FIFA World Cup 2026: లియోనెల్ మెస్సీ మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. ఫస్ట్ టైమ్ వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ గోల్స్ !

Published : Jun 17, 2026, 10:20 AM ISTUpdated : Jun 17, 2026, 10:24 AM IST

Lionel Messi : ఫిఫా వరల్డ్ కప్ 2026లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ కొట్టి మిరోస్లావ్ క్లోస్ రికార్డ్‌ను సమం చేశాడు. మరో గోల్ చేస్తే కొత్త హిస్టరీ అవుతుంది.

PREV
16
రోనాల్డో రికార్డ్ బద్దలు కొట్టిన మెస్సీ.. హ్యాట్రిక్ గోల్స్ తో దుమ్మురేపాడు

ఫుట్‌బాల్ గాడ్, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఊహించని రేంజ్‌లో రెచ్చిపోయాడు. కెన్సాస్ సిటీలో అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ సంచలన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వరల్డ్ కప్ హిస్టరీలోనే మెస్సీ తన ఫస్ట్ హ్యాట్రిక్ గోల్‌ను నమోదు చేసి రికార్డుల దుమ్ము దులిపాడు.

ఈ అదిరిపోయే పర్ఫామెన్స్‌తో వరల్డ్ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోస్ ఆల్‌టైమ్ రికార్డ్‌ను మెస్సీ సమం చేశాడు. ప్రస్తుతం 37 ఏళ్ల వయసున్న మెస్సీ, వరల్డ్ ఛాంపియన్ టీమ్ అర్జెంటీనాను 3-0 తేడాతో ముందంజలో నిలిపాడు. దీంతో మెస్సీ వరల్డ్ కప్ కెరీర్ గోల్స్ సంఖ్య 16కు చేరింది.

26
ఫిఫా వరల్డ్ కప్ రికార్డ్ సమం.. టాప్‌లో మెస్సీ

జర్మనీకి చెందిన లెజెండరీ ఫుట్‌బాలర్ మిరోస్లావ్ క్లోస్ పేరిట ఉన్న వరల్డ్ కప్ మోస్ట్ గోల్స్ రికార్డ్‌ను మెస్సీ ఇప్పుడు ఈక్వల్ చేశాడు. క్లోస్ 2002 నుంచి 2014 మధ్య జరిగిన నాలుగు వరల్డ్ కప్ టోర్నమెంట్లలో మొత్తం 24 మ్యాచ్‌లు ఆడి 16 గోల్స్ చేశాడు. ఇప్పుడు మెస్సీ కూడా 16 గోల్స్‌తో క్లోస్ పక్కన జాయింట్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. జర్మనీ ప్లేయర్ వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేయడానికి మెస్సీ కేవలం ఒక్క గోల్ దూరంలో ఉన్నాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో మెస్సీ మరో గోల్ కొడితే 17 గోల్స్‌తో హిస్టరీలోనే ఎవరికీ సాధ్యం కాని మైలురాయిని అందుకుంటాడు.

36
రోనాల్డో సరసన లియోనెల్ మెస్సీ

ఈ మ్యాచ్‌తో మెస్సీ ఖాతాలో మరో రేర్ ఫీట్ చేరింది. వరల్డ్ కప్ హిస్టరీలో మెస్సీకి ఇదే మొదటి హ్యాట్రిక్ కావడం విశేషం. అంతేకాదు, వరుసగా ఐదు వేర్వేరు వరల్డ్ కప్ టోర్నమెంట్లలో గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ కేవలం క్రిస్టియానో రోనాల్డో పేరిట మాత్రమే ఉంది. ఇప్పుడు రోనాల్డో సరసన మెస్సీ జాయింట్ సెకండ్ ప్లేస్‌లో నిలిచి తన రేంజ్ ఏంటో చూపించాడు.

46
మైదానంలో మెస్సీ మ్యాజిక్ గోల్స్ ఇలా..

అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ గోల్స్ కొట్టిన విధానం అభిమానులకు పూనకాలు తెప్పించింది.

  1.  ఫస్ట్ గోల్: మెస్సీ ఒక పవర్‌ఫుల్ షాట్‌తో మ్యాచ్‌లో ఫస్ట్ గోల్ చేశాడు. అల్జీరియా కీపర్ లుకా జిదాన్ తన వేళ్లతో ఆపాలని ట్రై చేసినా ఆ బుల్లెట్ లాంటి షాట్‌ను ఆపడం ఎవరి వల్లా కాలేదు.
  2.  సెకండ్ గోల్: అలెక్సిస్ మెక్ అలిస్టర్ కొట్టిన షాట్‌ను కీపర్ జిదాన్ సరిగ్గా హోల్డ్ చేయలేకపోయాడు. బంతి చేతుల్లోంచి జారడంతో అలర్ట్ అయిన మెస్సీ.. రిబౌండ్‌లో వెంటనే బంతిని నెట్‌లోకి పంపాడు.
  3.  థర్డ్ గోల్ : పెనాల్టీ ఏరియా ఎడ్జ్‌లో నిలబడిన ఇంటర్ మియామి స్టార్ మెస్సీకి నికో గొంజాలెజ్ బంతిని పాస్ చేశాడు. మెస్సీ సింగిల్ టచ్‌తో బంతిని తన ఎడమకాలి అవుట్‌సైడ్‌కు తీసుకుని, పెనాల్టీ ఏరియా బయటి నుంచే గ్రౌండ్ లెవెల్‌లో అదిరిపోయే షాట్ కొట్టాడు. బంతి నేరుగా గోల్ పోస్ట్ లెఫ్ట్ కార్నర్‌లోకి దూసుకెళ్లింది. ఈ గోల్‌తో అల్జీరియా ఓటమి పక్కా అయిపోయింది.
56
ఫిఫా వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్లు వీరే

ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక గోల్స్ చేసిన టాప్ ప్లేయర్స్ లిస్ట్ చూస్తే..

• మిరోస్లావ్ క్లోస్ (జర్మనీ) / లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా) - 16 గోల్స్

• రోనాల్డో (బ్రెజిల్) - 15 గోల్స్

• గెర్డ్ ముల్లర్ (జర్మనీ) / కిలియన్ ఎంబాప్పే (ఫ్రాన్స్) - 14 గోల్స్

జర్మనీ ప్లేయర్ క్లోస్ 2002, 2006 వరల్డ్ కప్‌లలో 5-5 గోల్స్ చొప్పున చేశాడు. 2010లో 4 గోల్స్, తన లాస్ట్ వరల్డ్ కప్‌లో 2 గోల్స్ చేశాడు.

66
రోసారియో వీధుల నుంచి వరల్డ్ రికార్డుల దాకా..

మెస్సీ ఫిఫా వరల్డ్ కప్ జర్నీ 2006లో స్టార్ట్ అయింది. ఇప్పటివరకు వరల్డ్ కప్‌లో అత్యధికంగా 27 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా మెస్సీ రికార్డ్ సృష్టించాడు. అర్జెంటీనా తరఫున వరల్డ్ కప్‌లో అత్యధికంగా 16 గోల్స్ చేసింది కూడా మెస్సీనే. 1987లో అర్జెంటీనాలోని రోసారియోలో ఒక ఫుట్‌బాల్ లవర్స్ ఉన్న ఫ్యామిలీలో మెస్సీ పుట్టాడు. చిన్నప్పుడు తన అన్నలతో కలిసి ఇంటి ఆవరణలో ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు.. ఈ పిల్లాడు ఒకరోజు ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ప్లేయర్ అవుతాడని, ఫుట్‌బాల్ సామ్రాజ్యాన్ని ఏలుతాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ నేడు మెస్సీ చరిత్రను తిరగరాస్తున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories