సోషల్ మీడియా రోజులివి ఇవి. ప్రతి విషయం హాట్ టాపిక్ గా మారిపోతోంది. ముఖ్యంగా సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూండటం, వారి వ్యక్తిగత జీవితాలను సైతం విశ్లేషిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఆ క్రమంలో సమంత, నాగచైతన్యల విడాకులు, ఆ తర్వాత వారి జీవితాలు ఇప్పటికి సోషల్ మీడియాలో చర్చనీయాంశాలుగానే ఉన్నాయి. ఇద్దరు యంగ్ కపుల్ కావటం, ఇద్దరూ క్రేజ్ ఉన్నవారు కావటంతో వారి ప్రతీ విషయాన్ని బూతద్దంలోంచి చూస్తున్నారు.
తాజాగా కాఫీ విత్ కరణ్ 7వ సీజన్‌లో సామ్ మాట్లాడిన మాటలను ఆమె వ్యక్తిగత జీవితంకు ముడివేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఎక్స్ హజ్బెండ్ నాగచైతన్య మ్యాటర్ తో కలిపి. అదే సమయంలో ఆమె సూపర్ హిట్ ఐటమ్ సాంగ్ ని సైతం ప్రస్దావనకొస్తోంది. అవేంటో, ఎంతవరకూ సమంజసమో చూద్దాం..
పుష్ప ఎన్నో రికార్డులను తిరగరాస్తూ బాలీవుడ్‌ను షేక్ చేసిందీ మూవీ. సినిమానే కాదు పాటలు కూడా ప్రజలను ఓ ఊపు ఊపాయి. మరీ ముఖ్యంగా అందులో ఊ అంటావా మావా పాటకు సామాన్యులే కాదు బాలీవుడ్ స్టార్స్ కూడా ఫిదా అయ్యారు. మొట్టమొదటిసారిగా ఐటం సాంగ్‌లో నటించిన సమంతకు ఎనలేని ప్రశంసలు దక్కాయి. తాజాగా సామ్ మరోసారి ఊ అంటావా సాంగ్‌కు స్టెప్పులేసింది. ఆ పాట గురించి కాఫీ విత్ కరణ్ 7వ సీజన్‌లో మాట్లాడింది.
ముఖ్యంగా మగవాళ్ల వంకర బుద్ధి మీద సెటైర్ వేసేలా ఉన్న ఈ సాంగ్ లిరిక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అక్కినేని నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత నటించిన సాంగ్ కావడంతో ఆ లిరిక్స్ ను ఆమె వ్యక్తిగత జీవితానికి లింక్ చేస్తూ అనేక కథనాలు వచ్చాయి. లేటెస్టుగా అసలు 'ఊ అంటావా' పాట చేయడం వెనకున్న అసలు ఉద్దేశ్యం ఏంటనేది సామ్ వెల్లడించింది.
'ఊ అంటావా' పాటలో సమంతా హాట్ హాట్ గా కనిపించడం గురించి ప్రస్తావించిన కరణ్.. ఆమె పెర్ఫార్మెన్స్ ను మెచ్చుకున్నారు. ఆ పాట చేయడానికి కారణమేమిటని సామ్ ని అడగ్గా... సమంత బదులిస్తూ సాంగ్ ట్యూన్ తనకు నచ్చిందని.. అది మగవారి చూపులపై సెటైర్ అని తెలిపింది. పురుషుడి చూపుపై వ్యంగ్యాస్త్రాలు సంధించే ఐటెం నంబర్ చేసినందుకు తనపై విమర్శలు కూడా వచ్చాయని చెప్పింది.
మగవారు అందరి గురించి అని సమంత అన్నా ..ఆమె ఉద్దేశ్యం..నాగచైతన్యే అంటున్నారు. పాట చేసేటప్పుడు సంగతేమో కానీ ఇప్పుడు ఆమె మాటల్లో అర్దమైంది మాత్రం చైతపై కోపం, కసి అని సోషల్ మీడియా జనం అర్దాలు లాంటి పెడర్దాలు తీస్తున్నారు.
"నిజానికి ఈ పాట మగ చూపులపై సెటైర్ గా ఉంటుంది. అది మగవారి చూపులపైకి వస్తుందికాబట్టి చాలా విమర్శలు ట్రోలింగ్ వచ్చింది. కానీ నాచ్ గర్ల్ గా చేస్తున్న నా లాంటి పెద్ద స్టార్ కాకపోతే మగ చూపులపై ఇంకెవరు సెటైర్ వేయగలరు?" అని సమంత చెప్పింది. "ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో రాజి పాత్ర ఒక కారణం కోసం శారీరక పోరాటంలో పాల్గొంటుంది. ఇక్కడ 'ఊ అంటావా' ఒక స్టేట్మెంట్ ఇస్తుంది" అని చెప్పుకొచ్చింది. అయితే ఆ స్టేట్మెంట్ ఎవరికు చైతూ కే కదా అంటున్నారు.
