దీపావళి సేల్‌: బంపర్ ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్‌పై 44% తగ్గింపు

Published : Oct 12, 2025, 04:27 PM IST

Samsung Galaxy S24 Ultra 5G: అమెజాన్ దీపావళి సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్‌పై 44% తగ్గింపును అందిస్తోంది. 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ సహా సూపర్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

PREV
15
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా పై బిగ్ డిస్కౌంట్

Samsung Galaxy S24 Ultra 5G: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి సేల్ లో బిగ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా శాంసంగ్ స్మార్ట్ ఫోన్ లవర్స్ కు బిగ్ న్యూస్. ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఈ సేల్ లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. 

ఈ ఫోన్‌పై కంపెనీ 44% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. గత సంవత్సరం రూ.1,34,999 ధరకు లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.75,749కు కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపుతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకు శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్‌ లభిస్తోంది.

25
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్‌ పై బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ సౌకర్యం

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్‌ కొనుగోలుదారులకు అమెజాన్ వివిధ బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ ఆప్షన్‌లో ₹1000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.  IDFC ఫస్ట్ బ్యాంక్, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కూడా ఈఎంఐ ద్వారా ₹1000 తగ్గింపు పొందవచ్చు. అలాగే, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లతో ఫోన్‌ను మరింత తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం వినియోగదారులకు లభిస్తోంది.

35
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్‌ ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్‌ అత్యాధునిక స్పెసిఫికేషన్లతో మార్కెట్ లోకి వచ్చింది.

  • డిస్ప్లే: 6.8 ఇంచుల LTPO AMOLED 2X, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్.
  • ప్రాసెసర్: క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్.
  • కెమెరా: 200MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ (3X జూమ్), 12MP అల్ట్రా వైడ్ లెన్స్, 10MP సెకండరీ లెన్స్.
  • ఫ్రంట్ కెమెరా: 12MP సెల్ఫీ కెమెరా.
  • బ్యాటరీ: 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.
  • స్టోరేజ్ ఆప్షన్లు: 256GB నుండి 1TB వరకు.
  • OS: ఆండ్రాయిడ్ 15 ఆధారిత OneUI 6.
45
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G పై ఫ్లిప్‌కార్ట్‌లో కూడా భారీ తగ్గింపు

ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో కూడా శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్‌ ఆఫర్లు ఉన్నాయి. ప్రారంభ ధర రూ.1,29,999 కాగా, ప్రస్తుత ధర రూ.78,899కు లభిస్తోంది. అదనంగా 5% ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ ద్వారా రూ.4,000 వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ.74,899కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ దీపావళి వరకు కొనసాగనుంది.

55
ప్రీమియమ్ ఫోన్‌ కోసం చూస్తే.. ఇది ఒక సూపర్ డీల్

ప్రీమియమ్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది ఒక సూపర్ డీల్ అని చెప్పవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ప్రీమియమ్ లుక్, శక్తివంతమైన పనితీరు, అద్భుత కెమెరా క్వాలిటీతో ప్రత్యేకతను సాధించింది. ఫోన్‌లో S-Pen సపోర్ట్ కూడా ఉంది, ఇది ప్రొఫెషనల్ యూజర్లకు అదనపు బోనస్‌గా పనిచేస్తుంది. డిస్‌ప్లే 3120 x 1440 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో డైనమిక్ AMOLED ప్యానెల్ కలిగి ఉంది. ఫోన్ వైర్డ్, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories