ఇంట్లో పెంచుకునే ముఖ్యమైన ఔషధ మొక్కలు ఏంటో తెలుసా?

First Published Oct 12, 2021, 5:04 PM IST

ఇంట్లో ఎన్నో రకాల పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుకుంటాం.. కానీ ఔషధ మొక్కలు కూడా పెంచుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. 

ఇంట్లో ఎన్నో రకాల పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుకుంటాం.. కానీ ఔషధ మొక్కలు కూడా పెంచుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక ఇంట్లో పెంచుకోవలసిన ఔషధ మొక్కలు గురించి తెలుసుకుందాం..
 

తులసి: ఇక ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులను తినడం వల్ల జలుబు, జ్వరం, శ్వాసకోస సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. తొట్టెలలో ఈ మొక్క పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
 

మెంతి: ఆకుకూరలలో ముఖ్యమైనది మెంతికూర. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది. బరువు పెరగవచ్చు, కాలేయ క్యాన్సర్ ను నివారిస్తుంది. బాలింతలకు మేలు చేస్తుంది. ఈ మొక్కను ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు.
 

 నిమ్మ చెట్టు: దీనిని ఎక్కువగా వంటకాలలో వాడతారు. ఇక ఈ ఆకులు నరాల సంబంధిత మరియు ఒత్తిడి సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.  శ్వాసకోశ వ్యాధులు, గొంతు ఇన్ఫెక్షన్లు, తలనొప్పి వంటి కొన్ని రకాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 

బాసిల్: ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. వీటిని వంటలలో కూడా వాడుతారు. దీనిని తీసుకోవడం వల్ల పిత్త వాయువు, అపానవాయువుల చికిత్స శక్తిని కలిగి ఉంటుంది. ఆకలి లేని వారికి ఈ ఆకు తినడం వల్ల వెంటనే ఆకలి బాధను తీరుస్తుంది. 
 

కలబంద: ముళ్లతో కూడి ఉన్న ఈ మొక్కల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వేడిమిని తగ్గిస్తుంది. ఈ రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గాయాలు, వాపులు వంటివి వాటిని నయం చేస్తుంది. జీర్ణ సమస్యలకు, ఆకలికి, మలబద్ధకం   నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 

 పుదీనా: పుదీనా ఆకులు వంటలలో బాగా ఉపయోగిస్తారు. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరానికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. కండరాల నొప్పి, కడుపు నొప్పి, జ్వరం వంటి కొన్ని వ్యాధుల నుండి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
 

 గోతు కోలా లేదా బ్రహ్మి: ఈ మొక్కను ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. ఇది చర్మ గాయాలను, కేశనాళికల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మెదడు మరియు నాడీ వ్యవస్థ వంటి వ్యాధులను నయం చేస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచే శక్తి ఈ మొక్కల్లో ఉన్నాయి.
 

 అశ్వగంధ: ఈ మొక్క వల్ల ఒత్తిడిని తగ్గించవచ్చు. నాడీ రక్షణ బాగా ప్రసిద్ధి చెందుతుంది. సంతానోత్పత్తికి  బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె సమస్యలను తగ్గిస్తుంది. కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది.చక్కెర శాతాన్ని కూడా నియంత్రిస్తుంది.

click me!