తమన్నా - విజయ్ వర్మ లవ్ స్టోరీ అలా మొదలైందటా.. అర్ధరాత్రి ముంబైకి చేరుకున్న మిల్క్ బ్యూటీ!

First Published | Jan 5, 2023, 9:13 AM IST

ఎఫైర్ గురించి కొనసాగుతున్న పుకార్లపై తమన్నా భాటియా, విజయ్ వర్మ ఇంకా స్పందించలేదు. నిన్న రాత్రి వీరిద్దరూ ముంబైకి చేరుకున్నారు. ఆ ఫొటోలు వైరల్ అవుతుండగా..  మరోవైపు వీరి లవ్ ట్రాక్ ఎలా ప్రారంభమైందనే ఆసక్తికరంగా మారింది.
 

కొద్దినెలలుగా స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా  (Tamannaah Bhatia) పెళ్లి గురించి చాలా రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. వీటిని ఎప్పటికప్పుడు మిల్క్ బ్యూటీ కొట్టిపారేస్తూ వచ్చింది. అలాంటిది ప్రస్తుతం బాలీవుడ్ నటుడితో ప్రేమలో మునిగి తేలుతోందనే న్యూస్ నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
 

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా గోవాకు వెళ్లిన తమన్నా భాటియా.. పలు హిందీ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ వర్మ (Vijay Varma)తో  లవ్ లో ఉన్నట్టు తెలిసిపోయింది.  సెలబ్రేషన్స్ లో ఏకంగా విజయ్, తమన్నా కిస్ చేస్తున్న వీడియో బయటికి రావడంతో అసలు సంగతి బయటపడింది.
 


ఈ ఎఫైర్ ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారినా.. పుకార్లపై తమన్నా భాటియా, విజయ్ వర్మ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. నిన్న అర్ధరాత్రి వీరిద్దరూ ముంబైకి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

ముంబై ఎయిర్ పోర్టు నుంచి బయటికి వస్తుండగా కెమెరా కంటికి చిక్కారు. ‘కిస్’ వీడియో బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ విమానాశ్రయంలో ఇలా కనిపించారు. విజయ్ వైట్ టీ షర్టు, డెనిమ్‌ జీన్స్ ధరించగా, తమన్నా స్లీవ్ లెస్ బ్లాక్ ఫ్రాక్ లో ఆకట్టుకుంది. కాగా, ఇంతకీ వీరిద్దరి లవ్ ట్రాక్ ఎలా ప్రారంభమైందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
 

తమన్నా - విజయ్ మొదటిసారిగా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ‘లస్ట్ స్టోరీ 2’ షూట్ లోనే కలిసినట్టు తెలుస్తోంది.  అక్కడే ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఇక ఈ రూమర్లపై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. తమన్నా, విజయ్ వర్మ గతంలో ముంబైలో జరిగిన దిల్జిత్ దోసాంజ్ కచేరీలో కలిసి కనిపించారు. డిసెంబర్ 21న తమన్నా పుట్టినరోజున కూడా మీట్ అయ్యారని అంటున్నారు.
 

ప్రస్తుతం తమన్నా సౌత్ సినిమాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ దూకుడు పెంచింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూ వస్తోంది. చివరిగా ‘బబ్లీ బౌన్సర్’ విడుదలైంది. ప్రస్తుతం ‘భోళా శంకర్’లో నటిస్తోంది. హిందీలో మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది. 

Latest Videos

click me!