Smart Watch: స్మార్ట్‌వాచ్‌లో వీడియో call ఫీచ‌ర్‌.. దీంతో మీ పిల్ల‌లు ఎక్క‌డున్నా సేఫ్

Published : Apr 07, 2026, 04:19 PM IST

Smart Watch: పిల్లలు బయటకు వెళ్లినప్పుడు వారు ఎక్కడ ఉన్నారు? సురక్షితంగా ఉన్నారా? అనే సందేహాలు రావ‌డం సాధార‌ణం. అయితే పిల్ల‌ల భ‌ద్ర‌త కోసం imoo Kids Phone Watch Z1 పేరుతో ఓ స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉంది.  

PREV
15
హెచ్‌డీ వాయిస్ అండ్ వీడియో కాల్స్

imoo Z1 పిల్లల కోసం రూపొందించిన 4G స్మార్ట్ వాచ్. ఇందులో 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. దీని ద్వారా పిల్లలు తల్లిదండ్రులతో HD వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేయవచ్చు. Wi-Fi లేదా మొబైల్ డేటా ద్వారా ఈ కాల్స్ పని చేస్తాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు పిల్లలు SOS బటన్ నొక్కితే వెంటనే తల్లిదండ్రులకు అలర్ట్ వెళ్తుంది. దీంతో వెంటనే స్పందించేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓస్ ఫోన్ల‌కు స‌పోర్ట్ చేస్తుంది.

25
క‌చ్చితమైన లొకేషన్ ట్రాకింగ్

ఈ స్మార్ట్ వాచ్‌లో GPS ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. గూగుల్ మ్యాప్స్ సపోర్ట్‌తో కలిసి 5 శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్‌లు పనిచేస్తాయి. దీని వల్ల పిల్లలు ఎక్కడ ఉన్నారో సుమారు 10 మీటర్ల ఖచ్చితత్వంతో తెలుసుకోవచ్చు. త‌ల్లిదండ్రులు తమ మొబైల్‌లో ఉన్న imoo యాప్ ద్వారా పిల్లల లొకేషన్‌ను రియల్ టైమ్‌లో చూడవచ్చు. పిల్లలు స్కూల్‌కు వెళ్లినప్పుడు, బయట ఆడుతున్నప్పుడు లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు వారి కదలికలను సులభంగా గమనించవచ్చు.

35
పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బలమైన డిజైన్

ఈ స్మార్ట్ వాచ్ 3 నుంచి 14 సంవత్సరాల పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. దీనిని షాక్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ డిజైన్‌తో రూపొందించారు. ఇందులో IPX8 వాటర్ రెసిస్టెంట్ ఇచ్చారు. దీంతో నీటి తుంప‌ర్లు లేదా వర్షంలో త‌డిసినా ఇబ్బంది ఉండ‌దు. అలాగే స్క్రీన్ సేఫ్ టెక్నాలజీ కారణంగా స్క్రీన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. కంపెనీ తరచూ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు కూడా ఇస్తుంది.

45
తల్లిదండ్రులకు శక్తివంతమైన కంట్రోల్ ఫీచర్లు

ఈ వాచ్‌లో ఉన్న ముఖ్యమైన ఫీచర్ పేరెంట‌ల్ కంట్రోల్‌. తల్లిదండ్రులు తమ మొబైల్‌లో ఉన్న imoo యాప్ ద్వారా చాలా సెట్టింగ్స్ నియంత్రించవచ్చు. ఉదాహరణకు పిల్లలు మాట్లాడే ట్రస్టెడ్ కాంటాక్ట్స్ జోడించడం, తెలియని నంబర్లను బ్లాక్ చేయడం, కాల్ లాగ్స్ చూడడం, రిమైండర్లు సెట్ చేయడం, కొత్త యూజర్లను అనుమతించడం వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. ఈ విధంగా పిల్లలతో కమ్యూనికేషన్ సురక్షితంగా ఉండేలా తల్లిదండ్రులు నియంత్రణలో ఉంచవచ్చు.

55
క్లాస్ మోడ్, స్ట్రేంజర్ రిజెక్షన్, కుటుంబ కనెక్టివిటీ

స్కూల్ సమయాల్లో పిల్లలు ఫోన్ ఉపయోగించకుండా ఉండేందుకు క్లాస్ మోడ్‌ అనే ఫీచర్ ఉంది. ఈ మోడ్ ఆన్ చేసినప్పుడు కాల్స్ లేదా ఇతర డిస్ట్రాక్షన్స్ ఉండవు. అలాగే స్ట్రేంజ‌ర్ రిజెక్ష‌న్ ఫీచర్ వల్ల తెలియని వ్యక్తులు పిల్లలతో సంప్రదించలేరు. imoo యాప్ ద్వారా కుటుంబ సభ్యులు కూడా కనెక్ట్ అవ్వవచ్చు. ఫ్యామిలీ చాట్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా పిల్లలతో సులభంగా మాట్లాడవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌లో 740mAh బ్యాటరీ ఉంది. సాధారణ వినియోగంలో మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఇందులో 128 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. Wi-Fi + 4Gకి క‌నెక్ట్ అవుతుంది. నానో సిమ్ కార్డ్ సపోర్ట్ చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories