పార్లమెంట్‌, జామా మసీద్ లలో రామ్ చరణ్ సినిమా షూటింగ్?

Published : Mar 02, 2025, 02:37 PM ISTUpdated : Mar 02, 2025, 02:39 PM IST

Ram Charan: రామ్ చరణ్ త్వరలో పార్లమెంట్, జామా మసీద్‌లో  షూటింగ్ చేయనున్నారు. ఈ సీన్స్ సినిమాకు కీలకమని తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటి 

PREV
14
పార్లమెంట్‌, జామా మసీద్  లలో  రామ్ చరణ్ సినిమా షూటింగ్?
Ram Charan to Film in Parliament, Jama Masjid? in telugu

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్చి నెలాఖరకు జామా మసీద్, పార్లమెంట్‌లో జరగబోయే  షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు  తెలుస్తోంది. ఈ సీన్స్ కీలకమైనవి అని, ఇప్పటికే ఈ మేరకు పార్లమెంట్, జామా మసీద్ కు చెందిన అధికార వర్గాలతో మాట్లాడి టీమ్ ఫర్మిషన్స్ తెచ్చుకున్నారని తెలుస్తోంది.

మార్చి 4 నుంచి జరిగే షెడ్యూల్ లో పార్లమెంట్ సీన్స్ తీయబోతున్నారని చెప్తున్నారు. ఆ తర్వాత నెలాఖరుకు జామా మసీద్ సీన్స్ షూట్ ఫిక్స్ చేసారట. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథలో మన దేశం తరుపున ఆడి గెలిచిన   క్రీడాకారుడుకి పార్లమెంట్ లో అందరూ మెచ్చుకుంటారని ఆ సీన్స్ షూట్ చేయబోతున్నట్లు వినికిడి. 

24
Ram Charan to Film in Parliament, Jama Masjid? in telugu


ఇక ఇంతకీ ఏ సినిమా కోసం అంటే  ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న ఆర్సీ 16 ప్రాజెక్ట్ కోసమే. ఈ సినిమా చరణ్ కెరీర్లో ఓ మైలు రాయిగా నిలిచిపోతుందని ముందు నుంచి ప్రచారం జరుగుతున్న స్దాయిలోనే రూపొందుతోందిట.

విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఆర్సీ 16 రూపొందుతోంది. ఈ సినిమాలో పలు క్రీడల ప్రాధన్యత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. క్రికెట్, కుస్తీతో పాటు ఇంకొన్ని స్పోర్ట్స్‌ కథలో కీ రోల్ పోషిస్తాయని అంటున్నారు. రీసెంట్ గా  రాత్రిపూట హైదరాబాద్‌లో క్రికెట్‌కు సంబంధించిన పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు. 

34
Ram Charan to Film in Parliament, Jama Masjid? in telugu

నెక్స్ట్ షెడ్యూల్‌లో కుస్తీకి సంబంధించిన సీన్స్ షూటింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది.  కుస్తీ పట్టడం కోసమే చరణ్ కాస్త బాడీ బిల్డింగ్ చేస్తున్నారట. లేటెస్ట్‌ చరణ్ ఫోటోలు బయటికి రాగా.. అందులో సరికొత్తగా మేకోవర్ అయినట్టుగా కనిపించాడు.

రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాసన సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అంద‌రికీ తెలిసిన విష‌యమే. ఉపాస‌న త‌న ఫ్యామిలీతో క‌లిసి దిగిన ఓ ఫోటోను నెట్టింట షేర్ చేసింది. ఇందులో.. రామ్ చ‌ర‌ణ్ కొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు.

ఫుల్‌గా గ‌డ్డం పెంచి, ర‌ఫ్ లుక్‌లో కాస్త బొద్దుగా క‌నిపిస్తున్నాడు. ఎప్పుడు స్లిమ్‌గా ఉండే చ‌ర‌ణ్ కాస్త లావుగా క‌నిపించ‌డంతో.. ఆర్సీ 16లో కుస్తీ పట్టు పట్టడానికి రెడీ అయ్యాడనే చెప్పుకుంటున్నారు. 

44
Ram Charan to Film in Parliament, Jama Masjid? in telugu


ఈ సినిమాలో చరణ్ సరసన నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల మీద వెంకట్ సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమాలో కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ, టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు 'పెద్ది' టైటిల్ ఖరారు చేశారని టాక్. 
 

Read more Photos on
click me!

Recommended Stories