FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీస్‌లో ఫ్రాన్స్ ఓడింది. కానీ, కెప్టెన్ కైలియన్ ఎంబప్పేకి గోల్డెన్ బూట్ గెలిచేందుకు మరో మ్యాచ్ రూపంలో లక్కీ ఛాన్స్ దక్కింది. గోల్డెన్ బూట్ కోసం మెస్సీతో పోటీ పడుతున్నాడు.
ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. మూడోసారి వరల్డ్ కప్ టైటిల్ గెలవాలనే ఆ జట్టు కల చెదిరిపోయింది. మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో ఫ్రాన్స్ 2-0 తేడాతో ఓడిపోయింది. దీంతో ఫ్రాన్స్ టోర్నీ నుంచి అవుట్ అయింది. కానీ ఆ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబప్పేకి మాత్రం ఒక గుడ్ న్యూస్ ఉంది.
ఫ్రాన్స్ ఓడిపోయినా, ఎంబప్పేకి గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకునే గోల్డెన్ ఛాన్స్ ఇంకా ఉంది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ టీమ్ ఇంకొక మ్యాచ్ ఆడబోతోంది. ఆ మ్యాచ్‌లో ఎంబప్పే గనుక తన గోల్స్ సంఖ్యను పెంచుకుంటే, 2022 తర్వాత మళ్లీ 2026లో కూడా గోల్డెన్ బూట్ అవార్డును తన సొంతం చేసుకోవచ్చు.
25
సెమీస్‌లో మ్యాజిక్ మిస్.. అయినా నంబర్-1
ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 8 గోల్స్ చేసిన కైలియన్ ఎంబప్పే, స్పెయిన్‌తో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ సెమీఫైనల్ మ్యాచ్‌లో మాత్రం తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. అయినప్పటికీ, గోల్డెన్ బూట్ రేసులో అతను అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీతో కలిసి ఇంకా నంబర్-1 ప్లేస్‌లోనే ఉన్నాడు.
అయితే సెమీఫైనల్‌లో ఫ్రాన్స్ ఓడిపోయిన తర్వాత కూడా ఎంబప్పేకి గోల్స్ చేసే అవకాశం ఎలా వస్తుంది అనే డౌట్ చాలామందికి రావచ్చు. దానికి సమాధానం ఉంది. ఫ్రాన్స్ టైటిల్ రేస్ నుండి తప్పుకున్నా, వరల్డ్ కప్‌లో థర్డ్ ప్లేస్ కోసం జరిగే మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆడాల్సి ఉంటుంది.
35
బ్రాంజ్ మెడల్ ఫైట్.. జూలై 19న మ్యాచ్
27 ఏళ్ల కైలియన్ ఎంబప్పే ఇప్పటికే 2018లో ఒకసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచాడు. అలాగే 2022 వరల్డ్ కప్‌లో గోల్డెన్ బూట్ కూడా గెలుచుకున్నాడు. స్పెయిన్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్ పక్కన పెడితే, ఈ 2026 వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ కెప్టెన్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. టోర్నీలో 8 గోల్స్ చేసి మెస్సీకి గట్టి పోటీ ఇస్తున్నాడు.
ఇప్పుడు ఫ్రాన్స్ టీమ్ ఫిఫా వరల్డ్ కప్ 2026లో బ్రాంజ్ మెడల్ మ్యాచ్ అంటే మూడో స్థానం కోసం జరిగే పోరు కోసం జూలై 19న గ్రౌండ్‌లోకి దిగనుంది. అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌లో ఓడిపోయే జట్టుతో ఫ్రాన్స్ తలపడుతుంది. టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌కు ఇచ్చే గోల్డెన్ బూట్ అవార్డు కోసం ఎంబప్పే ఈ మ్యాచ్‌లో టాప్ ప్లేస్‌ను కాపాడుకోవాలని చూస్తున్నాడు.