FIFA World Cup 2026 Awards List: రోడ్రికి గోల్డెన్ బాల్.. ఎంబాప్పేకు గోల్డెన్ బూట్.. ఫిఫా వరల్డ్ కప్ 2026 అవార్డుల విన్నర్స్ వీరే

Published : Jul 20, 2026, 11:38 AM IST

FIFA World Cup 2026 Awards List: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరులో అర్జెంటీనాకు షాకిస్తూ స్పెయిన్ ఛాంపియన్ గా నిలిచింది. రోడ్రి, ఎంబాపె, ఉనై సిమోన్, క్యుబార్సి గెలుచుకున్న గోల్డెన్ బాల్, బూట్, గ్లోవ్ అవార్డుల పూర్తి లిస్ట్ మీకోసం.

PREV
15
ఫుట్‌బాల్ హిస్టరీలో స్పెయిన్ సంచలనం.. ఫిఫా వరల్డ్ కప్ రికార్డులు బద్దలు

ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ క్లైమాక్స్‌కు చేరింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మెగా టోర్నమెంట్ ముగిసిన తర్వాత, ప్లేయర్ల ప్రతిభను గుర్తిస్తూ ఫిఫా ప్రత్యేక అవార్డులను ప్రకటించింది. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో అర్జెంటీనాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 1-0 తేడాతో ఎక్స్‌ట్రా టైమ్‌లో ఘన విజయం సాధించింది. దీనితో స్పెయిన్ రెండోసారి వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో అదరగొట్టిన స్పెయిన్ స్టార్స్ అవార్డులను క్లీన్ స్వీప్ చేశారు. రోడ్రి, పావు క్యుబార్సి, ఉనై సిమోన్‌లతో పాటు ఫ్రాన్స్ స్టార్ ఎంబాప్పే కూడా ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు.

25
గోల్డెన్ బాల్ గెలిచిన రోడ్రి

స్పెయిన్ మిడ్‌ఫీల్డర్, కెప్టెన్ రోడ్రి ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. లా రోజా తరఫున ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ మిడ్‌ఫీల్డ్‌ను ఆయనే నడిపించాడు. డిఫెన్స్‌కు అండగా ఉంటూ, జట్టును విజయపథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. స్పెయిన్ డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందంటే, ఈ టోర్నీ మొత్తంలో వారు కేవలం ఒకే ఒక్క గోల్ ఇచ్చారు. దీనికి రోడ్రి ఆడిన ఆటతీరే ప్రధాన కారణం.

అందుకే రోడ్రిని టోర్నమెంట్ బెస్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేస్తూ అడిడాస్ గోల్డెన్ బాల్ అవార్డును ఇచ్చారు. న్యూజెర్సీ లో ఈ అవార్డును ఆయన అందుకున్నాడు. అలాగే అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సి 'సిల్వర్ బాల్' గెలుచుకోగా, ఫ్రాన్స్ ప్లేయర్ ఎంబాప్పే బ్రాంజ్ బాల్ సొంతం చేసుకున్నాడు.

35
టాప్ స్కోరర్‌గా ఎంబాప్పే

ఫ్రాన్స్ సూపర్ స్టార్ ఎంబాప్పే మరోసారి తనేంటో నిరూపించుకున్నాడు. ఫ్రాన్స్ జట్టు వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరలేకపోయినప్పటికీ, ఎంబాప్పే మాత్రం రికార్డులు సృష్టించాడు. కేవలం ఎనిమిది మ్యాచ్‌ల్లోనే ఏకంగా 10 గోల్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు టోర్నీలో నాలుగు అసిస్ట్‌లు కూడా చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 6-4తో ఓడిపోయినప్పటికీ, ఆ మ్యాచ్‌లో ఎంబాప్పే రెండు గోల్స్ కొట్టాడు.

దీనితో టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచి 'అడిడాస్ గోల్డెన్ బూట్' అవార్డును వరుసగా రెండోసారి సొంతం చేసుకున్నాడు. కాగా, ఎనిమిది గోల్స్ చేసిన లియోనెల్ మెస్సి సిల్వర్ బూట్ అందుకోగా, ఏడు గోల్స్‌తో ఇంగ్లండ్ ప్లేయర్ జూడ్ బెల్లింగ్‌హామ్ బ్రాంజ్ బూట్ దక్కించుకున్నాడు.

45
రికార్డులు సృష్టించిన ఉనై సిమోన్

స్పెయిన్ గోల్‌కీపర్ ఉనై సిమోన్ ఈ టోర్నమెంట్‌లో గోడలా నిలిచాడు. స్పెయిన్ డిఫెన్స్‌కు వెన్నెముకలా నిలిచిన 29 ఏళ్ల సిమోన్, ఎనిమిది మ్యాచ్‌లలో ఏకంగా ఏడు క్లీన్ షీట్లు నమోదు చేసి 'అడిడాస్ గోల్డెన్ గ్లోవ్' అవార్డును గెలుచుకున్నాడు. అర్జెంటీనాతో జరిగిన ఫైనల్లో ఎక్స్‌ట్రా టైమ్‌లో కూడా ఒక్క గోల్ కాకుండా అడ్డుకున్నాడు.

ఈ టోర్నీలో బెల్జియం మ్యాచ్‌లో మాత్రమే అతను ఒక గోల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సిమోన్ ఒక సరికొత్త వరల్డ్ కప్ రికార్డు క్రియేట్ చేశాడు. వరల్డ్ కప్‌లో వరుసగా 650 నిమిషాల పాటు ఒక్క గోల్ కూడా కాకుండా అడ్డుకుని ఈ ఘనత సాధించాడు.

55
బెస్ట్ యంగ్ ప్లేయర్ క్యుబార్సి, ఫెయిర్ ప్లే అవార్డు

స్పెయిన్ యువ డిఫెండర్ పావు క్యుబార్సి తన కెరీర్‌ను అదిరిపోయే రేంజ్‌లో స్టార్ట్ చేశాడు. కేవలం 19 ఏళ్ల వయసులోనే స్పెయిన్ డిఫెన్స్‌లో కీలక పాత్ర పోషించి ఫిఫా బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును అరామ్‌కో ప్రెజెంట్ చేసింది. జనవరి 1, 2005 లేదా ఆ తర్వాత పుట్టిన బెస్ట్ యంగ్ ప్లేయర్‌కు ఈ అవార్డు ఇస్తారు.

గతంలో ఈ అవార్డును ఎంబాప్పే, థామస్ ముల్లర్, ఎంజో ఫెర్నాండెజ్ లాంటి స్టార్లు గెలిచారు. ఇక టోర్నమెంట్‌లో క్రమశిక్షణగా ఆడినందుకు నెదర్లాండ్స్ జట్టుకు 'ఫిఫా ఫెయిర్ ప్లే ట్రోఫీ' లభించింది. మెక్‌డొనాల్డ్స్ ఈ అవార్డును అందించింది. గ్రూప్-ఎఫ్ లో టాప్‌లో నిలిచిన నెదర్లాండ్స్, రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో మొరాకోతో 1-1తో డ్రా చేసుకుని, పెనాల్టీ షూటౌట్‌లో 3-2తో ఓడిపోయి టోర్నీ నుంచి త్వరగానే నిష్క్రమించింది.

Read more Photos on
click me!

Recommended Stories