రామ్ తో చేయబోయే ఈ కథ పూర్తిగా కొత్తగా ఉండేలా ఉండబోతోందట. రామ్ ఇంతవరకు నటించిన సినిమాల కంటే ఇది పూర్తిగా డిఫరెంట్ జానర్‌లో ఉండబోతుందని తెలుగు సినిమా వర్గాలు సమాచారం. ఇప్పటి వరకు రామ్ ఎక్కువగా యాక్షన్, రొమాంటిక్ కథలతో వచ్చారు.
ఓ మిస్టరీ థ్రిల్లర్‌లో నటించడమే కొత్త ప్రయోగమని చెప్పాలి. శైలేష్ ఇప్పటికే ఇదివరకే కథ చెప్పించి ఒప్పించుకుని, స్క్రిప్ట్ మొదలుపెట్టినట్లు టాక్. అయితే పూర్తి స్క్రిప్టు నేరేషన్ విన్నాక రామ్ ఈ సినిమా గురించిన నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు ప్రకటన వస్తుందని తెలుస్తోంది.
మరో ప్రక్క రామ్ పోతినేని మరికొన్ని కథలపై కూడా చర్చలు జరుపుతున్నారు. అందులో హరీష్ శంకర్ స్క్రిప్ట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దానిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు.