iPhone 18 Pro vs iPhone 17 Pro : ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 17 ప్రో మధ్య 7 కీలక మార్పులు చేసింది ఆపిల్ కంపెనీ. A20 చిప్, వేరియబుల్ అపెర్చర్ కెమెరా, పవర్ ఫుల్ బ్యాటరీ సహా పూర్తి స్పెక్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
కొత్త ఐఫోన్ కొనాలా వద్దా? ఐఫోన్ 18 ప్రో వర్సెస్ 17 ప్రో ఫుల్ డీటైల్స్
ఆపిల్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 18 ప్రో పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో వచ్చిన ఐఫోన్ 17 ప్రో కంటే ఈ కొత్త వర్షన్‌లో అనేక పవర్ ఫుల్ అప్‌గ్రేడ్స్ ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మార్పులపై ఆపిల్ సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవుతున్న రిపోర్టుల ఆధారంగా ఐఫోన్ 17 ప్రోతో పోలిస్తే ఐఫోన్ 18 ప్రోలో రాబోయే అతిపెద్ద అప్‌గ్రేడ్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
26
పవర్ ఫుల్ A20 చిప్‌సెట్
ఐఫోన్ 18 ప్రోలో అత్యంత వేగవంతమైన A20 చిప్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. రిపోర్టుల ప్రకారం ఈ చిప్‌ను TSMC కంపెనీకి చెందిన 2nm ప్రాసెస్ ఆధారంగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఐఫోన్ 17 ప్రోలో A19 జనరేషన్ ప్రాసెసర్‌ను వాడారు. ఈ కొత్త 2nm చిప్ వల్ల ప్రాసెసింగ్ స్పీడ్ పెరగడమే కాకుండా, విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల గేమింగ్, ఆన్-డివైజ్ AI ఫీచర్లు, బ్యాటరీ లైఫ్ చాలా మెరుగ్గా పనిచేస్తాయి.
36
పెరగనున్న బ్యాటరీ కెపాసిటీ
యూఎస్ వేరియంట్ లీక్స్ ప్రకారం ఐఫోన్ 18 ప్రోలో 4,288mAh బ్యాటరీని ఇచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 17 ప్రోలో ఉన్న 4,252mAh బ్యాటరీతో పోలిస్తే ఇది కొద్దిగా మాత్రమే ఎక్కువ. అయితే బ్యాటరీ పరిమాణం స్వల్పంగా పెరిగినప్పటికీ, A20 చిప్ ఇచ్చే ఎఫిషియన్సీ వల్ల రోజువారీ వాడకంలో బ్యాటరీ లైఫ్ ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సమయం వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఈసారి కెమెరా విభాగంలో ఆపిల్ ఒక పెద్ద ప్రయోగం చేయబోతోంది. ఐఫోన్ 18 ప్రో మెయిన్ కెమెరాలో వేరియబుల్ అపెర్చర్ లెన్స్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. పాత మోడళ్లలో ఫిక్స్డ్ అపెర్చర్ ఉండేది. కానీ ఈ వేరియబుల్ అపెర్చర్ వల్ల వెలుతురును కంట్రోల్ చేయడం, ఎక్స్‌పోజర్, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ (పోర్ట్రెయిట్) సరిగ్గా సెట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. తక్కువ వెలుతురు ఉన్న చోట కూడా మైండ్ బ్లోయింగ్ ఫోటోలు తీయవచ్చు.
మెరుగైన టెలిఫోటో కెమెరా
లైటింగ్ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా మంచి క్వాలిటీ ఫోటోలు తీసేందుకు వీలుగా ఆపిల్ కొత్త టెలిఫోటో కెమెరాను టెస్ట్ చేస్తోంది. ఇందులో వైడర్ అపెర్చర్ ఉండనుంది. ఇది గనుక అందుబాటులోకి వస్తే.. ఐఫోన్ 18 ప్రో ద్వారా ఇండోర్ లేదా నైట్ టైమ్‌లో నాయిస్ లేని బ్రైట్ జూమ్ షాట్స్ సులభంగా తీసుకోవచ్చు.
56
కొత్త త్రీ లేయర్ స్టాక్డ్ ఇమేజ్ సెన్సార్
ఐఫోన్ 18 ప్రో మోడల్‌లో త్రీ లేయర్ స్టాక్డ్ ఇమేజ్ సెన్సార్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ అత్యాధునిక టెక్నాలజీ వల్ల కెమెరా రెస్పాన్స్ స్పీడ్ పెరుగుతుంది. ఫోటోలలో డైనమిక్ రేంజ్ చాలా బాగుండటంతో పాటు నాయిస్ చాలా వరకు తగ్గుతుంది. అయితే ఈ ఫీచర్ ప్రో మోడల్స్ రెండింటిలోనూ ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
చిన్నదిగా కానున్న డైనమిక్ ఐలాండ్
డిస్ప్లే పరిమాణం విషయానికి వస్తే ఇది ఐఫోన్ 17 ప్రో లాగానే 6.3 అంగుళాలుగానే ఉండే అవకాశం ఉంది. కాకపోతే స్క్రీన్ పైభాగంలో ఉండే డైనమిక్ ఐలాండ్ సైజ్ తగ్గే అవకాశం ఉంది. పాత డిజైన్‌తో పోలిస్తే ఇది మరింత సన్నగా మారుతుందని సమాచారం. దీంతో పాటు కొత్త LTPO+ డిస్ప్లే టెక్నాలజీ వల్ల స్క్రీన్ పవర్ కన్జంప్షన్ మరింత తగ్గుతుంది.
66
కొత్త C2 మోడెమ్ డిజైన్ మార్పులు
ఆపిల్ సొంతంగా తయారు చేసిన కొత్త C2 మోడెమ్ ఐఫోన్ 18 ప్రోలో వచ్చే అవకాశం ఉంది. ఇది పాత C1, C1X చిప్స్ కంటే వేగవంతమైన 5G పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలాగే డివైజ్‌కు శాటిలైట్ కనెక్టివిటీ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. బ్యాటరీ, కూలింగ్ సిస్టమ్ చేంజెస్ వల్ల ఈ ఫోన్ కొద్దిగా బరువు, మందం పెరిగే అవకాశం ఉంది. వెనుక వైపు గ్లాస్ ఫినిషింగ్, డార్క్ చెర్రీ కలర్ ఆప్షన్ కొత్తగా రాబోతున్నాయి.
మొత్తానికి ఐఫోన్ 17 ప్రో ఉపయోగిస్తున్న యూజర్లు కెమెరా ఫ్లెక్సిబిలిటీ, మెరుగైన బ్యాటరీ లైఫ్, కొత్త ప్రాసెసర్ కోసం ఐఫోన్ 18 ప్రోకి అప్‌గ్రేడ్ అవ్వడం మంచి ఛాయిస్ కావచ్చు. అయితే డిజైన్ పరంగా పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు కాబట్టి, ఆపిల్ అధికారికంగా వెల్లడించే స్పెసిఫికేషన్లు, ధరల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.