RamCharan: RC 15 ని రిస్కులో పెడుతున్న శంకర్... ఆందోళనలో రామ్ చరణ్

First Published | Jul 28, 2022, 8:50 AM IST

నాన్ స్టాప్ గా సాగుతున్న రామ్ చరణ్-శంకర్ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడే అవకాశం కనిపిస్తోంది. శంకర్ మధ్యలో ఆపేసిన కమల్ హాసన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్, ఇండియన్2  కారణంగా.. రామ్ చరణ్ సినిమాకు తిప్పలు తప్పేలా లేవు. ఇండియన్2 తో చరణ్ కు వచ్చే నష్టమేంటి..? శంకర్ రెండు పడవల ప్రయాణం చేయబోతున్నారా..? 

రామ్ చరణ్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో RC15 సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు ప్రొడక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నటించితిన్ ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ అంతటి హై స్టాండర్డ్స్ తో వస్తున్న RC15 పై మెగా ఫాన్స్ లోనే కాదు.. తెలుగు, తమిళ, హిందీ ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ ఉంది. ప్రస్తుతం RC15 న్యూ షెడ్యూల్ హైదరాబాద్ లో  జరుపుతున్నారు శంకర్.  ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ నెత్తిన పిడుగులాంటి వార్త ఒకటి మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే..

ramcharan


కమల్ హాసన్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో  చేసిన ‘విక్రమ్’ సినిమా సూపర్ హిట్టవటం ఈ సమస్యలు తెచ్చిపెట్టింది.  ఆ క్రేజ్ ని ఖచ్చితంగా క్యాష్ చేసుకోవాలని లైకా ప్రొడక్షన్స్ అనుకోవటంలో వింతేమీ లేదు. దాంతో వారు శంకర్ పై ప్రెజర్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో  కమల్ హాసన్.. సెప్టెంబర్ నుంచి ‘ఇండియన్ 2’ సినిమా కోసం డేట్స్ కేటాయించే అవకాశం ఉంది.  విదేశీ నిపుణులను మన దేశానికి రప్పించే బాధ్యతను శంకర్ తీసుకోనున్నాడు.  లైకా ప్రొడక్షన్స్ వాళ్లు కూడా ఈ సినిమాను వీలైనంత తొందరలో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.  


ramcharan


ఈ నేఫధ్యంలో  రామ్ చరణ్ సినిమా, భారతీయుడు 2 సినిమా రెండు ఒకే సారి చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు తమిళ సినీ వర్గాల సమాచారం. నెలలో 10 రోజులు భారీతీయుడు 2 చేస్తే, మరో పది  రోజులు రామ్ చరణ్ సినిమా చేస్తాడంటున్నారు.


ఈ మేరకు కమల్ హాసన్ ఆల్రెడీ తన లుక్ కు సంభందించి ఫొటో షూట్ మరో సారి చేయించుకుని ఆ ప్రిపరేషన్ లో ఉన్నట్లు తమిళ సినీ వర్గాలు అంటున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ స్కీమ్ అమలు చేస్తారని చెప్తున్నారు. అయితే ఇందులో వింతేముంది అనిపించినా..పూర్తిగా ఒకే సినిమాపై దృష్టిపెట్టడం కష్టమని కొందరి వాదన


ఇలా రెండు పడవల మీద ఒకే సారి నిలబడే ప్రయత్నం చేసినట్లుగా ...ఒకే సారి రెండు సినిమాలు డైరక్ట్ చేస్తే కష్టం అంటున్నారు. గత రోజుల్లో అంటే కేవలం కథా బలంతో తెరకెక్కే ఫ్యామిలీ చిత్రాలు కాబట్టి డైరక్టర్స్ ధైర్యం చేసేవారు కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో అదంతా ఇబ్బందికరమైన వ్యవహారమే అంటున్నారు సీనీ సీనియర్స్.

