పుష్ప 2 టీజర్ మరియు ప్రమోషన్స్ ద్వారా కథలో కొత్త మలుపులు ఉంటాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. శ్రీవల్లి పాత్ర పుష్పరాజ్ జీవితంలో భావోద్వేగ పరమైన కీలకమైనది కాబట్టి, ఆమె పాత్రపై వచ్చే మార్పులు సినిమా కథనంలో ప్రధాన పాత్ర పోషించవచ్చు అనేది నిజం. అయితే అందుతున్న సమాచారం మేరకు శ్రీవల్లి పాత్ర చనిపోదని తెలుస్తోంది.
శ్రీవల్లి చనిపోతుందని వస్తున్న వార్తలన్నీ ఆధారం లేని రూమర్స్ అంటున్నారు. ఆమె పాత్రతో కథలో ఓ కీలకమైన ట్విస్ట్ ప్లే అవుతుందనేది కూడా నిజం కాదని, కథలో ఎమోషన్ , కొన్ని సీన్స్ కు లీడ్ గా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా గంగమ్మ జాతర ఎపిసోడ్ కు ముందు శ్రీవల్లి పాత్రతో ఓ కాంప్లిక్ట్ ఉంటుందని, అది సెకండాఫ్ కు లీడ్ చేసే సీన్ అంటున్నారు.