1.అలోవెరా..
ఇంట్లో ఏ మూలలో పెంచినా పెరిగే మొక్క ఇది. పెద్దగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. బయట, బాల్కనీలో అయినా పెరుగుతుంది. ఇక, అలోవెరాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా గాయాలు నయం చేయడంతో పాటు.. అందం, ఆరోగ్యం, చర్మ సౌందర్యం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఒక్కసారి నాటితో చాలా సంవత్సరాలు పెరుగుతుంది.