగే..!

జ్యూస్ లు మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. జ్యూస్ లను మన శరీరం చాలా సులువుగా జీర్ణం చేసుకుంటుంది. అందుకే ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు జ్యూస్ లను తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. డైటింగ్ లో ఉన్నా జ్యూస్ ను తాగొచ్చు. చాలా మంది జ్యూస్ డైట్ కూడా ఫాలో అవుతుంటారు. జ్యూస్ లు శరీరంలోని అన్ని టాక్సిన్స్ ను తొలగిస్తాయి. జ్యూస్ లు కడుపు ఉబ్బరం సమస్యను పరిష్కరించడంతో పాటు కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తాయి. జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, అనారోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల చాలా మందికి కడుపు ఉబ్బరం వస్తుంది. మరి దీన్ని తగ్గించడానికి ఎలాంటి ఆహారాలు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

27
bloating

ఉబ్బరానికి కొన్ని సాధారణ కారణాలు 

హార్మోన్ల మార్పులు: పీరియడ్స్ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలలో హెచ్చుతగ్గుల వల్ల శరీరంలో వాటర్ నిల్వ ఉంటుంది. ఇది ఉబ్బరాన్ని కలిగిస్తుంది. 

ఆహారం:  ఉప్పు, ఫైబర్ లేదా బీన్స్, కాయధాన్యాలు, బ్రోకలీ, క్యాబేజీ వంటి వాయువును ఉత్పత్తి చేసే పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల కూడా ఉబ్బరం సమస్య వస్తుంది. 

నిర్జలీకరణం: శరీరానికి సరిపడా నీటిని తాగకపోవడం వల్ల బాడీ నిర్జలీకరణం బారిన పడి ఉబ్బరం వస్తుంది.

మలబద్ధకం: చికాకు కలిగించే ప్రేగు సిండ్రోమ్,  ఉదరకుహర వ్యాధి వంటి జీర్ణశయాంతర సమస్యలు కూడా చాలా మందిలో ఉబ్బరం కలిగిస్తాయి.

మందులు: యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, యాంటి డిప్రెసెంట్స్ వంటి కొన్ని మందులు దుష్ప్రభావాలను కలిగిస్తాయి. దీని వల్ల మీకు కడుపులో ఉబ్బరం కలుగుతుంది. 

ఆరోగ్య సమస్యలు: అండాశయ తిత్తులు, ఎండోమెట్రియోసిస్, గర్భాశయ ఫైబ్రాయిడ్లు వంటి కొన్ని అనారోగ్య సమస్యలున్న మహిళల్లో ఉబ్బరం సమస్య వస్తుంది. అయితే మీకు ఈ సమస్య ఎక్కువ కాలంగా ఉన్నట్టైతే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. 
 

37
lemon juice

ఈ జ్యూస్ లు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి, కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తాయి

నిమ్మరసం

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కాలేయాన్ని ఉత్తేజపరుస్తుంది. నిర్విషీకరణ ప్రక్రియకు సహాయపడుతుంది. ఇది మూత్రవిసర్జన ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇది ఉబ్బరాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

47

అల్లం రసం

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అలాగే అల్లం జీర్ణవ్యవస్థలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఆ మంట ఉబ్బరానికి దారితీస్తుంది. అల్లం జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. మలబద్దకం కూడా ఉబ్బరాన్ని కలిగిస్తుంది. 
 

57

బీట్ రూట్ జ్యూస్

బీట్ రూట్ జ్యూస్ లో బీటైన్ ఉంటుంది. ఇది కాలేయ పనితీరుకు సహాయపడుతుంది. నిర్విషీకరణకు సహాయపడుతుంది. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఉబ్బరం తగ్గించడానికి, కాలేయాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.
 

67
bloating

డాండెలైన్ రూట్ రసం

డాండెలైన్ రూట్ మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఉబ్బరం సమస్యను కూడా తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరచడానికి కూడా సహాయపడుతుంది.
 

77
cucumber juice

కీరదోసకాయ రసం

కీరదోసకాయల్లో నీటి పరిమాణం చాలా ఎక్కువ. ఇది శరీరంలో నీటి కొరతను పోగొడుతుంది. ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది. కీరదోసకాయ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలో పేరుకుపోయిన మురికిని బయటకు పంపుతుంది.

click me!

Recommended Stories