Interesting Facts: స్మార్ట్‌ఫోన్‌లు ఎన్నో రంగుల్లో వస్తున్నా, వాటి చార్జర్లు మాత్రం నలుపు లేదా తెలుపు రంగుల్లోనే కనిపిస్తాయి. ఇది యాదృచ్ఛికంగా తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనుక సాంకేతికత, భద్రత, ఖర్చు వంటి బలమైన కారణాలు ఉన్నాయని మీకు తెలుసా.?
ఫోన్ చార్జింగ్ సమయంలో చార్జర్‌లో వేడి ఏర్పడుతుంది. నలుపు, తెలుపు రంగులు ఆ వేడిని సమర్థంగా నియంత్రించడంలో సహాయపడతాయి. వీటి ద్వారా వేడి త్వరగా బయటకు విడుదల అవుతుంది. దీని వల్ల చార్జర్ అధికంగా వేడెక్కే అవకాశం తగ్గుతుంది. ఫలితంగా ప్రమాదాలు తక్కువగా ఉంటాయి.
25
తయారీ ఖర్చు తగ్గించేందుకు
స్మార్ట్‌ఫోన్ కంపెనీలు లక్షలాది చార్జర్లు తయారు చేస్తాయి. నలుపు లేదా తెలుపు ప్లాస్టిక్ వాడితే తయారీ ప్రక్రియ సులభంగా సాగుతుంది. ఇతర రంగుల్లా ప్రత్యేక డైలు అవసరం ఉండదు. యంత్రాలను తరచూ శుభ్రం చేయాల్సిన పనిలేదు. దీంతో సమయం ఆదా అవుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది.
35
భద్రతా పరీక్షలు సులభంగా చేయడానికి
చార్జర్లు మార్కెట్‌లోకి రావడానికి ముందు ఫైర్ సేఫ్టీ, షార్ట్ సర్క్యూట్ వంటి కఠిన పరీక్షలు జరుగుతాయి. నలుపు లేదా తెలుపు ప్లాస్టిక్ మీద కాలిన మచ్చలు, పొగ గుర్తులు, కరిగిన భాగాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది లోపాలను త్వరగా గుర్తించేందుకు సహాయపడుతుంది.
ఈ రెండు రంగులకు వాడే ప్లాస్టిక్ ఫార్ములాలు ఇప్పటికే భద్రతా సంస్థల ఆమోదం పొందినవే. కొత్త రంగులు వాడితే మళ్లీ కొత్త పరీక్షలు, అనుమతులు అవసరం అవుతాయి. దీని వల్ల ఉత్పత్తి ఆలస్యం అవుతుంది. నలుపు, తెలుపు రంగులతో ఆ సమస్య ఉండదు.
55
వినియోగదారులకు సౌకర్యంగా ఉండేందుకు
ఫోన్ రంగుకు సరిపోయే చార్జర్ అవసరం లేదు. నలుపు లేదా తెలుపు చార్జర్ ఏ ఫోన్‌కైనా సరిపోతుంది. ఒకవేళ చార్జర్ పాడైతే కొత్తది కొనడం సులభంగా ఉంటుంది. రంగు మ్యాచ్ అవుతుందా అనే టెన్షన్ ఉండదు. మొత్తం మీద నలుపు, తెలుపు చార్జర్లు యాదృచ్ఛికం కాదు. వేడి నియంత్రణ, తక్కువ ఖర్చు, భద్రత, వేగవంతమైన అనుమతులు, వినియోగదారుల సౌకర్యం వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం. అందుకే మీ ఫోన్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నా, దాని చార్జర్ మాత్రం సింపుల్‌గా ఉంటుంది.