24°C – కరెంటు ఆదాకు మంచి ఉష్ణోగ్రత
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) చెబుతున్న దాని ప్రకారం ఏసీని 24 డిగ్రీల సెల్సియస్‌లో నడపాలి. దీంతో గది మొత్తం చల్లగా ఉంచడమే కాదు, విద్యుత్ వినియోగాన్ని 15-20% వరకు తగ్గిస్తుంది. అందుకే ఇది BEE సూచించిన ఉష్ణోగ్రతను ఎల్లప్పుడూ మెయింటెయిన్ చేయాలి.
తక్కువ టెంపరేచర్ – ఎక్కువ బిల్లుకు కారణం
కొందరు గది లేదా ఇల్లు బాగా చల్లగా ఉండాలని ఏసీని 16-18°Cలో పెడుతుంటారు. నిజానికి మన శరీరానికి ఇంత తక్కువ ఏసీ కూడా అవసరం లేదు. ఇలా చేస్తుంటే దీర్ఘకాలంలో సమస్యలు వస్తాయి. అతి తక్కువ ఉష్ణోగ్రతలు పెడితే ఏసీ కంప్రెసర్ పై ఎక్కువ భారం పడుతుంది. ఎక్కువ పని చేయాల్సి రావడంతో దాని లైఫ్ తగ్గుతుంది. పైగా కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుంది.
స్మార్ట్ యూజ్
ఏసీలో స్మార్ట్ యూజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని తెలివిగా ఉపయోగిస్తే విద్యుత్తు మరింత ఆదా అవుతుంది. స్మార్ట్ వ్యక్తులు ఏసీని నడపడమే కాదు, తెలివిగా నడుపుతారు. 24°C, ఆటో మోడ్ – ఈ రెండు కలిస్తే కరెంటు ఆదా అవుతుంది. ఇల్లు లేదా ఆఫీసు – 24°Cలో ఏసీ నడిపితే నెల చివర్లో బిల్లులో తేడా తెలుస్తుంది. తక్కువ టెంపరేచర్, ఎక్కువ బిల్లు – అర్థమైంది కదా?