ఈ మొక్కలను ఇంట్లో పెంచుతున్నారా.. అయితే ఆర్థిక సమస్యలు గ్యారంటీ?

First Published | Oct 9, 2021, 3:35 PM IST

చాలా మందికి మొక్కలు అంటే బాగా ఇష్టం. రకరకాల మొక్కలను ఇంటీ ఆవరణంలో పెంచుకుంటుంటారు. ఇది మంచి విషయమే.

చాలా మందికి మొక్కలు అంటే బాగా ఇష్టం. రకరకాల మొక్కలను ఇంటీ ఆవరణంలో పెంచుకుంటుంటారు. ఇది మంచి విషయమే. కానీ కొన్ని రకాల మొక్కలు, చెట్లను ఇంటి ఆవరణలో పెంచడం వలన పాజిటివ్ ఎనర్జీ తగ్గి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.
 

ఇంట్లో పెద్ద పెద్ద చెట్లు, ముళ్ళ చెట్లు, పాలు కారే చెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదు. పెద్ద పెద్ద వేర్లు ఉన్న చెట్లను ఇంటి ఆవరణలో అస్సలు పెంచకూడదు. కాబట్టి ఇంటి ఆవరణలో ఎలాంటి మొక్కలు పెంచకూడదో తెలుసుకుందాం..
 


జిల్లెడు చెట్టు: జిల్లెడు చెట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటి ఆవరణంలో పెంచకూడదు. జిల్లెడు చెట్టు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లు నాశనమవుతుంది అని పెద్దలు చెబుతుంటారు. ఈ చెట్టు రసం కంటిలో పడితే కంటిచూపు పోతాయని పూర్వికులు అంటుంటారు.

చింత చెట్టు: చింత చెట్టు మీ ఇంటికి దగ్గరగా ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఈ చెట్లను ఇంట్లో అస్సలు నాటకూడదు. ఈ చెట్లు ఇంట్లో ఉంటే దుష్టశక్తులు, దయ్యాలు ఉంటాయని కొందరు నమ్ముతుంటారు.
 

రావి చెట్టు: రావి చెట్టును దైవంగా ఆరాధిస్తారు. వీటిని ఎక్కువగా దేవాలయం చుట్టూ పెంచుతారు. కానీ ఈ చెట్టును ఇంట్లో పెంచకూడదు. ఈ చెట్టు ఇంట్లో పెంచడం వల్ల ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.
 

మర్రి చెట్టు: ఈ చెట్టును ఇంటి ఆవరణంలో పెంచరాదు. ఎందుకంటే ఇవి పెద్ద ఊడలను కలిగి ఉంటుంది. ఈ చెట్టును పెంచడం వల్ల ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు. అంతే కాకుండా కొన్ని దుష్ట శక్తులు వెంటాడుతుంటాయని పూర్వీకులు అంటుంటారు.

ఈత చెట్టు: ఈ చెట్టును చాలా వరకు అలంకారంగా మరియు ఈత పళ్ళ కోసం పెంచుతుంటారు. కానీ ఈ చెట్టును పెంచుకోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈత కాయలు పెరుగుతున్న కొద్దీ కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

 రేగు చెట్టు: ఈ చెట్టు నుండి వచ్చే రేగుపండ్లను తింటారు.  కానీ ఈ చెట్టు ఇంట్లో పెంచకూడదు. ఈ చెట్టు ముళ్లతో కూడి ఉంటుంది. ముళ్ళ కారణంగా కొన్ని సమస్యలు వస్తాయని నమ్ముతుంటారు. కాబట్టి ఇటువంటి చెట్లను ఇంట్లో పెంచకూడదు.

Latest Videos

click me!