FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ షురూ.. స్టేడియంలో షకీరా ఊరమాస్ డాన్స్.. సౌతాఫ్రికాను చితక్కొట్టిన మెక్సికో

Published : Jun 12, 2026, 07:22 AM IST

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. మెక్సికోలోని ఎస్టాడియో అజ్టెకా స్టేడియంలో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై మెక్సికో 2-0 తో ఘనవిజయం సాధించింది.

PREV
14
FIFA World Cup 2026: హిస్టారికల్ స్టేడియంలో అదిరిపోయిన ఓపెనింగ్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. చరిత్రలోనే అత్యంత పెద్ద ఫుట్‌బాల్ పండగ ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. మెక్సికో సిటీలోని ‘ఎస్టాడియో అజ్టెకా’ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో కో-హోస్ట్ మెక్సికో అదరగొట్టింది. సౌతాఫ్రికాతో జరిగిన ఈ హోరాహోరీ పోరులో 2-0 తేడాతో మెక్సికో క్లీన్ విక్టరీ కొట్టింది.

ఈసారి వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ మూడు దేశాలు (అమెరికా, మెక్సికో, కెనడా) కలిసి ఈ టోర్నీని హోస్ట్ చేస్తున్నాయి. మొత్తం 48 టీమ్స్ 104 మ్యాచ్‌ల్లో కప్పు కోసం పోటీ పడబోతున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం మెక్సికో సిటీ స్టేడియం సరికొత్తగా ముస్తాబైంది. మూడు వేర్వేరు వరల్డ్ కప్ ఎడిషన్ల (1970, 1986, 2026) నిర్వహణతో అజ్టెకా స్టేడియం వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

24
స్టేడియంను షేక్ చేసిన షకీరా, బర్నా బాయ్ డాన్స్

మ్యాచ్ కంటే ముందు జరిగిన ఓపెనింగ్ సెర్మనీ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో జరిగింది. ల్యాటిన్, ఆఫ్రికన్, ఇంటర్నేషనల్ పాప్ స్టార్స్ స్టేడియంలో అదరగొట్టారు. గ్లోబల్ పాప్ క్వీన్ షకీరా స్టేడియంలోకి ఎంట్రీ ఇవ్వగానే అభిమానులు అరుపులతో స్టేడియం దద్దరిల్లిపోయింది. నైజీరియన్ ఆఫ్రోబీట్స్ లెజెండ్ బర్నా బాయ్‌తో కలిసి షకీరా చేసిన పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. 

వీరిద్దరూ కలిసి ఫిఫా వరల్డ్ కప్ 2026 అఫీషియల్ సాంగ్ “డై డై” (Dai Dai) పాడుతూ వేసిన స్టెప్పులకు అభిమానులు పిచ్చెక్కిపోయారు. వీరితో పాటు కొలంబియన్ సింగర్ జె బాల్విన్ కూడా తన పాటలతో స్టేడియంలోని వేలాది మందిని ఊపేశాడు. సాంప్రదాయ ‘పాపెల్ పికాడో’ (పేపర్ ఆర్ట్) థీమ్‌తో స్టేడియం రూఫ్‌ టాప్ నుంచి వేలాది కలర్‌ఫుల్ బ్యానర్లు వేలాడదీసి, స్టేడియంను కలర్‌ఫుల్‌గా మార్చేశారు.

34
ఫస్ట్ హాఫ్‌లోనే మెక్సికో సూపర్ గోల్

టాస్ గెలిచి రంగంలోకి దిగిన మెక్సికో టీమ్ గ్రీన్ జెర్సీలో, సౌతాఫ్రికా టీమ్ ఎల్లో జెర్సీలో మెరిశాయి. మ్యాచ్ స్టార్ట్ అయిన 9వ నిమిషంలోనే మెక్సికో ప్లేయర్ జూలియన్ క్వినోన్స్ అదిరిపోయే గోల్ చేసి టీమ్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్‌తో స్టేడియంలోని 83 వేల మంది అభిమానులు ఖుషీతో ఎగిరి గంతేశారు.

ఆ తర్వాత 17వ నిమిషంలో సౌతాఫ్రికా ప్లేయర్ మొకోయెనాకు టోర్నీలోనే ఫస్ట్ ఎల్లో కార్డ్ ఇచ్చాడు రెఫరీ. ఈ మ్యాచ్‌లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఫిఫా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ ‘హైడ్రేషన్ బ్రేక్’ రూల్‌ను తీసుకొచ్చారు. మ్యాచ్ 24వ నిమిషంలో ప్లేయర్స్ నీళ్లు తాగి ఫ్రెష్ అవ్వడానికి రెఫరీ విజిల్ ఊదాడు. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి మెక్సికో 1-0 తో లీడ్‌లో కొనసాగింది.

44
సెకండ్ హాఫ్‌లో రెడ్ కార్డ్స్ జాతర.. హిమినెజ్ హెడర్ గోల్

సెకండ్ హాఫ్ మొదలవగానే మ్యాచ్ మరింత హీటెక్కింది. 50వ నిమిషంలో సౌతాఫ్రికా ప్లేయర్ యాయా సిథోలెకు రెఫరీ రెడ్ కార్డ్ చూపించి గ్రౌండ్ బయటకు పంపించేశాడు. ఈ వరల్డ్ కప్‌లో పడిన మొదటి రెడ్ కార్డ్ ఇదే. ఆ తర్వాత మెక్సికో స్టార్ ప్లేయర్ రావుల్ హిమినేజ్, అల్వరాడో ఇచ్చిన క్రాస్ పాస్‌ను సూపర్ హెడర్ ద్వారా గోల్‌గా మార్చి టీమ్‌ను 2-0 తో ముందంజలో నిలిపాడు.

దీంతో హిమినేజ్ వరల్డ్ కప్‌లో తన ఖాతా ఓపెన్ చేశాడు. మ్యాచ్ చివర్లో అభిమానులకు అసలైన డ్రామా కనిపించింది. 84వ నిమిషంలో సౌతాఫ్రికాకు చెందిన థెంపా జ్వానేకు రెండో రెడ్ కార్డ్ పడింది. ఇక ఇంజూరీ టైమ్‌లో (90+2 నిమిషంలో) మెక్సికో ప్లేయర్ సిజార్ మోంటెస్‌కు కూడా రెడ్ కార్డ్ ఇవ్వడంతో మ్యాచ్‌లో మొత్తం మూడు రెడ్ కార్డ్స్ నమోదయ్యాయి.

Read more Photos on
click me!

Recommended Stories