Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !

Published : Aug 31, 2026, 10:32 PM IST

Lionel Messi Net Worth: అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్, కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. మెస్సీ నెట్ వర్త్ ఎంతో తెలుసా? ఆయన జీతం, ఎండోర్స్‌మెంట్లు, ఆస్తుల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
బిలియనీర్ క్లబ్‌లో మెస్సీ

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వేళ, ఆయన మైదానంలో సాధించిన విజయాలతో పాటు ఆయన ఆర్థిక సామ్రాజ్యం కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఫోర్బ్స్, సెలబ్రిటీ నెట్ వర్త్ రిపోర్టుల ప్రకారం, 39 ఏళ్ల మెస్సీ మొత్తం నెట్ వర్త్ సుమారు 1.1 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.8,380 కోట్లు. 20 ఏళ్లకు పైగా కెరీర్‌లో మైదానంలో గోల్స్ కొట్టడమే కాదు, మైదానం బయట కూడా బిలియనీర్ అథ్లెట్ల జాబితాలో చేరి ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా నిలిచారు.

25
ఏడాదికి రూ.1,065 కోట్ల భారీ సంపాదన

మెస్సీ ఆర్జించే వార్షిక ఆదాయం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆయన ప్రతి సంవత్సరం సుమారు 140 మిలియన్ డాలర్లు (రూ.1,065 కోట్లకు పైగా) సంపాదిస్తున్నట్లు సమాచారం. అందులో ఆన్-ఫీల్డ్ జీతం ద్వారా రూ.530 కోట్లు, ఎండోర్స్‌మెంట్లు, కమర్షియల్ డీల్స్ ద్వారా మరో రూ.530 కోట్లు వస్తున్నాయి. తన కెరీర్ మొత్తంలో కేవలం జీతాలు, బోనస్‌ల రూపంలోనే ఆయన 700 మిలియన్ డాలర్లు (రూ.5,330 కోట్లకు పైగా) సంపాదించారు. పన్నులు మినహాయించక ముందు ఆయన మొత్తం కెరీర్ ఆన్, ఆఫ్-ఫీల్డ్ సంపాదన 1.8 బిలియన్ డాలర్లు (రూ.13,700 కోట్లు) దాటింది.

35
బార్సిలోనా జీతం నుంచి ఇంటర్ మియామి స్పెషల్ డీల్ వరకు

మెస్సీ ఆర్థిక పునాది అంతా ఆయన బార్సిలోనా క్లబ్‌లో ఆడిన కాలంలోనే పడింది. 2017లో బార్సిలోనాతో చేసుకున్న కాంట్రాక్ట్ ద్వారా బోనస్‌లతో కలిపి ఏడాదికి దాదాపు రూ.1,520 కోట్ల వరకు సంపాదించాడు. ఆ తర్వాత పారిస్ సెయింట్-జెర్మైన్ లో ఏడాదికి పన్నులకు ముందు రూ.570 కోట్లు అందుకున్నారు.

2023లో అమెరికాలోని 'ఇంటర్ మియామి' క్లబ్‌కు మారినప్పుడు, సౌదీ అరేబియా నుంచి భారీ ఆఫర్ వచ్చినా మియామినే ఎంచుకున్నారు. ఇక్కడ ఆయన బేస్ సాలరీ రూ.410 కోట్ల నుండి రూ.450 కోట్ల వరకు ఉండగా, మొత్తం ప్యాకేజీ రూ.530 కోట్ల నుండి రూ.600 కోట్లకు చేరుతుంది. అంతేకాకుండా యాపిల్ టీవీ సబ్‌స్క్రిప్షన్ రాబడిలో వాటా, రిటైర్మెంట్ తర్వాత ఇంటర్ మియామి క్లబ్‌లో ఈక్విటీ స్టాక్ కొనుగోలు చేసే హక్కును కూడా ఈ డీల్‌లో భాగం చేసుకున్నారు.

45
అడిడాస్ కాంట్రాక్ట్, బిజినెస్ వెంచర్లు

మైదానం బయట మెస్సీ బ్రాండ్ వాల్యూ చాలా పెద్దది. 2006 నుండి అడిడాస్ బ్రాండ్‌తో ఉన్న ఆయన, ఆ సంస్థతో లైఫ్‌టైమ్ ఒప్పందం చేసుకున్నారు. స్పాన్సర్‌షిప్‌ల ద్వారానే ఆయనకు ఏటా రూ.530 కోట్లు వస్తాయి. వీటితో పాటు పెప్సికో, మాస్టర్‌కార్డ్, లోవ్స్ వంటి ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యాలు ఉన్నాయి.

వ్యాపార రంగంలో కూడా మెస్సీ ముందంజలో ఉన్నారు. 2024లో 'Más+ by Messi' పేరుతో మార్క్ ఆంటోనీ ఇంటర్నేషనల్‌తో కలిపి స్పోర్ట్స్ డ్రింక్ బ్రాండ్‌ను లాంచ్ చేశారు. అర్జెంటీనా రెస్టారెంట్ చైన్ 'El Club de la Milanesa'లో పెట్టుబడులు పెట్టారు. అంతేకాకుండా స్పెయిన్‌కు చెందిన లోయర్ డివిజన్ క్లబ్ కోర్నెల్లా, ఉరుగ్వేకు చెందిన డిపోర్టివో LSM, రోసారియోలోని లాస్ లియోన్స్ క్లబ్‌లలో వాటాలను కొనుగోలు చేశారు.

55
రియల్ ఎస్టేట్, ఖరీదైన ఆస్తులు

మెస్సీ తన సంపదను కేవలం బ్యాంక్ ఖాతాలకే పరిమితం చేయకుండా రియల్ ఎస్టేట్‌లో భారీగా ఇన్వెస్ట్ చేశారు. స్పెయిన్, సౌత్ ఫ్లోరిడాలలో అత్యంత ఖరీదైన లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. స్పెయిన్‌లో 'MiM Hotels' పేరుతో హోటళ్లు, కమర్షియల్ ప్రాపర్టీలను కలిగి ఉన్న రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీని నడుపుతున్నారు.

చిన్నతనంలో 10 ఏళ్ల వయస్సులో గ్రోత్ హార్మోన్ లోపం వ్యాధితో బాధపడి, నెలకు 1,000 డాలర్ల (అప్పట్లో సుమారు రూ.80 వేలు) వైద్య ఖర్చుల కోసం కష్టపడిన కుటుంబం నుంచి వచ్చి, నేడు రూ.8,380 కోట్ల నెట్ వర్త్‌తో ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న ఫుట్‌బాల్ ఆటగాడిగా నిలవడం మెస్సీ సాధించిన సరికొత్త రికార్డు.

Read more Photos on
click me!

Recommended Stories