Snakes: పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే.. ఈ అద్భుతమైన చిట్కాలను పాటించండి!

Published : Jun 30, 2025, 03:23 PM IST

Snakes: వర్షాకాలంలో మీ ఇల్లు, తోట చుట్టూ పాములు తిరుగుతున్నాయా? అది చాలా ప్రమాదకరం. పిల్లలు, పెద్దలు ఎవరైనా ప్రమాదానికి గురవ్వచ్చు. పాములను ఎలా తరిమికొట్టాలని భావిస్తున్నారా? పాముల రాకను తగ్గించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం అవసరం.

PREV
16
వర్షాకాలంలో పాముల బెడద

వర్షాకాలంలో నది, కాలువ, చెరువులకు సమీపంగా ఉన్న ఇళ్లకు పాములు రావడం సాధారణం. ఇవి ఇంట్లోకి ప్రవేశించి పిల్లలకు, పెద్దలకు ప్రమాదం కలిగించవచ్చు. కాబట్టి పాములు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇక్కడ చూడండి.

26
నాఫ్తలీన్ బాల్స్

పాములు దూరం ఉండాలంటే నాఫ్తలీన్ బాల్స్ ఉపయోగించండి. తోటలోకి లేదా ఇంట్లోకి పాములు రాకుండా ఉండేందుకు నాఫ్తలీన్ బాల్స్ ఎంతో ఉపయోగపడతాయి. 4–5 నాఫ్తలీన్ బాల్స్‌ను పొడి చేసి, అందులో 2 కప్పుల నీళ్లు కలిపి ద్రావణం తయారుచేయాలి. ఈ ద్రావణాన్ని చెట్లు, మొక్కలు, ఇంటి చుట్టూ చల్లితే పాములు దూరంగా ఉంటాయి, ఎందుకంటే ఈ వాసన పాములకు అసహ్యంగా ఉంటుంది. అయితే, పిల్లలు వాటిని తాకకుండా జాగ్రత్తపడాలి.

36
అమ్మోనియా ద్రావణం:

పాములకు  అమ్మోనియా ఘాటైన వాసన నచ్చదు. ఇది కేవలం పాములే కాకుండా వర్షాకాలంలో వచ్చే కొన్ని కీటకాలను కూడా నివారిస్తుంది. దీనికోసం: 2 కప్పుల నీటిలో 2–3 స్పూన్ల అమ్మోనియా వేసి, బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి, ఇంటి చుట్టూ, తోటల్లోని చెట్లు, మొక్కలపై స్ప్రే చేయండి. ఈ వాసన వల్ల పాములు దూరంగా పారిపోతాయి. కానీ స్ప్రే చేసే సమయంలో చేతి తొడుగు (గ్లోవ్స్) వాడటం,  

46
లవంగం, దాల్చిన చెక్క నూనె :

పాములు రాకుండా లవంగాలు, దాల్చిన చెక్క నూనె సహాయపడతాయి. లవంగం, దాల్చిన చెక్క నూనె వాసన పాములకు నచ్చదు. ఈ మిశ్రమం కోసం 1 కప్పు నీటిలో 2  లవంగాలు, నూనె కలిపి ద్రావణం తయారు చేయండి. ఆ మిశ్రమాన్ని ఇంటి చుట్టూ, తోటలో చల్లాలి. ఇది పాములనే కాదు, వర్షాకాలంలో వచ్చే కీటకాలకు చెక్ పెడుతుంది..  

56
సల్ఫర్ :

మీ ఇంటికి పాములు రాకుండా ఉండటానికి సల్ఫర్ పౌడర్ చక్కటి పరిష్కారం. సల్ఫర్ పౌడర్‌ కు ఉండే ఘాటైన వాసన పాములకు నచ్చదు. దీన్ని ఇంటి చుట్టూ, తోటలో చల్లితే పాములు ఇంట్లోకి రాకుండా దూరంగా ఉంటాయి. 

జాగ్రత్త: సల్ఫర్‌ను వాడేటప్పుడు గ్లోవ్స్ ధరించి, పిల్లల నుంచి దూరంగా ఉంచాలి.

66
నిమ్మకాయ వినెగార్ + బేకింగ్ సోడా మిశ్రమం

పాములు ఘాటైన వాసనలను అసహ్యించుకుంటాయి. నిమ్మకాయ వినెగార్, బేకింగ్ సోడా మిశ్రమం ఈ విషయంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని తోట, ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో చల్లితే.. పాములు ఇంట్లోకి రాకుండా దూరంగా ఉంటాయి.

గమనిక: పై చిట్కాలతో పాటు, మీ ఇల్లు, తోటను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఇంట్లో చెత్త, పాత వస్తువులు లేకుండా చూడాలి.  ఇలా చేస్తే పాములు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

Read more Photos on
click me!

Recommended Stories