Lazy Glasses: ప‌డుకునే పుస్త‌కం చ‌ద‌వొచ్చు, టీవీ చూడొచ్చు.. లేజీ గ్లాసెస్‌తో ఎన్నో ఉప‌యోగాలు

Published : Sep 25, 2026, 03:41 PM IST

Lazy Glasses: పడుకుని పుస్తకం చదవాలన్నా, మొబైల్ చూడాలన్నా సాధారణంగా తలను పైకి ఎత్తాలి. కొంతసేపటి తర్వాత మెడ, భుజాలు, వెన్నుపై ఒత్తిడి ప‌డి నొప్పి మొద‌లువుతంది. ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకు మార్కెట్‌లో ప్ర‌త్యే గ్లాసెస్ అందుబాటులో ఉన్నాయి.

PREV
15
ఈ గ్లాసెస్ ఉపయోగం ఏంటి?

లేజీ రీడ‌ర్స్ గ్లాసెస్ పేరుతో అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రొడ‌క్ట్ అస‌లు ధ‌ర రూ. 1499 కాగా ప్ర‌స్తుతం 68 శాతం డిస్కౌంట్‌తో కేవ‌లం రూ. 479కే ల‌భిస్తోంది. ఈ గ్లాసెస్ ప్రధాన ఉద్దేశం పడుకున్న భంగిమలోనే చదవడం లేదా స్క్రీన్ చూడడం. ఉదాహరణకు మంచంపై వెల్లకిలా పడుకుని పుస్తకం చదువుతున్నారని అనుకుందాం. సాధారణంగా పుస్తకాన్ని కళ్ల ముందుకు తీసుకురావాలి లేదా తలను పైకి ఎత్తి చూడాలి. దీనివల్ల మెడపై ఒత్తిడి రావచ్చు. ప్రిజమ్ గ్లాసెస్ పెట్టుకుంటే మాత్రం పుస్తకం లేదా మొబైల్‌ను మన ముఖం ముందు కాకుండా శరీరం వైపు ఉంచినా చూడగలుగుతాం. అలాగే మంచంపై పడుకుని టీవీ చూడటం, ట్యాబ్లెట్ ఉపయోగించడం, మొబైల్‌లో వీడియోలు చూడటం వంటి పనులకు కూడా వీటిని ఉపయోగించవచ్చు. మెడ లేదా వెన్ను కదలికలను పరిమితం చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా ఇవి సౌకర్యంగా అనిపించవచ్చు. అయితే ఇవి వైద్య పరికరాలు లేదా మెడ నొప్పికి చికిత్స చేసే సాధనాలు కావని గుర్తించాలి.

25
ఇవి అసలు ఎలా పనిచేస్తాయి?

ఈ గ్లాసెస్‌లో సాధారణ కళ్లద్దాల లెన్స్‌లకు బదులుగా ప్రత్యేకమైన ప్రిజమ్ ఆప్టికల్ డిజైన్ ఉంటుంది. ప్రిజమ్‌లోకి కాంతి ప్రవేశించినప్పుడు దాని దిశ మారుతుంది. ఈ సూత్రాన్నే ఉపయోగించి గ్లాసెస్‌లోకి వచ్చే దృశ్యాన్ని సుమారు 90 డిగ్రీల కోణంలో మళ్లించేలా డిజైన్ చేస్తారు. సులభంగా చెప్పాలంటే.. మీరు మంచంపై వెల్లకిలా పడుకుని పైకి చూస్తున్నా, గ్లాసెస్‌లోని ప్రిజమ్ మీ ముందు ఉన్న వస్తువు నుంచి వచ్చే కాంతిని మళ్లించి కళ్లకు చేరేలా చేస్తుంది. దాంతో తలను వంచాల్సిన అవసరం లేకుండా కిందివైపు ఉన్న పుస్తకం లేదా మొబైల్‌ను చూడగలుగుతారు. ఇది కెమెరా లేదా వీడియోను తిప్పడం లాంటిది కాదు. కళ్లకు చేరే కాంతి దిశను మార్చడం ద్వారా మనకు వస్తువు వేరే కోణంలో కనిపించేలా చేస్తుంది.

35
పడుకునే పుస్తకం, మొబైల్, టీవీ చూడొచ్చు

ఈ గ్లాసెస్‌ను ప్రధానంగా ఇలాంటి ఉపయోగాల కోసమే తయారు చేశారు. మంచంపై పడుకుని పుస్తకం చదువుతున్నప్పుడు పుస్తకాన్ని సౌకర్యంగా పట్టుకుని చదవొచ్చు. అలాగే మొబైల్‌ను చేతిలో పట్టుకుని స్క్రోల్ చేయడం, వీడియోలు చూడడం, ట్యాబ్లెట్ ఉపయోగించడం వంటివి చేయవచ్చు. టీవీ చూడటానికి కూడా ఉపయోగించవచ్చు. అయితే టీవీ దూరం, స్క్రీన్ ఎత్తు, గ్లాసెస్‌లోని ప్రిజమ్ నాణ్యతను బట్టి విజువ‌ల్ క‌నిపించే క్లారిటీ మారుతుంది.

45
మెడ, వెన్నుపై ఒత్తిడి తగ్గుతుందా?

ఈ గ్లాసెస్‌లో ప్రధాన ప్రయోజనం చూసేందుకు మెడను పదేపదే వంచాల్సిన అవసరం లేకపోవడం. సాధారణంగా పడుకుని చదువుతున్నప్పుడు తలను పైకి ఎత్తడం లేదా మెడను ఒకే భంగిమలో ఉంచడం వల్ల అసౌకర్యం కలగొచ్చు. ప్రిజమ్ గ్లాసెస్ ఉపయోగిస్తే తలను కదపకుండా స్క్రీన్ లేదా పుస్తకాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. అందుకే మెడకు ఇబ్బంది ఉన్నవారు, ఎక్కువసేపు మంచంపై విశ్రాంతి తీసుకునేవారు, ఆసుపత్రిలో బెడ్ రెస్ట్‌లో ఉన్నవారు, ప్రయాణ సమయంలో పడుకుని చదవాలనుకునేవారు వీటిని సౌకర్యవంతమైన సాధనంగా ఉపయోగించవచ్చు. అయితే మెడ నొప్పి, సర్వైకల్ సమస్య, వెన్నునొప్పిని ఇవి నయం చేయవు. నొప్పి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

55
వీటిని కొనేముందు గ‌మ‌నించాల్సిన విష‌యాలు

ప్రిజమ్ గ్లాసెస్ కొనేటప్పుడు కేవలం తక్కువ ధరను మాత్రమే చూడకుండా కొన్ని విషయాలను గమనించాలి. ముఖ్యంగా లెన్స్ నాణ్యత, చూపు స్పష్టత, ఫ్రేమ్ బరువు, ప్రిజమ్ కోణం, కళ్లకు సరిపోయే విధానం వంటి అంశాలను పరిశీలించాలి. లెన్స్ నాణ్యత తక్కువగా ఉంటే ఎక్కువసేపు చూస్తున్నప్పుడు అసౌకర్యం కలగొచ్చు. అందుకే క్లియర్ ఆప్టికల్ లెన్స్, తేలికైన ఫ్రేమ్, ముఖంపై ఎక్కువ ఒత్తిడి కలిగించని డిజైన్ ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories