Ashu Reddy : ‘చలికాలం కూడా ఇంత సాహసం చేస్తున్నావా?’.. అషురెడ్డి లుక్ పై ఫన్నీ కామెంట్స్!

First Published | Jan 5, 2024, 10:55 PM IST

యంగ్ బ్యూటీ అషురెడ్డి Ashu Reddy సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఎప్పటికప్పుడు నయా లుక్ లో మెరుస్తూ తన అభిమానులను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇక లేటెస్ట్ లుక్ వైరల్ గా మారింది.
 

‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షోతో యంగ్ బ్యూటీ అషురెడ్డి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యింది. తన అందం, ఫిట్ నెస్, ట్రెండీ లుక్స్, రీల్స్ తో ఎప్పుడూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూనే ఉంటుంది. 
 

తొలుత ‘డమ్ స్మాష్’ వీడియోలతో సోషల్ మీడియాలో బాగా క్రేజ్ దక్కించుకుంది. ఆవెంటనే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ Ram Gopal Varma తో చేసిన ఇంటర్వ్యూతో మరింతగా పాపులర్ అయ్యింది. దాంతో Bigg Boss Telugu లోనూ అవకాశం దక్కించుకుంది.
 


ఇక ‘బిగ్ బాస్’ హౌజ్ నుంచి బయటికి వచ్చాక అషురెడ్డి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూనే వస్తోంది. అలాగే ట్రెండీ అవుట్ ఫిట్లలోనూ మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ఫ్యాషన్ సెన్స్ నూ చూపిస్తోంది. 

ఈ క్రమంలో తాజాగా మినీ డ్రెస్ లో మెరిసింది. రెడ్ మినీ స్కర్ట్, బ్లాక్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో యంగ్ బ్యూటీ ట్రెండీగా దర్శనమిచ్చింది. స్కిన్ టోన్ తోనూ మైమరిపించింది. క్యాట్ వాక్ తో అదరగొట్టింది. అభిమానులతో పంచుకోవడంతో లైక్స్ చేస్తున్నారు. 

మరికొందరు నెటిజన్లు మాత్రం ఈ ముద్దుగుమ్మ డ్రెసింగ్ పై ఫన్నీ కామెంట్లు కూడా పేల్చుతున్నారు. ఇంత చలికాలం ఇంత చిన్న డ్రెస్ ఎలా సాధ్యమవుతుంది? స్టైల్ కోసమే అంటే గ్రేటే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు లేటెస్ట్ లుక్ కు ఫిదా అవుతూ వీడియోను మరింతగా వైరల్ చేస్తున్నారు. 
 

ఇక అషురెడ్డి మొన్నటి వరకు న్యూ ఈయర్ సెలబ్రేషన్స్ లో అదరగొట్టింది. ఫ్రెండ్స్ తో కలిసి చాలా ఎంజాయ్ చేసింది. ఈ సంవత్సరం మరిన్ని సినీ అవకాశాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అషు నెక్ట్స్ ‘ఏ మాస్టర్ పీస్’తో అలరించబోతోంది. 

Latest Videos

click me!