వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఎసిలు, ఫ్యాన్లు ఎక్కువగా వాడుతున్నాం. దీంతో కరెంటు బిల్లు పెరగడం సహజం. కానీ కొన్ని చిట్కాలతో బిల్లును తగ్గించుకోవచ్చు. రోజువారీ అలవాట్లను మార్చుకుంటే కరెంటు ఆదా చేయవచ్చు. చిన్న చిన్న మార్పులతో నెలంతా చాలా ఆదా అవుతుంది. ఎసిని 24°C వద్ద, ఫ్యాన్ వేసుకుంటే చల్లగా ఉంటుంది, కరెంటు కూడా తక్కువ అవుతుంది.