హీరోకు అయినా హీరోయిన్ కు అయినా హిట్ వచ్చినంతవరకే లైఫ్. ఫ్లాఫ్ వస్తే ఎవరూ పట్టించుకోరు. ఆ విషయం ఇండస్ట్రీలో ఉన్న సాయి పల్లవికి తెలియకుండా ఉండదు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కథలు చేస్తూ తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఈ మథ్యకాలంలో వెనకబడింది.
Sai Pallavi
మలయాళం చిత్రం ‘ప్రేమమ్’ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ..తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు హిట్ అనేది ఈ మద్యకాలంలో దూరమైంది. అసలే జనాలు థియేటర్స్ కు రావటం లేదు. ఈ సిట్యువేషన్ లో రిలీజైన ఆమె రెండు సినిమాలు దాదాపు డిజాస్టర్ రిజల్ట్ నమోదు చేసాయి.
హీరోలు ప్రక్కన కమర్షియల్ సినిమాల్లో చేయటం కన్నా తనకు సంతృప్తినిచ్చే పాత్రలు మాత్రమే చేస్తానంటూ ముందుకు వెళ్తోంది సాయి పల్లవి. ఆ క్రమంలో సాయి పల్లవి లేడీ ఓరియెంటెండ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. అందుకే సాయి పల్లవిని అభిమానులు లేడీ సూపర్ స్టార్ అంటూ పిలవడం మొదలు పెట్టారు. కానీ ఈ నేచురల్ బ్యూటీ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి.
ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ‘విరాటపర్వం’ బాక్సాఫీస్ వద్ద దారణంగా బోల్తా కొట్టింది. అలాగే గార్గి సినిమా కూడా ప్లాప్‌గానే మిగిలిపోయింది. ఇలా వరుసగా ఫ్లాపులు రావడానికి కారణం సాయి పల్లవి ఎంచుకున్న కథలనే తెలుస్తోంది.
సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది ఆమె. సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయినప్పటికీ.. కమర్షియల్‌గా నిర్మాతలకు మాత్రం నిరాశే మిగులుతోంది. ఫిథా,శ్యామ్ సింగరాయ్, ఎమ్ సీఏ లాంటి సినిమాలు ఆమె నుంచి ఓ వర్గం ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వాస్తవానికి అవే డబ్బులు తెచ్చిపెడుతున్నాయి కూడాను.
రీసెంట్ గా కొన్ని కమర్షియల్ సినిమా ఆఫర్స్ ని సాయి పల్లవి రిజెక్ట్ చేసిందిట. దాంతో ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో వర్కవుట్ కాదని, మారాలని సాయి పల్లవికి కొందరు సన్నిహితులు సలహా ఇచ్చారట. గ్లామర్‌కు ప్రాధన్యత ఉన్న కమర్షియల్ చిత్రాలను కూడా చేయాలని చెస్తేనే ఫలితం ఉంటుందని చెప్పారట.
అయితే ఆఫర్స్ రాకపోతే తను డాక్టర్ గా తిరిగి క్లినిక్ అయినా పెట్టుకుంటా లేదా ఉద్యోగం అయినా చేసుకుంటా కానీ నా స్థాయిని తగ్గించుకొని ఇష్టంలేని సినిమాల్లో నటించలేనని చెప్పిందట సాయి పల్లవి. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
మలయాళంలో ‘ప్రేమమ్’ చిత్రంతో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత డైరెక్ట్ గా ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా సాయి పల్లవి అద్భుతంగా నటించింది. అలాగే డాన్స్ స్టెప్పులతో మతిపోగొట్టింది. ఈ చిత్రం తర్వాత వరుసగా టాలీవుడ్, కోలీవుడ్ లో చిత్రాలు చేసుకుంటూ వస్తోంది. కాని పంధా మార్చటమే కొంప ముంచింది అంటున్నారు.
నేచురల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న సాయి పల్లవి వరుస చిత్రాల్లో నటిస్తూ బీజీగా ఉంది. అటు తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటోంది. ప్రస్తుతం అగ్ర స్థాయి హీరోయిన్లే బీట్ చేసేలా సాయి పల్లవికి ఇమేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు దానికి డ్యామేజ్ ఏర్పడింది.