దీనికి తోడు ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి నిర్మాతల మండలి షూటింగ్ బంద్ కు పిలువు ఇస్తోంది. అప్పుడు అర్దాంతరంగా రామ్ చరణ్ షూటింగ్ ఆగితే...ఆ తర్వాత దాన్ని దాటటం మరో టాస్క్. శంకర్ కు సరైన హార్డ్ హిట్టింగ్ సక్సెస్ లేదు. రామ్ చరణ్ ఆచార్యతో కొద్దిగా వెనకపడ్డారు. అయితే ఇద్దరి కాంబినేషన్ కు ఓ రేంజిలో అయితే క్రేజ్ ఉంది.

Ramcharan, shankar


గతంలో  లైకా ప్రొడక్షన్స్ వాళ్లు.. శంకర్‌కు నోటీసులు పంపించారు. ముందుగా మాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం .. ‘ఇండియన్ 2’ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత కానీ వేరే సినిమా చేయడానికి వీలు లేదు. ఈ క్రమంలో తమ సంస్థతో శంకర్ చేసుకున్న ఒప్పందం ప్రకారం వేరే ప్రాజెక్ట్ టేకప్ చేయకుండా లైకా ప్రొడక్షన్స్ వాళ్లు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 

Ramcharan, shankar


 ఇండియన్ 2 మొదలు పెట్టకపోవడానికి గల కారణాలను శంకర్ ..కోర్టుకు వివవరించాడట. ఈ సినిమా కోసం విదేశీ సాంకేతిక నిపుణులు రావాలి. కానీ కోవిడ్ కారణంగా వారు మన దేశానికి రావడానికి భయపడుతున్నారట. వాళ్లు వచ్చిన తర్వాత ‘ఇండియన్ 2’ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తామని శంకర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలియజేసారు. ఇక ఇప్పుడు మొదలెట్టాల్సిన పరిస్దితి. 

indian 2


శంకర్..  ఒకప్పుడు దక్షిణాది భారీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  ఈయన చిత్రాలంలే భారీ గ్రాఫిక్స్, హంగులు ఆర్భాటాలు ఉండాల్సిందే. భారతీయ తెరపై రానీ డిఫరెంట్ స్టోరీలతో తనదైన మార్క్ చూపించారు. సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ప్రధాన కథా వస్తువులు. సోషల్ ప్రాబ్లెమ్స్‌కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి.అంతేకాదు

indian 2

భారతీయ సినిమా మేకింగ్ స్టైల్ మార్చిన గ్రేట్ డైరెక్టర్. చివరగా ఈయన ‘2.O’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమా మేకింగ్ బాగున్న కథ సరిగా లేకపోవడంతో అనకున్న రేంజ్‌లో నడవలేదు. ఈ సినిమా తర్వాత శంకర్.. కమల్ హాసన్ హీరోగా భారతీయడు సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 సినిమాను స్టార్ట్ చేసాడు. ఈ సినిమాను తమిళంలో ఇండియన్ 2 పేరుతో తెరకెక్కుతోంది.


ఈ గ్యాప్ లో రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇంతలోనే అపరిచితుడు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ కోర్టుకు కెక్కాడు. దీనిపై శంకర్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కథ నాది. ఈ విషయమై ఎంత దూరమైన వెళతానని చెప్పాడు.

Indian2

కమల్ హాసన్ గతంలో స్పందిస్తూ, " అయితే ప్రస్తుతం శంకర్ వేరే ప్రాజెక్ట్ (రామ్ చరణ్ సినిమా)తో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత నా సినిమా మొదలవుతుంది. నా నుంచి వెంట వెంటనే సినిమాలు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. నాకు కూడా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలని ఉంది. కానీ దర్శకత్వ బాధ్యత కూడా నేను నెత్తి మీద పెట్టుకుంటే అది కుదరదు. అందుకే ఆ బాధ్యతలు వేరే దర్శకులకి అప్పగిస్తున్నాను" అని క్లారిటీ ఇచ్చారు కమల్ హాసన్. అయితే ఇప్పుడు ఇలా రెండు సినిమాలు ఒకేసారి శంకర్ భుజాన ఎత్తుకుంటే ఏమంటారో చూడాలి. 

Latest Videos

click me!