Air Purifier: రోజంతా పొల్యుష‌న్‌లో తిరుగుతుంటారా.? మెడ‌లో ఈ చిన్న లాకెట్ వేసుకుంటే మీకేం కాదు

Published : Apr 03, 2026, 11:15 AM IST

Air Purifier: గాలి కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. ట్రాఫిక్, ధూళి, పొగ, పరిశ్రమల వల్ల గాలిలో హానికర కణాలు పెరుగుతున్నాయి. ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకు అమెజాన్‌లో ఓ అదిరిపోయే ప్రొడ‌క్ట్ అందుబాటులో ఉంది. ఇంత‌కీ ఏంటీ ప్రొడ‌క్ట్‌, ఎలా ప‌నిచేస్తుంది.?

PREV
15
చిన్న సైజు – ఎక్కడికైనా తీసుకెళ్లే సౌకర్యం

పురిఫా 01 చాలా చిన్నదిగా, తేలికగా ఉంటుంది. దీని బరువు కేవలం 29 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఇక 47 × 47 × 17 మిల్లీమీటర్ల ప‌రిమాణంతో ఒక చిన్న లాకెట్‌లా ఉంటుంది. దీనిని మెడకు వేసుకునేలా రూపొందించారు. ఇది చాలా తేలికగా ఉండటంతో రోజంతా వేసుకోవ‌చ్చు. ట్రావెల్, ఆఫీస్, స్కూల్, మార్కెట్ ఇలా ఎక్క‌డికైనా వేసుకొని వెళ్‌లొచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ ఉపయోగించేందుకు అనువుగా ఉంటుంది.

25
దీర్ఘకాల బ్యాటరీ – వేగవంతమైన ఛార్జింగ్

ఈ పరికరంలో ఉన్న బ్యాటరీ ఎక్కువ‌కాలం పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 గంటల వరకు ఉపయోగించవచ్చు. కేవలం 48 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది. ఇది బ్యాటరీ ఆధారంగా పనిచేస్తుంది. అందువల్ల తరచుగా ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రయాణాల్లో లేదా బయట ఎక్కువసేపు ఉండేవారికి ఇది చాలా ఉపయోగకరం.

35
PM2.5 అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

గాలిలో ఉండే చాలా సూక్ష్మమైన ధూళి కణాలను PM2.5 అని అంటారు. వీటి పరిమాణం చాలా చిన్నది. ఒక మనిషి వెంట్రుక వెడల్పులో 30 నుంచి 40 వరకు PM2.5 కణాలు సరిపోతాయి. ఈ కణాలు ముక్కు, గొంతు ఫిల్టర్‌లను దాటిపోతాయి. నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతాయి. కొన్ని సందర్భాల్లో రక్తంలోకి కూడా చేరే అవకాశం ఉంటుంది. అందువల్ల పెద్ద ధూళి కణాల కంటే ఇవి ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం కలిగిస్తాయి.

45
నెగటివ్ అయాన్ టెక్నాలజీతో గాలి శుద్ధి

Purifa 01 లో అడ్వాన్స్‌డ్ వేరియ‌బుల్ అనియ‌న్ టెక్నాల‌జీ ఉపయోగించారు. ఇది గాలిలోకి ప్రతి సెకనుకు లక్షల సంఖ్యలో నెగ‌టివ్ అయాన్‌ విడుదల చేస్తుంది. ఈ అయాన్లు గాలిలోని ధూళి, పొగ, పరాగకణాలు, అలర్జీ కారకాలు వంటి వాటికి అంటుకుంటాయి. ఆ కణాలు బరువెక్కి గాలిలో తేలకుండా కిందపడతాయి. దీంతో మనం శ్వాస తీసుకునే గాలి మరింత స్వచ్ఛంగా ఉంటుంది. ప్రకృతిలో కూడా ఈ నెగటివ్ అయాన్లు సాధారణంగా కనిపిస్తాయి. ఉదాహరణకు జలపాతాల దగ్గర లేదా వర్షం తర్వాత గాలి తాజాగా అనిపించడం దీనివల్లే.

55
ఫిల్టర్ అవసరం లేదు

ఈ పరికరం ప్రత్యేకత ఏమిటంటే ఫిల్టర్ అవసరం ఉండదు. ఫిల్టర్ మార్చే పని లేదు, ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు, ఒక బటన్ నొక్కితే వెంటనే పని ప్రారంభమవుతుంది. శబ్దం లేకుండా పనిచేస్తుంది. అందువల్ల రోజూ సులభంగా ఉపయోగించవచ్చు.

గాలి కాలుష్యానికి ప్రత్యేక రక్షణ

భారతదేశంలో గాలి నాణ్యత సూచీ (AQI) సగటుగా 160 వరకు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అనుకూలం కాని స్థాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో పర్సనల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించడం ద్వారా మన చుట్టూ ఉన్న గాలిని కొంతవరకు శుభ్రంగా ఉంచుకోవచ్చు. ట్రాఫిక్, మార్కెట్లు, కార్యాలయాలు, కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories