Lamine Yamal Net Worth: 2026 వరల్డ్ కప్ గెలిచిన స్పెయిన్ స్టార్ లామిన్ యామల్ పేరు మార్మోగిపోతోంది. ఆటలోనే కాదు సంపాదన లోనూ దుమ్మురేపుతున్నాడు. బార్సిలోనా భారీ కాంట్రాక్ట్ నుంచి బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల వరకు.. లామిన్ యామల్ నెట్ వర్త్ ఎంతో తెలుసా?
వరల్డ్ కప్ విన్నర్ లామిన్ యామల్.. 19 ఏళ్లకే వందల కోట్ల నెట్ వర్త్
ఫుట్‌బాల్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది. అతడే స్పెయిన్ టీనేజ్ వండర్ కిడ్ లామిన్ యామల్. జస్ట్ 19 ఏళ్ల వయసులోనే ఈ కుర్రాడు ఫుట్‌బాల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టార్స్‌లో ఒకడిగా ఎదిగిపోయాడు. అర్జెంటీనాతో జరిగిన 2026 వరల్డ్ కప్ ఫైనల్‌లో స్పెయిన్ గెలవడంతో యామల్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా 20 ఏళ్లు కూడా నిండకుండానే అటు యూరో కప్, ఇటు వరల్డ్ కప్ కొట్టేసిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ హిస్టారిక్ విక్టరీ తర్వాత యామల్ నెట్ వర్త్, బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వండర్ కిడ్ ఆస్తులు, శాలరీ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది.
26
లామిన్ యామల్ నెట్ వర్త్ ఎంతో తెలుసా?
పలు స్పోర్ట్స్ రిపోర్టుల ప్రకారం, 2026 మిడ్ నాటికి లామిన్ యామల్ నెట్ వర్త్ సుమారు $8 మిలియన్ల నుండి $15 మిలియన్ల (రూ. 66 కోట్ల నుండి రూ. 125 కోట్లు) మధ్యలో ఉంది. అయితే వరల్డ్ కప్ విన్ తర్వాత బ్లీప్ ఫైనాన్స్ అంచనా ప్రకారం, అతని నెట్ వర్త్ త్వరలోనే ఏకంగా €60 మిలియన్లకు (సుమారు రూ. 659 కోట్లు) చేరబోతోంది. వరల్డ్ కప్ గెలవడంతో స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఇచ్చే భారీ ప్రైజ్ మనీతో పాటు, బార్సిలోనా క్లబ్ నుంచి వచ్చే బోనస్‌లు కూడా తోడవ్వడంతో యామల్ బ్యాంక్ బ్యాలెన్స్ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది.
36
బార్సిలోనా మైండ్ బ్లాకింగ్ శాలరీ ప్యాకేజీ
లామిన్ యామల్ టాలెంట్ చూసి ఎఫ్‌సి బార్సిలోనా క్లబ్ అతనికి కళ్ళు చెదిరే కాంట్రాక్ట్ ఆఫర్ చేసింది. మే 2025లో కుదిరిన 6 ఏళ్ల కొత్త ఒప్పందం ప్రకారం.. 2031 జూన్ వరకు యామల్ బార్సిలోనాలోనే ఆడనున్నాడు. దీనికోసం అతనికి ఏడాదికి $18 మిలియన్ల (రూ. 173 కోట్లు) నుండి $21.5 మిలియన్ల (రూ. 207 కోట్లు) బేస్ శాలరీ ఇస్తున్నారు. అంటే టాక్స్‌లు పడకముందు వారానికి దాదాపు $350,000 నుండి $400,000 (రూ. 3.85 కోట్లు) సంపాదిస్తున్నాడన్నమాట. ఒకవేళ గోల్స్, మ్యాచ్ విన్స్ బోనస్‌లు కూడా కలుపుకుంటే, అతని వార్షిక సంపాదన $33 మిలియన్లకు (రూ. 317 కోట్లు) చేరుతుంది. ఇంతటి క్రేజీ ప్లేయర్‌ను వేరే క్లబ్స్ ఎవరూ ఎగరేసుకుపోకుండా ఉండేందుకు బార్సిలోనా ఏకంగా $1.1 బిలియన్ల (రూ. 10,591 కోట్లు) రిలీజ్ క్లాజ్ పెట్టింది.
గ్రౌండ్ లోనే కాదు, బయట కూడా యామల్ బ్రాండ్ వాల్యూ సూపర్ గా పెరిగింది. ఎండార్స్‌మెంట్ల ద్వారానే ఏడాదికి $10 మిలియన్లు (రూ. 96 కోట్లు) సంపాదిస్తున్నాడు. 2024లో స్పోర్ట్స్ జెయింట్ అడిడాస్ సంస్థతో 10 ఏళ్ల పాటు భారీ డీల్ కుదుర్చుకున్నాడు, దీని వాల్యూ ఏకంగా $34 మిలియన్లు (రూ. 327 కోట్లు). ఇవే కాకుండా బీట్స్ బై డ్రే, ఒప్పో, కొనామి, పవరేడ్, అమెరికన్ ఈగిల్, యూనిసెఫ్ వంటి టాప్ గ్లోబల్ బ్రాండ్స్‌కు యామల్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఫోర్బ్స్ హయ్యెస్ట్ పెయిడ్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ లిస్ట్‌లో యామల్ టాప్ 10 లో నిలిచాడంటే అతని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
56
ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనాకు చుక్కలు
2026 వరల్డ్ కప్ ఫైనల్‌లో అర్జెంటీనాపై యామల్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఫుల్ 120 నిమిషాల పాటు గ్రౌండ్‌లో ఉండి అర్జెంటీనా డిఫెన్స్‌ను వణికించాడు. 4 సార్లు గోల్ కోసం షాట్స్ కొట్టగా, అర్జెంటీనా కీపర్ ఎమి మార్టినెజ్ రెండు సార్లు కష్టమ్మీద కాపాడాడు. మ్యాచ్ చివర్లో యామల్ వేసిన ఫ్రీ-కిక్ గోల్ కావాల్సింది, కానీ మార్టినెజ్ సూపర్ డైవ్‌తో దాన్ని అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్‌లో యామల్ పాసింగ్ అక్యురసీ 88 శాతంగా నమోదైంది.
66
పేదరికం నుండి కోటీశ్వరుడిగా..
ఈ రోజు వందల కోట్లకు అధిపతి అయినప్పటికీ, యామల్ చిన్నతనం చాలా పేదరికంలో గడిచింది. అతని తండ్రి మౌనీర్ నస్రాయ్ మొరాకోకు చెందిన బిల్డింగ్ పెయింటర్, తల్లి షీలా ఎబన్ గినియాకు చెందిన వెయిట్రెస్. యామల్ 3 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. వాళ్ల నానమ్మ ఫాతిమా మొరాకో నుండి బస్సులో వచ్చి, మూడు షిఫ్ట్‌లు కష్టపడి పని చేసి ఈ కుటుంబాన్ని పోషించింది.
"ఒకప్పుడు మేము ఉన్న అపార్ట్‌మెంట్‌లో కిచెన్, బెడ్‌రూమ్ ఒకే చోట ఉండేవి. నేను ఫుట్‌బాలర్ అయ్యాక మా అమ్మ సంతోషంగా ఉంది, నా తమ్ముడు కీనె కి మంచి లైఫ్ దొరికింది, అదే నాకు హ్యాపీ" అని యామల్ ఎమోషనల్ అయ్యాడు. 15 ఏళ్ల 9 నెలల వయసులోనే బార్సిలోనా తరపున ఆడి హిస్టరీ క్రియేట్ చేసిన యామల్, బ్యాలన్ డి ఓర్ అవార్డుకు నామినేట్ అయిన యంగెస్ట్ ప్లేయర్ కూడా కావడం విశేషం.