JioBharat: యూపీఐ పేమెంట్స్‌, లైవ్ టీవీ.. రూ. 299కే జియో ఫోన్‌, ఎలాగంటే

Published : Oct 01, 2026, 11:23 AM IST

JioBharat: టెలికం ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న రిల‌య‌న్స్ జియో మ‌రో సంచ‌ల‌నంతో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. టెలికం రంగంలోకి ప్ర‌వేశించి 10 ఏళ్లు పూర్తయిన సంద‌ర్భంగా జియో భార‌త్ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది.

PREV
15
రూ.299కే జియో 4G ఫోన్..

ఫీచర్ ఫోన్ వినియోగదారులకు రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. జియో టెలికాం రంగంలోకి ప్రవేశించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జియో భారత్ 4G ఫోన్‌ను రూ.1,499కు కొనుగోలు చేస్తే.. ఆరు నెలల పాటు ఉచిత రీఛార్జ్ ప్రయోజనాలు పొందవచ్చు. సాధారణంగా ఈ కాలానికి అయ్యే రీఛార్జ్ ఖర్చు రూ.1,200 వరకు ఉంటుంది. ఆ మొత్తాన్ని ప్రయోజనంగా పరిగణిస్తే ఫోన్ అసలు ధర రూ.299కే వచ్చినట్లవుతుంది అన్న‌మాట‌.

25
నెలకు 14GB డేటా.. అపరిమిత కాల్స్

ఈ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులకు ఆరు నెలల పాటు ప్రతినెలా 14GB డేటా లభిస్తుంది. దీంతో మొత్తం 84GB డేటాను వినియోగించుకోవచ్చు. అలాగే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ ప్రయోజనాల కోసం నెలవారీ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆరు నెలల కాలానికి సంబంధించిన ప్రయోజనాలను ముందుగానే అందించడం వల్ల ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత కొంతకాలం రీఛార్జ్ ఖర్చు ఉండదు.

35
కాల్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా

జియో భారత్ ఫోన్ కేవలం కాల్స్, మెసేజ్‌లకే పరిమితం కాదు. ఇందులో వినోదం కోసం పలు జియో సేవలను ఉపయోగించుకోవచ్చు. జియోటీవీ ద్వారా 500కు పైగా టీవీ ఛానెళ్లను చూడొచ్చు. జియోహాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్, సినిమాలు, ఇతర కంటెంట్‌ను యాక్సెస్ చేసే సదుపాయం ఉంది. జియో మ్యూజిక్ ద్వారా పాటలు వినవచ్చు. ఫీచర్ ఫోన్‌లోనే ఎఫ్‌ఎం రేడియో, ఫ్లాష్‌లైట్ వంటి సాధారణంగా ఉపయోగపడే సౌకర్యాలు కూడా ఉన్నాయి.

45
UPI చెల్లింపులు.. HD వాయిస్ కాలింగ్

స్మార్ట్‌ఫోన్ లేకపోయినా డిజిటల్ చెల్లింపులు చేయాలనుకునే వారికి జియో భారత్ సిరీస్‌లోని ఫోన్లు ఉపయోగపడేలా రూపొందించారు. జియోపే ద్వారా UPI చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుంది. జియో 4G నెట్‌వర్క్ ద్వారా HD వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. జియో భారత్ సిరీస్‌లో A1, B1, B2, B3 వంటి పలు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఫీచర్ ఫోన్‌లోనే డిజిటల్ సేవలు, వినోద సదుపాయాలను అందించడమే ఈ సిరీస్ ప్రత్యేకత.

55
2.4 అంగుళాల డిస్‌ప్లే.. 2,000mAh బ్యాటరీ

జియో భారత్ 4G ఫోన్‌లో 2.4 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. 2,000mAh బ్యాటరీతో వస్తుంది. 4G కనెక్టివిటీ, HD వాయిస్ కాలింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అదనంగా జియో సేఫ్టీ షీల్డ్ ద్వారా సేఫ్ కాలింగ్, లొకేషన్ మానిటరింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. కీప్యాడ్ ఫోన్‌ను ఇష్టపడేవారికి తక్కువ ధరలో 4G కనెక్టివిటీతో పాటు కాల్స్, డేటా, వినోదం, UPI వంటి సౌకర్యాలను ఒకే పరికరంలో అందించేలా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories