#Liger: ఊహించని కొత్త చిక్కుల్లో 'లైగర్' ? దివాళా సమస్యగా మారునుందా

First Published | Aug 20, 2022, 1:36 PM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లైగర్’.ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

Liger Movie


ఓ ప్రక్కన ‘ఆగ్ హై అందర్’ అంటూ లైగర్ తో నేషన్ వైడ్ గా బాక్సాఫీస్‌ ను షేక్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు పూరీ జగన్నాథ్‌, విజయ్‌ దేవరకొండ. ప్యాన్ ఇండియా మూవీగా అన్నిభాషల్లోనే బంపర్‌ హిట్‌ కొట్టాలని ఓ రేంజిలో పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ తో అనౌన్సయిన నాటినుంచే ఆడియెన్స్‌ లో హైప్ పెంచడంలో కూడా సక్సెసయ్యారు. లాక్ డౌన్, కరోనా ఎఫెక్టులను కూడా తట్టుకుని షూటింగ్ కూడా కంప్లిట్ చేసుకున్నారు. కానీ తీరా రిలీజ్ కి దగ్గరకొచ్చాక కొత్త కష్టాలొచ్చిపడుతున్నాయి. ప్రజెంట్ ఈ సినిమాకు బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి ఫుల్ స్వింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇప్పుడు మరో కొత్త చిక్కు వచ్చి పడిందని సమాచారం. ఏమిటా సమస్య?

Image: Ananya PandeyInstagram


ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.  ఆగష్టు 24న యూఎస్ లో మొదటి ప్రీమియర్స్ పడనున్నాయి.దీంతో అప్పుడే అక్కడ ప్రీమియర్స్ కోసం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే ఓ సమస్య మొదలైంది.


Liger Movie


  యుఎస్ లో థియేటర్స్ చైన్ కలిసిన రీగల్ థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పుడు రీగల్ థియేటర్స్ సమస్యలో ఇరుక్కున్నాయి. అవి దివాళా నోటీస్ ఇస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. కోవిడ్ తర్వాత వచ్చిన సమస్యలతో ఈ థియేటర్స్ చైన్ ఆర్దికంగా చాలా ఇబ్బందుల్లో ఉందని కథనాలు వెలువడుతున్నాయి.
 

ఈ నేపధ్యంలో లైగర్ ని వేరే థియేటర్స్ కు మార్చాలా అని అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచనలో పడుతున్నారంటున్నారు. కానీ అది ఇప్పటికిప్పుడు జరిగే పనికాదు. ఎందుకంటే థియేటర్స్ లో ఓ ప్రక్కన బింబిసార, మరో ప్రక్క సీతారామం, కార్తికేయ 2 దుమ్ము రేపుతున్నాయి. వాటిని ప్రక్కన పెట్టే ప్రసక్తి లేదు.


అలాంటప్పుడు ఖచ్చితంగా రీగల్ థియేటర్స్ తో ముందుకు వెళ్తారు. సినిమా రిలీజ్ కు ఇబ్బంది ఉండదు. షోలకు ఇబ్బంది ఉండదు. కానీ కోర్టులో దివాళా నోటీస్ ఉంటే థియేటర్స్ నుంచి వచ్చే రెవిన్యూ డిస్ట్రిబ్యూటర్స్ కు రావటం కష్టమే. ఈ విషయంలో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రకరకాల చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 
 


అయితే ఈ విషయమై నిర్మాతలు  పూరి జగన్నాథ్, కరుణ్ జోహార్ లు కూడా ఏమీ చెయ్యలేని పరిస్దితి. బిజినెస్ అంతా అయ్యిపోయి రిలీజ్ కు రెడీ అవుతున్న టైమ్ లో మీటింగ్ లు పెడితే తాము హామీలు ఇవ్వాల్సి ఉంటుందని వారు సైలెంట్ అయ్యినట్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి రీగల్ థియేటర్స్  దివాళా వార్తలు నిజమైతే ఇది లైగర్  డిస్ట్రిబ్యూటర్స్ కు పెద్ద సమస్యే. 


రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా తర్వాత వీరి ఎదురు చూపులు పీక్స్ కు చేరుకున్నాయి.


హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఓ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.లైగర్ టీమ్ అంతా ప్రెజెంట్ ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఫ్యాన్ డమ్ పేరుతొ టీమ్ అంతా ఇండియా మొత్తం టూర్ వేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ కు  మరికొద్ది  రోజులు మాత్రమే ఉంది.
 


యుఎస్ థియేటర్స్ లో ప్రీమియర్ టికెట్ బుకింగ్స్ కొద్దీ గంటల క్రితమే ఓపెన్ అయ్యాయి.ఈ మేరకు యుఎస్  డిస్టిబ్యూషన్ సంస్థ సరిగమ సినిమాస్ వారు ప్రకటించారు.మరి ఈ బుకింగ్స్ లో లైగర్ రికార్డు క్రియేట్ చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా పూరీ, విజయ్ కెరీర్ కు ఎలాంటి బూస్ట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

 
ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ పోరడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియర్ అయ్యాడనేదే ఈ సినిమా కథ.  హీరోగా విజయ్ దేవరకొండకు దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు ఇది తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ సినిమాలో  సునీల్ శెట్టి (Sunil Shetty) డాన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారట. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని సమాచారం. 

Latest Videos

click me!