అమలా పాల్ కు వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..? క్రేజీ రూమర్స్ లో నిజం ఎంత..? కారణం ఏంటి..?

First Published | Sep 24, 2023, 12:02 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. హీరోయిన్ అమలా పాల్ కు వార్నింగ్ ఇచ్చారా..? ఇంటికి వెళ్లి మరీ హెచ్చరించారా..? ఓ జర్నలిస్ట్ చెప్పిన మాటల్లో నిజం ఎంత..? అసలు కారణం ఏంటి..? 

సూపర్ స్టార్ రజినీకాంత్ కు సౌమ్యుడిగా పేరుంది. ఆయనన్ను ఎవరైనా విమర్షించినా.. పెద్దగా స్పందించరు. కామ్ గానే విరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు రజినీకాంత్. కాని సూపర్ స్టార్ రజినీకాంత్ కు కోపం వచ్చిందట..? తనను ఎవరైనా ఏమన్నా అన్న పట్టించుకోని తలైవా.. తన కూతురువిషయంలో మాత్రం గట్టిగా స్పందించాడట. ఇంతకీ విషయం ఏంటీ..? 

Amala paul

సూపర్ స్టార్ రజినీకాంత్.. హీరోయిన్ అమలా పాల్ కు వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంది కూడా స్వయంగా సూపర్ స్టార్ అమలా పాల్ ఇంటికి వెళ్ళి మరీ వార్నింగ్ ఇచ్చారంట. ఈ విషయంలో ఎంత వరకూ నిజం ఉన్నది తెలియదు కాని.. ఓ జర్నలిస్ట్ చెసిన కామెంట్స్ ప్రకారం.. తన కూతురు కాపురం బాగుచేయడం కోసమే అమలా పాల్ ను గట్టిగా హెచ్చరించారట రజిని. 


Rajinikanth

 కోలీవుడ్ ప్రముఖ జర్నలిస్టు, సినీ విమర్శకుడు సయ్యరు బాలు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమలను సూపర్ స్టార్ రజనీకాంత్ హెచ్చరించారని చెప్పుకొచ్చారు. ధనుష్, అమల మధ్య... ఏదో అఫైర్ నడుస్తుందని.. ఈ విషయంలోనే  ధనుశ్ కు  ఆయన భార్యకు గొడవలు వచ్చాయి. అందుకే వారు విడిపోయినట్టు సమాచారం. అయితే వీరిద్దరి మధ్య ఉన్న  సాన్నిహిత్యం గురించి ధనుష్ మామ రజనీకాంత్ కు తెలియడంతో, రజనీకాంత్ అమలా పాల్ ఇంటికి వెళ్లి ఆమెకు వార్నింగ్ ఇచ్చాడని తెలిపాడు.

Amala Paul

ఆ జర్నలిస్ట్ వాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతే కాదు అసలు రజినీకాత్ వార్నింగ్ ఇవ్వడమేమింటి.. ఇది నిజమేనా.. ఏదో రూమర్స్ వచ్చి ఉంటాయి అంటున్నారు. అటు మరికొంత మంది మాత్రం నిజమే అయ్యి ఉంటంది. నిప్పులేనిదే పొగరాదుకదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది. రజినీకాంత్  వార్నింగ్ ఇచ్చాడు అని అనుకుంటున్న విషయం కూడా ఎప్పుడో జరిగిది. తాజాగా జర్నలిస్ట్ చేసిన కామెంట్స్ తో మరోసారి వెలుగులోకి వచ్చింది. 
 

ఇక అమలాపాలు గురించి చూస్తే... ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళంలో పుట్టి.. మాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. మలయాళ సినిమా నీలతమరన్‌తో సినీ రంగ ప్రవేశం చేసింది. కానీ, కోలీవుడ్ మైనా తర్వాత అమల అదృష్టం మారిపోయింది. విజయ్, విక్రమ్, సూర్య, ఆర్య, జయం రవి, ధనుష్‌తో సహా బాలీవుడ్ సూపర్‌స్టార్స్‌తో ఆమె నటించింది. 
 

Amala Paul

నిజానికి అమల – ధనుష్ ఎప్పటి నుంచోచాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు.  చాలా సన్నిహితంగా కూడా  ఉండేవారు. వారిద్దరూ కలిసి నటించిన ఫస్ట్ సినిమా వేళైల్లై పట్టదారి. ఈ సినిమాతోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, పెళ్లికి మించిన బంధానికి కూడా దారి తీసిందని కోలీవుడ్లో న్యూస్ వైరల్ అవుతుంటుంది. మరి ఇది ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది. 
 

Latest Videos

click me!