Golden Boot: వరుసగా రెండోసారి గోల్డెన్ బూట్ గెలిచిన ఎంబాప్పే.. ఇప్పటివరకు ఫిఫా గోల్డెన్ బూట్ గెలిచింది వీరే

Published : Jul 20, 2026, 07:51 AM IST

Golden boot Winner: ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఎంబాప్పే 10 గోల్స్‌తో వరుసగా రెండోసారి గోల్డెన్ బూట్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేశాడు. మెస్సీ అతని తర్వాతి స్థానంలో నిలిచాడు. అయితే, ఇప్పటివరకు గోల్డెన్ బూట్ గెలిచిన ప్లేయర్ల పూర్తి లిస్ట్ ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
వరుసగా రెండు సార్లు గోల్డెన్ బూట్.. వరల్డ్ కప్‌లో నయా హిస్టరీ క్రియేట్ చేసిన ఎంబాప్పే

ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాప్పే సరికొత్త రికార్డుతో దుమ్ములేపాడు. వరల్డ్ కప్ హిస్టరీలోనే వరుసగా రెండుసార్లు గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్న ఫస్ట్ ప్లేయర్‌గా ఎంబాప్పే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ 2026 టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి అతను ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.

మెస్సీతో జరిగిన గట్టి పోటీలో ఎంబాప్పే పైచేయి సాధించాడు. ఈ టోర్నీలో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన ఎంబాప్పే ఏకంగా 10 గోల్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2022 ఖతార్ వరల్డ్ కప్‌లో కూడా 8 గోల్స్ చేసి ఎంబాప్పే గోల్డెన్ బూట్ విన్నర్‌గా నిలిచాడు. ఇప్పుడు మళ్లీ అదే సీన్‌ రిపీట్ చేసి బ్యాక్ టు బ్యాక్ గోల్డెన్ బూట్స్ తన అకౌంట్‌లో వేసుకున్నాడు.

25
రికార్డుల వేటలో కింగ్

ప్రస్తుతం 27 ఏళ్ల వయసున్న ఎంబాప్పే ఒకే వరల్డ్ కప్‌లో రెండంకెల స్కోరు (10 గోల్స్) సాధించిన రేర్ ఫీట్ అందుకున్నాడు. 1970లో వెస్ట్ జర్మనీకి చెందిన గెర్డ్ ముల్లర్ తర్వాత ఒకే టోర్నీలో 10 గోల్స్ చేసిన ప్లేయర్ ఎంబాప్పే మాత్రమే కావడం విశేషం.

వరల్డ్ కప్ హిస్టరీ చూస్తే 1958లో ఫ్రాన్స్‌కు చెందిన జస్ట్ ఫోంటైన్ 13 గోల్స్, 1954లో హంగేరీకి చెందిన సాండర్ కోసిస్ 11 గోల్స్ చేశారు. వారి తర్వాత ఒకే టోర్నీలో ఎక్కువ గోల్స్ చేసింది ఎంబాప్పే మాత్రమే. అంతేకాదు మెన్స్ వరల్డ్ కప్ హిస్టరీలోనే ఆల్ టైమ్ టాప్ స్కోరర్‌గా ఎంబాప్పే నిలిచాడు. అతను మొత్తం 22 గోల్స్‌తో మెస్సీ (21 గోల్స్) కంటే ఒక గోల్ ముందున్నాడు.

35
అవార్డులు కొట్టిన స్పెయిన్

ఈ టోర్నీలో వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ టీమ్ మిగతా అవార్డులను క్లీన్ స్వీప్ చేసింది. స్పెయిన్ కెప్టెన్ రోడ్రీ అద్భుతమైన ఆటతీరుతో టోర్నమెంట్‌లోనే బెస్ట్ ప్లేయర్‌గా నిలిచి ‘గోల్డెన్ బాల్’ అవార్డును దక్కించుకున్నాడు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఎంబాప్పే రెండు గోల్స్ చేసి మెస్సీ కంటే ముందంజలోకి వెళ్లాడు.

అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఫ్రాన్స్ 6-4 తేడాతో ఓడిపోయి నాల్గో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మియామీలో ఎంబాప్పే మాట్లాడారు. వరల్డ్ కప్‌లో ఇన్ని గోల్స్ చేయడం కెరీర్‌కు ప్లస్ అవుతుందని, కానీ టాప్ స్కోరర్ అవార్డు కంటే ఫైనల్ ఆడి ఉంటే బాగుండేదని తన మనసులోని మాటను బయటపెట్టాడు.

