మనం ఇంట్లో పెంచుకునే మొక్కలలో పవిత్రమైన మొక్క తులసి మొక్క. తులసి మొక్కను హిందువులు దైవంగా భావించి పూజలు చేస్తుంటారు. తులసి మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. పైగా తులసి ఆకులను ప్రతి రోజు తింటే సర్వ రోగాలు నయమవుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఇక ఈ తులసి మొక్కలో కొన్ని మార్పులు వస్తే వెంటనే కొన్ని పనులు చేయాలి. లేదంటే ఇంటికే అరిష్టం అని శాస్త్రాలు చెబుతున్నాయి.
తులసి మొక్కను ఎక్కడపడితే అక్కడ పెంచకుండా మంచి కోట లాంటి తొట్టెలో పెంచాలి. తులసి మొక్కను లక్ష్మీ దేవత అనుగ్రహంగా పూజించాలి. ఈ మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండటమే కాకుండా నిత్యం దీపం పెట్టాలి. పుట్టుకనుంచి మరణం వరకు తులసి మొక్కను పెంచాలి. చూడటానికి ఈ మొక్క చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ ఈ మొక్క వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
ప్రతిరోజు ఉదయాన్నే తులసి మొక్కకు దీపం పెట్టి ప్రదక్షిణలు చేయడం వల్ల రాబోయే కష్టాల నుండి బయటపడవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఇంట్లో తులసి మొక్క ఉండటంవల్ల ఎటువంటి చెడు దుష్ట శక్తులు, అరిష్టాలు, దరిద్రాలు వంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటాయి. కుటుంబంను సుఖ శాంతులతో ఉంచుతుంది అనే నమ్మకం.
ఇక ఈ తులసి మొక్క భవిష్యత్తులో జరిగే కొన్ని విపత్తులను ముందే చూపిస్తుంది. ఇంట్లో గొడవలు, కష్టనష్టాలు, చిరాకులు, ఆర్థిక సమస్యలు వంటి కొన్ని విపత్తులు జరిగేటప్పుడు తులసి మొక్క ఆకులు రంగు మారుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక తులసి మొక్కను చనిపోయింది అని అనకూడదు. నిద్ర పోయింది అని అనాలని శాస్త్రాలు తెలిపాయి.
తులసి మొక్క నిద్రపోతే వెంటనే ఆ మొక్కను ఇంట్లో ఉంచకూడదు. అలా ఉంచినట్లయితే ఇంట్లో అశాంతి, గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, దరిద్రం వంటివి వెంటపడతాయి. నిద్రపోయిన ఆ తులసి మొక్కను వెంటనే వేర్లతో సహా తీసివేసి ఏదైనా పవిత్రమైన స్థలంలో కానీ లేదంటే నీటి కాలువలో కానీ నిమజ్జనం చేయాలి. ఇక ఆ కోటను ఖాళీగా ఉంచకుండా మరొక తులసి మొక్కను పెంచాలి.
తులసి మొక్కను తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో పెట్టాలి. దక్షిణం వైపు మాత్రం తులసి మొక్కను పెట్టకూడదు. పెట్టినట్లయితే వ్యతిరేక విపత్తులు ఎదురవుతాయి. వీలైనంత వరకు తులసి మొక్కను వంటగదికి దగ్గరలో పెట్టాలి. కొన్ని కొన్ని సార్లు మొక్కపై బుధగ్రహ ప్రభావం పడటం వల్ల ఆకులు ఎండిపోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మొక్కను జాగ్రత్తగా చూసుకోవాలి.
శాస్త్రీయ ప్రకారం తులసి మొక్కకు ఆదివారం నీరు పోయకూడదు. ఏకాదశి రోజు, సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం రోజు కూడా నీరు పోయకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క ఆకులను వేరు చేయరాదు. అలా చేస్తే ఇంట్లోకి దోషాలు వస్తాయి. కాబట్టి తులసి మొక్కను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని పురాణాలు చెబుతున్నాయి.