చైతుతో విడిపోయినా ఆమె కోపంతో ఉందని , అది ఆమె మాటల్లో వ్యక్తమవుతోందని విశ్లేషణలు చేస్తున్నారు. డైరక్ట్ గా కాకుండా ఆమె ఇలా ఇండైరక్ట్ గా చైతుకు కౌంటర్స్ ఇస్తోందని చెప్తున్నారు. అయితే అవి సమంత అభిమానులు మాత్రం ఒప్పుకోవటం లేదు. ఓ వేదికగా ఆమె మాట్లాడిన మాటలను ఇలా వక్రీకరించటం తగదు అంటున్నారు.
ఇక షోలో ....''ఈ పాటలో నువ్వు చంపేసావ్. ఎంత చేయాలో అంతా చేశావ్. ఇది తిరుగుబాటు చర్యనా? వ్యూహాత్మక ఎత్తుగడనా లేదా "F*ck నేను చేస్తాను" అని మీరు భావించినందున చేసిన పాటనా?'' అని కరణ్ ప్రశ్నించగా.. సామ్ వెంటనే ''థర్డ్ ఆప్షన్. F*ck.. నేను చేస్తాను" అని బదులిచ్చింది. అయితే సమంత ..మనస్సులో అది ఇది తిరుగుబాటు చర్యగానే ఆమె భావించి చేసిందంటున్నారు. అందుకు ఆమె వేసిన స్టెప్స్ ఉదాహణ అంటున్నారు.
"స్టేటమెంట్ ఇస్తున్నా.. లేదా ప్రపంచానికి నీ మిడిల్ ఫింగర్ చూపిస్తున్నా.. నువ్వు ఈ పాటలో చాలా హాట్ గా ఉన్నావ్" అని కరణ్ జోహార్ అన్నారు. ఇప్పుడు KwK షోలో సామ్ స్టేట్మెంట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం గురించి ఓ బాలీవుడ్ మీడియా రాసిన ఆర్టికల్ ను సామ్ ట్విట్టర్ లో షేర్ చేయడం గమనార్హం. అదే సమంత అంతర్గత ఆలోచనగా చెప్తున్నారు. ఇదంతా నాగచైతన్య కూడా గమనిస్తున్నాడనే విషయం ఆమెకు తెలుసు అంటున్నారు.
వాస్తవానికి సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఒక ఐటమ్ సాంగ్ చేయడమేంటని అభిమానులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందులోనూ విడాకుల ప్రకటన తర్వాత కమిటైన ప్రాజెక్ట్ కావడంతో అందరి దృష్టి పడింది. సాంగ్ రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మగబుద్ది వంకర అంటూ లిరిక్స్ రాసిన చంద్రబోస్ ను.. అందులో నటించిన సామ్ ను విపరీతంగా ట్రోల్ చేశారు. కొందరు మహిళలు పాలాభిషేకాలు కూడా చేసారు. అయితే సమంత 'ఊ అంటావా' పాట చేయడానికి ముందు చాలానే ఆలోచించినట్లు ఆమె తాజా స్టేటమెంట్ ని బట్టి అర్థం అవుతోంది.
సమంత తన ఎపిసోడ్‌లో కరణ్ జోహార్‌ను ఉద్దేశించి.. 'ఎంతోమంది వివాహబంధాలు బాధాకరంగా ఉండటానికి మీరే కారణం' అని సామ్ అనగానే 'నేనేం చేశాను' అని కరణ్ అడగ్గా.. 'పెళ్లి చేసుకుంటే జీవితం కబీ ఖుషి కబీ ఘమ్ (K3G) సినిమాలా ఉంటుందని స్క్రీన్‌పై చూపించారు. కానీ నిజ జీవితంలో మాత్రం అది KGF మూవీలా ఉంటుంది' అని సమంత తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
హోస్ట్ కరణ్ జోహార్ తనని వ్యక్తిగతమైన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టను అంటూనే విడాకులపై ప్రశ్నించాడు. దీనికి సామ్ ‘మా విడాకులు అంత సామరస్యంగా జరగలేదు. డైవర్స్ తీసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. విడాకులు తీసుకున్న కొత్తలో చాలా బాధపడ్డాను. జీవితం చాలా కఠినంగా అనిపించింది. కానీ ఇప్పుడు దాని నుంచి బయటపడ్డాను. మునుపటి కంటే ఇప్పుడే మరింత బలంగా మారాను. ప్రస్తుతం నా పని నేను చేసుకుంటున్నాను. అయితే విడాకుల తర్వాత ఇద్దరం ఒకరిపై ఒకరం తీవ్ర మనోవేదనకు గురయ్యాం’ అంటూ సమాధానం ఇచ్చింది.
Samantha Naga Chaitanya
హోస్ట్ చైను భర్తగా సంభోదించగా.. వెంటనే అడ్డుపడిన సమంత.. భర్త కాదు.. మాజీ భర్త అని పిలవండి అని చురకలంటించింది. అలా సమంత ఓపెన్ అయిందో లేదో ఇటు నాగచైతన్య కూడా తన జీవితం ఎలా సాగుతుందనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'ఒక వ్యక్తిగా నేను చాలా మారాను. గతంలో ఇంత ఓపెన్‌గా ఉండేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఏదైనా మాట్లాడగలుగుతున్నాను. నా కుటుంబం, ఫ్రెండ్స్‌తో అనుబంధం ఇంకా పెరిగినట్లు అనిపిస్తోంది. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని పేర్కొన్నాడు.