45
గోల్స్ వరద పారించిన స్టార్స్

ఈ టోర్నీలో గ్రూప్ స్టేజ్‌లో సెనెగల్, ఇరాక్‌లపై ఎంబాప్పే రెండేసి గోల్స్ చేశాడు. అలాగే లాస్ట్ 32 మ్యాచ్‌లో స్వీడన్‌పై గోల్ కొట్టాడు. ఆ తర్వాత పరాగ్వేతో జరిగిన లాస్ట్ 16 మ్యాచ్‌లో 70వ నిమిషంలో పెనాల్టీ ద్వారా విన్నింగ్ గోల్ చేశాడు. క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై కూడా గోల్ సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్ కొట్టి ఉంటే ఎంబాప్పేను దాటేసేవాడు.

కానీ న్యూజెర్సీలో జరిగిన ఫైనల్లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా 1-0తో ఓడిపోయింది. 39 ఏళ్ల మెస్సీ ఈ మ్యాచ్‌లో గోల్ చేయలేకపోయాడు. దీంతో అతను 8 మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌తో టోర్నీని ముగించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన జూడ్ బెల్లింగ్‌హామ్, నార్వేకు చెందిన ఎర్లింగ్ హాలాండ్ చెరో 7 గోల్స్ చేయగా, ఫ్రాన్స్ ప్లేయర్ ఉస్మాన్ డెంబెలే, ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ 6 గోల్స్ చేశారు.

55
ఫిఫా వరల్డ్ కప్‌ విజేతల పూర్తి జాబితా

ఫిఫా వరల్డ్ కప్‌లో ప్రతి ఎడిషన్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన ప్లేయర్‌కు ఈ గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. 1982లో స్పెయిన్ లో జరిగిన వరల్డ్ కప్ నుండి ఈ అవార్డును అధికారికంగా ఇస్తున్నారు. అయితే గోల్డెన్ బూట్ గెలిచినంత మాత్రాన ఆ టీమ్ వరల్డ్ కప్ గెలుస్తుందనే గ్యారెంటీ లేదు. గత ఆరు టోర్నీల్లో కేవలం రొనాల్డో మాత్రమే గోల్డెన్ బూట్ గెలిచి, తన టీమ్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఒకవేళ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్లేయర్స్ సమానంగా గోల్స్ చేస్తే, ఎక్కువ అసిస్ట్‌లు చేసిన వారికి అవార్డు ఇస్తారు. అది కూడా సేమ్ ఉంటే తక్కువ నిమిషాలు ఆడిన ప్లేయర్‌కు అవార్డు దక్కుతుంది.

1982 నుండి గోల్డెన్ బూట్ విజేతల లిస్ట్

• 1982 (స్పెయిన్): పాలో రోస్సి (ఇటలీ) – 6 గోల్స్

• 1986 (మెక్సికో): గ్యారీ లినేకర్ (ఇంగ్లాండ్) – 6 గోల్స్

• 1990 (ఇటలీ): సాల్వటోర్ షిలాచి (ఇటలీ) – 6 గోల్స్

• 1994 (యూఎస్ఏ): హ్రిస్టో స్టోయిచ్కోవ్ (బల్గేరియా), ఒలేగ్ సాలెంకో (రష్యా) – 6 గోల్స్

• 1998 (ఫ్రాన్స్): డావోర్ సుకర్ (క్రొయేషియా) – 6 గోల్స్

• 2002 (సౌత్ కొరియా/జపాన్): రొనాల్డో (బ్రెజిల్) – 8 గోల్స్

• 2006 (జర్మనీ): మిరోస్లావ్ క్లోజ్ (జర్మనీ) – 5 గోల్స్

• 2010 (సౌతాఫ్రికా): థామస్ ముల్లర్ (జర్మనీ) – 5 గోల్స్

• 2014 (బ్రెజిల్): జేమ్స్ రోడ్రిగ్జ్ (కొలంబియా) – 6 గోల్స్

• 2018 (రష్యా): హ్యారీ కేన్ (ఇంగ్లాండ్) – 6 గోల్స్

• 2022 (ఖతార్): కిలియన్ ఎంబాప్పే (ఫ్రాన్స్) – 8 గోల్స్

• 2026 (కెనడా, మెక్సికో, యూఎస్ఏ): కిలియన్ ఎంబాప్పే (ఫ్రాన్స్) – 10 గోల్స్

వరల్డ్ కప్ హిస్టరీలో 1958లో జస్ట్ ఫోంటైన్ చేసిన 13 గోల్స్ రికార్డును ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేదు. 1982లో అవార్డు స్టార్ట్ అయిన తర్వాత 2002లో బ్రెజిల్ రొనాల్డో, 2022లో ఎంబాప్పే చేసిన 8 గోల్స్ హైయెస్ట్ రికార్డ్‌గా ఉండేది. కానీ ఇప్పుడు 2026లో ఎంబాప్పే 10 గోల్స్ చేసి ఆ రికార్డును కూడా దాటేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories